రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
తెలంగాణలో 435.29 కి.మీ. పొడవైన 31 రాష్ట్ర రహదారి ప్రాజెక్టుల విస్తరణ, ఆధునికీకరణ కోసం రూ.850.00 కోట్లు మంజూరు
Posted On:
14 MAR 2024 1:27PM by PIB Hyderabad
సీఆర్‌ఐఎఫ్ కింద, తెలంగాణలో మొత్తం 435.29 కి.మీ. పొడవైన 31 రాష్ట్ర రహదారి ప్రాజెక్టుల స్తరణ, ఆధునికీకరణ కోసం కోసం రూ.850.00 కోట్ల కేటాయింపులకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు.
ఈ చొరవ వల్ల స్థానిక పర్యాటకం, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని వెల్లడించారు. పర్యాటక అభివృద్ధిని ప్రోత్సహించడం, రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయని శ్రీ గడ్కరీ పేర్కొన్నారు.
***
(Release ID: 2014585)