మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో సాగర్ పరిక్రమ కార్యక్రమంపై పుస్తకం మరియు వీడియోను విడుదల చేసిన కేంద్ర మంత్రి శ్రీ పర్షోత్తమ్ రూపాలా
సాగర్ పరిక్రమ యాత్రకు సంబంధించినసముద్ర మార్గం, సాంస్కృతిక మరియు భౌగోళిక అన్వేషణలు మరియు సాగర్ పరిక్రమలోని మొత్తం 12 దశల నుండి గుర్తించదగిన ప్రభావాలు వంటి విభిన్న అంశాలకు సంబంధించిన విషయాలను వివరించడం ఈ పుస్తక లక్ష్యం.
Posted On:
15 MAR 2024 4:52PM by PIB Hyderabad
ఫిషరీస్ డిపార్ట్‌మెంట్, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఈరోజు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో రాజ్‌కోట్ ఇంజినీరింగ్ అసోసియేషన్‌లో సాగర్ పరిక్రమ కార్యక్రమంపై పుస్తకం మరియు వీడియో విడుదల వేడుకను నిర్వహించింది. సాగర్ పరిక్రమ కార్యక్రమానికి సంబంధించిన పుస్తకాలు మరియు వీడియో విడుదల వేడుకను కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా ప్రారంభించారు.
'సాగర్ పరిక్రమ' ప్రయాణంపై పుస్తకం మరియు వీడియోను శ్రీ పర్షోత్తం రూపాలా ఆవిష్కరించారు. ఇది దేశంలోని మత్స్యకారుల సముదాయాన్ని సాధికారత దిశగా తీసుకువెళ్లేందుకు స్ఫూర్తినిస్తుంది. ఈ కార్యక్రమంలో శ్రీ వాజుభాయ్ వాలా, మాజీ గవర్నర్, శ్రీ మోహన్‌భాయ్ కుందారియా, పార్లమెంటు లోక్‌సభ సభ్యుడు, శ్రీ రాంభాయ్ మొకారియా, రాజ్యసభ సభ్యుడు , వర్చువల్ మోడ్ ద్వారా డా. అభిలాక్ష్ లిఖి, డిఓఎఫ్ కార్యదర్శి, శ్రీమతి నీతూ కుమారి ప్రసాద్, జాయింట్. సెక్రటరీ, ఎన్‌ఎఫ్‌డిబి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ ఎల్.ఎన్.మూర్తి, గుజరాత్ ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ శ్రీ నరేంద్ర కుమార్ మీనా, స్వామి పరమాత్మానంద సరస్వతి కూడా పాల్గొన్నారు.
05.03.2022న గుజరాత్‌లోని మాండ్వి నుంచి ప్రారంభమై 11.01.2024న పశ్చిమ బెంగాల్‌లోని గంగాసాగర్ వరకూ 12 దశల్లో 12 తీరప్రాంత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుతూ ముగిసిన చారిత్రక ప్రయాణంలో తన అనుభవాన్ని కేంద్ర మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా పంచుకున్నారు. సాగర్ పరిక్రమ సమయంలో సముద్ర ప్రయాణం కొన్నిసార్లు కఠినమైన పరిస్థితుల కారణంగా చాలా సవాలుగా ఉండేదని అయితే మన మత్స్యకారులు ఎదుర్కొంటున్న వాస్తవ ఇబ్బందులు మరియు రోజువారీ సవాళ్లను అర్థం చేసుకోవడంలో ఇది ఒక అభ్యాస అనుభవం మరియు కీలకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మత్స్యకారుల సంఘాలను మెరుగుపరచడం కోసం భారత ప్రభుత్వం తీసుకోవలసిన వివిధ కార్యక్రమాలకు సాగర్ పరిక్రమ ఫీడ్‌బ్యాక్, సూచనలు మరియు ఆన్-గ్రౌండ్ అనుభవం ఈ రంగానికి సంబంధించిన పాలసీ మరియు స్కీమ్ రూపకల్పనలో చాలా ముఖ్యమైనవని చెప్పారు.
