వ్యవసాయ మంత్రిత్వ శాఖ

వంట నూనె రంగం స్వావలంబన సాధన కోసం ప్రణాళిక


ఈశాన్య భారతదేశంలో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ కింద ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లు ప్రారంభం

Posted On: 14 MAR 2024 3:23PM by PIB Hyderabad

వంట నూనె రంగంలో స్వావలంబన ( ఆత్మ నిర్భర్ భారత్) సాధించాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఈశాన్య భారతదేశంలో  అమలు చేస్తున్న మిషన్ ఆయిల్ పామ్ మిషన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి వివరించారు. మిషన్ లో   భాగంగా ఏర్పాటైన మొదటి ఆయిల్ మిల్లు ను ప్రధానమంత్రి ప్రారంభించారు. " వంట నూనె రంగంలో స్వావలంబన సాధించడానికి మిషన్ ఆయిల్ పామ్ దోహదపడుతుంది. దీనివల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగు చేపట్టిన రైతులను ప్రధానమంత్రి అభినందించారు.

2021 ఆగస్టు లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్- ఆయిల్ పామ్ మిషన్ ను ప్రారంభించింది. ఆయిల్ పామ్ సాగును ఎక్కువ చేసి నూనె ఉత్పత్తి పెంచడం లక్ష్యంగా మిషన్ అమలు జరుగుతుంది.దేశంలో 2025-26 నాటికి 11.20 లక్షల టన్నుల ముడి ఆయిల్ పామ్ ఉత్పత్తి జరిగే విధంగా చూసేందుకు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్- ఆయిల్ పామ్ ద్వారా కారయ్కర్మాలు అమలు జరుగుతాయి. మిషన్ కోసం ప్రభుత్వం 11,040 కోట్ల రూపాయలు కేటాయించింది. మొత్తం కేటాయింపుల్లో 5,870 కోతల రూపాయలను ఈశాన్య ప్రాంతానికి ప్రభుత్వం కేటాయించింది. మొత్తం నిధుల్లో కేంద్రం 90%  నిధులు విడుదల చేస్తుంది. 

రైతులకు పూర్తి సహకారం అందించి నూతన భౌగోళిక ప్రాంతాలలో ఆయిల్ పామ్ సాగును మిషన్ ప్రోత్సహిస్తుంది.రైతులకు అవసరమైన మొక్కలు సరఫరా చేయడం, ఉత్పత్తిని ప్రైవేట్ సంస్థలు కొనుగోలు చేయడానికి, ప్రపంచ ధరల అస్థిరత నుండి రైతులను రక్షించడానికి నష్టాలను నివారించడానికి  ఆచరణీయ గ్యాప్ ధర అందించడం లాంటి కార్యక్రమాలు మిషన్ కింద అమలు జరుగుతాయి. 

వంట నూనెల రంగంలో స్వావలంబన సాధించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో ఈశాన్య ప్రాంత రాష్ట్రాల పాత్ర కీలకంగా ఉంటుంది. ఆయిల్ పామ్ సాగు చేపట్టడానికి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో 8.4 లక్షల హెక్టార్ల భూమి అందుబాటులో  ఉంది, ఇది జాతీయ సామర్థ్యంలో 38%. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇప్పటికే  30 లక్షల మొక్కలు కలిగిన 30కి పైగా నర్సరీలు ఏర్పాటు చేశారు.

ఈశాన్య ప్రాంతానికి చెందిన  రైతులు ఎదుర్కొంటున్న స్థల సంబంధిత సమస్యలు   (భూమి క్లియరెన్స్, హాఫ్-మూన్ టెర్రస్ నిర్మాణం, బయో ఫెన్సింగ్) పరిష్కరించడానికి, మొక్కలు నాటడం, నిర్వహణ కోసం మిషన్ కింద  రైతులకు హెక్టారుకు రూ. 1,00,000 ప్రత్యేక సహాయం అందిస్తారు. . పామాయిల్ సాగుకు అవసరమైన పరికరాలు కొనుగోలు కోసం మిషన్ రూ.2,90,000 అందజేస్తోంది.
ఈశాన్య ప్రాంతంలో ఎదురవుతున్న ప్రత్యకే సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంత 
 రైతులకు CPO ధరపై 2% వ్యత్యాసాన్ని కేంద్ర  ప్రభుత్వం చెల్లిస్తుంది.ఈ వెసులుబాటు లేని పక్షంలో  CPO ధరపై ఈ 2% లేకపోతే ప్రాసెసర్‌లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రాసెసర్‌లకు ప్రోత్సాహం అందించి, అభివృద్ధి చేయడానికి ఈశాన్య ప్రాంతంలో 2%   వ్యత్యాసాన్ని చెల్లించి పరిశ్రమలకు తగిన ప్రోత్సాహం అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
ఈశాన్య ప్రాంతంలో ప్రాసెసింగ్ సౌకర్యాలు అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చే ప్రైవేటు రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఈశాన్య ప్రాంతంలో పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ మిల్లుల స్థాపనను  ప్రోత్సహించడానికి ప్రభుత్వం 5 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది.  ఇప్పటి వరకు ఈశాన్య  ప్రాంతంలో 10 కొత్త ఆయిల్ మిల్లులు నెలకొల్పడానికి ప్రతిపాదనలు అందాయి.  
ఆర్థిక వృద్ధిని పెంపొందించడం, రైతులకు సాధికారత కల్పించడం,వంట నాణేల రంగంలో స్వావలంబన సాధించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి కార్యక్రమాలు అమలు చేస్తోంది.   కీలకమైన వంట నాణేల రంగంలో  స్వయం సమృద్ధి సాధించడానికి భారతదేశం అమలు చేస్తున్న కార్యక్రమాలకు చక్కటి ఉదాహరణ  నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్- ఆయిల్ పామ్ మిషన్. 

***



(Release ID: 2014753) Visitor Counter : 117


Read this release in: English , Urdu , Hindi , Tamil , Telugu