గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

పశుసంవర్ధక రంగంలో జీవనోపాధి జోక్యాన్ని సమన్వయం చేయడానికి భారత్ ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ లిమిటెడ్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న భారత గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ


ఆదాయాన్ని పెంచడంతో పాటు కుటుంబాల పోషకాహార అవసరాలను తీర్చడంలో పశుసంపద కీలకం: శ్రీ చరణ్ జిత్ సింగ్

Posted On: 15 MAR 2024 4:26PM by PIB Hyderabad

పశు, మత్స్య రంగాల అభివృద్ధిలో డి ఎ వై- ఎన్ఆర్ఎల్ఎం కార్యకలాపాలను సమకాలీకరించడం ద్వారా వారి జీవనోపాధి జోక్యానికి మద్దతు ఇవ్వడానికి భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ భారత్ ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ లిమిటెడ్ (బి ఎఫ్ ఐ ఎల్) తో నాన్ ఫైనాన్షియల్ ఎంఒయు  కుదుర్చుకుంది.

ఈ అవగాహన ఒప్పందంపై గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ చరణ్ జిత్ సింగ్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శ్రీ జె శ్రీధరన్ న్యూఢిల్లీలో సంతకాలు చేశారు. ఎంఒయు పై సంతకాలు చేసిన కార్యక్రమంలో ఎం ఒ ఆర్ డి జాయింట్ సెక్రటరీ శ్రీమతి స్మృతి శరణ్, డిప్యూటీ సెక్రటరీ శ్రీమతి నివేదిత ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీ రామన్ వాధ్వా, నేషనల్ మిషన్ మేనేజర్ డాక్టర్ వివేక్ కుంజ్, చీఫ్ పీపుల్ ఆఫీసర్ శ్రీ కిశోర్ సాంబశివం, చీఫ్ మేనేజర్లు డాక్టర్ ప్రేమ్ నాథ్ సింగ్, బి ఎఫ్ ఐ ఎల్. కు చెందిన శ్రీ అసద్ అహ్మద్ పాల్గొన్నారు.

ఆదాయాన్ని పెంచడంతో పాటు కుటుంబాల పోషకాహార అవసరాలను తీర్చడంలో పశుసంపద కీలకమని శ్రీ చరణ్ జిత్ సింగ్ పేర్కొన్నారు. స్పష్టమైన అవుట్ పుట్స్ తో సాచ్యురేషన్ విధానంపై పనిచేయాలని ఆయన ఉద్ఘాటించారు. బిఎఫ్ఐఎల్ ఇప్పటికే జెఎల్ జి ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలతో కలిసి పనిచేస్తోందని, పశుసంవర్ధక రంగంలో ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారని, దీనిని క్రమబద్ధీకరించే మార్గాలను అన్వేషించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శ్రీ జె.శ్రీధరన్ భారత ప్రభుత్వంతో చేతులు కలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంగీకరించిన విధంగా ఉత్తమ పనితీరును కనబరచడానికి,  కమ్యూనిటీ ఉత్తమ ప్రయోజనాలను పొందడానికి బి ఎఫ్ ఐఎల్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా జాతీయ స్థాయిలో డే-ఎన్ఆర్ఎల్ఎం కు మద్దతు ఇవ్వడానికి ప్రాథమిక దశలో సెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పిఎంయు) ను ఏర్పాటు చేస్తారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, బీహార్ లలో. రాష్ట్ర పిఎంయు ను అభివృద్ధి చేస్తారు. పిఎంయులో పశువులకు చెందిన నిపుణులు (సంబంధిత రాష్ట్రంలో అవసరాన్ని బట్టి), మార్కెట్ లింకేజ్ మొదలైనవి ఉంటాయి. జంతువులకు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అందించడం కోసం  డే-ఎన్ఆర్ఎల్ఎం  కింద అభివృద్ధి చేసిన  పశు సఖిలను (గ్రామంలోని చివరి మైలు విస్తరణ కార్మికులు) కూడా బి ఎఫ్ ఐ ఎల్ బలోపేతం చేస్తుంది.

చొరవ లో భాగంగా పశుసంవర్థక క్లస్టర్ ఫెసిలిటేషన్, ఐటి ఆధారిత పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం, డే-ఎన్ఆర్ఎల్ఎం స్వయం సహాయక బృందాల కుటుంబాలకు పశువైద్య సంరక్షణ, ఫెసిలిటేషన్ మద్దతును కూడా అందిస్తారు. 

***



(Release ID: 2015118) Visitor Counter : 106


Read this release in: English , Urdu , Hindi , Tamil