సాగర్ పరిక్రమను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన మత్స్యకారులు, ఇండియన్ కోస్ట్ గార్డ్, అన్ని కోస్టల్ స్టేట్/యుటి ప్రభుత్వాలు, సముద్ర తీర బోర్డులు మరియు ఇతర వాటాదారుల మద్దతు గురించి శ్రీ రూపాలా ప్రత్యేకంగా ప్రస్తావించారు. సాగర్ పరిక్రమ సందర్భంగా ఓ రాత్రి ఒరిస్సాలోని చిలికా సరస్సులో చిక్కుకున్న సంఘటనను గుర్తుచేసుకున్న కేంద్ర మంత్రి..తనను మరియు ఇతర ప్రముఖులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన మత్స్యకారులకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీ రూపాలా ఈ యాత్ర యొక్క ప్రాముఖ్యతను ఓ ఉదాహరణతో వివరించారు. మహారాష్ట్రలో సాగర్ పరిక్రమ యాత్రలో పాల్గొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి మత్స్యకారుల వలలు కాలిపోయిన ఘటన వచ్చిందని దీంతో వెంటనే ఆయన ఆర్థిక సహాయం అందించారని చెప్పారు.
డాక్టర్ అభిలాక్ష్ లిఖి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేడుకను ఉద్దేశించి ప్రసంగించారు మరియు మత్స్యకారుల సమస్యలు మరియు సవాళ్లను అర్థం చేసుకోవడానికి ఈ యాత్ర 44 రోజుల్లో 7,989 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని చుట్టి, సుమారు 3,071 మత్స్యకార గ్రామాలను చేరిందని చెప్పారు. సుమారు 1000 మంది ప్రాతినిధ్యాలు వచ్చాయని, శాఖ తగిన చర్యలు తీసుకుంటోందని శ్రీ లిఖి పేర్కొన్నారు.
శ్రీమతి నీతూ కుమారి ప్రసాద్ తన ప్రసంగంలో సాగర్ పరిక్రమ మరియు దాని ప్రాముఖ్యత గురించి సంక్షిప్తంగా వివరించారు.
సాగర్ పరిక్రమ యాత్రను పూర్తిగా వివరించే లక్ష్యంతో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. సముద్ర మార్గం, సాంస్కృతిక మరియు భౌగోళిక అన్వేషణలు మరియు సాగర్ పరిక్రమలోని మొత్తం 12 దశల నుండి గుర్తించదగిన ప్రభావాలు వంటి విభిన్న అంశాలకు సంబంధించిన విషయాలను సాగర్ పరిక్రమ యాత్రను వివరించడం ఈ పుస్తకం యొక్క లక్ష్యం.
సాగర్ పరిక్రమ కార్యక్రమం భారతదేశ గొప్ప సముద్ర వారసత్వానికి నిదర్శనం. ఇది సముద్రాలతో దేశ శాశ్వత సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ పుస్తకం ఈ ఇతిహాస ప్రయాణానికి సమగ్ర డాక్యుమెంటేషన్‌గా పనిచేస్తుంది. సముద్ర మార్గంలో ప్రయాణించడం, చేపట్టిన సాంస్కృతిక మరియు భౌగోళిక అన్వేషణలు మరియు సాగర్ పరిక్రమలోని మొత్తం 12 దశల్లో చూసిన విశేషమైన ప్రభావాలను అందిస్తుంది.
మత్స్య రంగం సూర్యోదయ రంగంగా పరిగణించబడుతుంది మరియు సమాజంలోని బలహీన వర్గాలకు ఆర్థిక సాధికారత ద్వారా సమానమైన మరియు సమ్మిళిత వృద్ధిని తీసుకురావడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. భారతదేశం 3వ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారు, 2వ అతిపెద్ద ఆక్వాకల్చర్ ఉత్పత్తిదారు, అతిపెద్ద రొయ్యల ఉత్పత్తిదారు మరియు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సముద్ర ఆహార ఎగుమతిదారు. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ మత్స్యకార సంబంధిత పథకాలు మరియు కార్యక్రమాలపై సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి మరియు మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా అర్థం చేసుకోవడానికి మత్స్యకారులు, తీర ప్రాంత వర్గాలు మరియు వాటాదారులతో పరస్పర చర్చను సులభతరం చేయడానికి సాగర్ పరిక్రమ చేపట్టబడింది.
***
(Release ID: 2015116)
Visitor Counter : 115