విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గుజ‌రాత్‌లోని క‌చ్ఛ్ జిల్లాలోని ఖావ్డా వ‌ద్ద 200 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును అభివృద్ధి చేయ‌నున్న ఎన్‌హెచ్‌పిసి

Posted On: 15 MAR 2024 3:14PM by PIB Hyderabad

భార‌త‌దేశానికి చెందిన అగ్ర జ‌ల‌విద్యుత్ కంపెనీ, విద్యుత్ మంత్రిత్వ శాఖ కింద ప‌ని చేస్తున్న కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ ఎన్‌హెచ్‌పిసి లిమిటెడ్ గుజ‌రాత్‌లోని క‌చ్చ్ జిల్లాలో ఖావ్దా వ‌ద్ద గుజ‌రాత్ రాష్ట్ర విద్యుత్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (జిఎస్ఇసిఎల్‌)కు చెందిన 1,125 మెగావాట్ల పున‌రుత్పాద‌న ఇంధ‌న పార్కులో 200 మెగావాట్ల సామ‌ర్ధ్యం క‌లిగిన సౌర విద్యుత్ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు బిడ్‌ను గెలుచుకుంది. 
ప్రారంభించిన తొలి సంవ‌త్స‌రంలో ఈ ప్రాజెక్టు 473 మిలియ‌న్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేయ‌డ‌మే కాక  25 సంవ‌త్స‌రాల కాలంలో ప్రాజెక్ట్ నుంచి సంచిత ఇంధ‌న ఉత్ప‌త్తి సుమారు 10,850 మిలియ‌న్ యూనిట్లుగా ఉంటుంది. ఈ ప్రాజెక్టును బిల్డ్ - ఓన్ - ఆప‌రేట్ (నిర్మించు- కొనుగోలు చేయి- నిర్వ‌హించు) ప్రాతిప‌దిక‌న రూ. 847 కోట్ల తాత్కాలిక అభివృద్ధి వ్య‌యంతో    ఎన్‌హెచ్‌పిసి అభివృద్ధి చేస్తుంది. 
ప్రాజెక్టు కోసం ఇ-రివ‌ర్స్ వేలాన్ని గుజ‌రాత్ ఊర్జా వికాస్ నిగ‌మ్ లిమిటెడ్ 2 మార్చి 2024న నిర్వ‌హించింది. దీనికి సంబంధించిన లెట‌ర్ ఆఫ్ ఇంటెంట్‌ను 14 మార్చి 2024న జారీ అయింది. ఈ ప్రాజెక్టు యూనిట్ రూ. 2.66 వ‌ద్ద స్వంతం చేసుకుంది. దీనిని 18 నెల‌ల కాలంలో పూర్తి చేస్తారు. 

***


(Release ID: 2015120) Visitor Counter : 142