రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కర్ణాటకలోని హసన్ జిల్లా జాతీయ రహదారి-373లోని యదేగౌడనహళ్లి నుండి అర్జునహళ్లి వరకు 4-లేనింగ్ పనుల కోసం రూ. 576.22 కోట్లు మంజూరు చేసిన శ్రీ నితిన్ గడ్కరీ

Posted On: 15 MAR 2024 11:31AM by PIB Hyderabad

కర్ణాటక హాసన్ జిల్లాలో 22.3 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న జాతీయ రహదారి-373లోని యెడగౌడనహళ్లి నుండి అర్జునహళ్లి సెక్టర్ వరకు 4-వరుసల రోడ్డు నిర్మాణం కోసం రూ.576.22 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఒక పోస్టులో తెలిపారు. చికమగళూరు, బేలూరు, హళేబీడు, శ్రావణ బెళగొళ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు ఈ కారిడార్ ఒక ముఖ్యమైన లింక్‌గా పనిచేస్తుందని శ్రీ గడ్కరీ చెప్పారు. ప్రాజెక్ట్ యొక్క అమలు మెరుగైన కనెక్టివిటీని వాగ్దానం చేస్తుంది.. పర్యాటకాన్ని ఉత్తేజపరిచేందుకు మరియు ప్రాంతంలో ఆర్థిక ప్రయత్నాలను ఉత్తేజపరిచేందుకు సిద్ధంగా నిలుస్తుందని అన్నారు.

***


(Release ID: 2015124)