ఆయుష్
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024 నిర్వహణ కోసం 100 రోజుల సన్నాహక కార్యక్రమాలు ప్రారంభం
సన్నాహక కార్యక్రమంలో భాగంగా ' మహిళల సాధికారత కోసం యోగ' అనే ఇతివృత్తంతో యోగ మహోత్సవం 2024 నిర్వహణ
మహిళలకు సాధికారత కల్పించి,మహిళలకు శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక, ఆధ్యాత్మిక భావాల సంరక్షణకు యోగ ఒక సమగ్ర సాధనంగా ఉపయోగపడుతుంది... వైద్య రాజేష్ కోటేచా
Posted On:
13 MAR 2024 1:30PM by PIB Hyderabad
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024 నిర్వహణ కోసం నిర్వహించనున్న 100 రోజుల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు విజ్ఞాన్ భవన్‌లో యోగ మహోత్సవం 2024 కార్యక్రమం జరిగింది. ' మహిళల సాధికారత కోసం యోగ' అనే ఇతివృత్తంతో యోగ మహోత్సవం 2024 ను నిర్వహించారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న నిర్వహిస్తున్నారు. . ఈ సంవత్సరం 10 సారి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతుంది.
కార్యక్రమంలో పాల్గొన్న ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేశ్ కొటేచా మాట్లాడుతూ యోగాకి మరింత ప్రాచుర్యం కల్పించి, మహిళల సంక్షేమం, ప్రపంచ ఆరోగ్యం, శాంతి సాధన లక్యంగా యోగ మహోత్సవం 2024 జరుగుతుందని తెలిపారు. వాస్తవ పరిస్థితి ఆధారంగా మహిళలకు సాధికారత కల్పించడానికి మహిళలపై ప్రభావం చూపే వివిధ అంశాలు, వయస్సు లేదా పరిస్థితి తో సంబంధం లేకుండా మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించడానికి, పిసిఒడి లేదా పిసిఒఎస్ , ఒత్తిడి నిర్వహణ వంటి వివిధ అంశాలపై జరిగిన అధ్యయనాలకు మంత్రిత్వ శాఖ చురుకుగా సహకారం అందించిందని ఆయన వివరించారు. మహిళలను సాధికారత కల్పించడానికి, వారి శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును కలిగి ఉండటానికి యోగా ఒక సమగ్ర సాధనంగా ఉంటుందన్నారు. సాధికారత పొందిన మహిళలు నాయకులుగా, విద్యావంతులుగా,మార్పు కోసం ప్రజలను ప్రభావితం చేయగలుగుతారని ఆయన వివరించారు. మహిళల కృషి వల్ల సాధికారత కలిగిన సమ్మిళిత,వైవిధ్య భరిత నూతన వ్యవస్థ అభివృద్ధి అవుతుందన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న ముంబైలోని యోగా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ శ్రీమతి హంసాజీ జయదేవ ‘సమతుల్యమైన మానసిక స్థితి యోగా’ అని అన్నారు. మంచి అలవాట్లు శాశ్వత విలువ అందిస్తాయని అన్నారు. మంచి అలవాట్లు జీవితాంతం మనిషి వెంట ఉంటాయన్నారు. ఇతరుల చర్యల వల్ల తనను తాను కలవర పెట్టుకోకుండా, వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరించడం, ఇతరులను అర్థం చేసుకుని ఆనందాన్ని పొందడానికి కృషి చేయాలన్నారు. యోగా ఒక అవగాహన శాస్త్రం అని శ్రీమతి జయదేవ్ అన్నారు. వ్యక్తులు వారి శరీరం, మనస్సు మరియు పర్యావరణం గురించి లోతైన అవగాహన పెంపొందించుకోవడానికి యోగ వీలు కల్పిస్తుందని ఆమె వివరించారు.
యోగా సంపూర్ణ జీవన శాస్త్రం అని బెంగళూరు SVYASA విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ హెచ్.ఆర్.నాగేంద్ర అన్నారు. ఆయుష్ ఆరోగ్య సంరక్షణ ముఖ్యంగా యోగాను దైనందిన జీవితంలో అనుసంధానించటం ద్వారా ఆధునిక జీవనశైలి రుగ్మతలకు దూరంగా ఉండడానికి, వ్యాధుల ద్వారా ఎదురయ్యే సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఆయన తెలిపారు. భారతదేశం పాటు ప్రపంచంలోని ప్రతి మూలకు యోగాను వ్యాప్తి చేయాలని డాక్టర్ నాగేంద్ర సూచించారు. ఈ ప్రపంచ ఉద్యమానికి నాయకత్వం వహించే సామర్థ్యం భారతదేశానికి ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయుష్ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి. కవితా గార్గ్, ఆయుష్ మంత్రిత్వ శాఖ డిడిజి సత్యజిత్ పాల్, ఆయుష్ మంత్రిత్వ శాఖ సలహాదారు (ఆయుర్వేద), వైద్య మనోజ్ నేసరి, నేషనల్ కమీషన్ ఆఫ్ హోమియోపతి చైర్మన్ డాక్టర్ అనిల్ ఖురానా, ఆయుష్ మంత్రిత్వ శాఖలోని అనేక మంది సీనియర్ అధికారులు పాల్గొన్నారు మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా (MDNIY) డైరెక్టర్ శ్రీమతి. విజయలక్ష్మి భరద్వాజ్ స్వాగతం పలికారు
డిజిటల్ సాంకేతికతతో మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా సాధించిన విజయాలను వివరించారు. ఆయుష్ యోగా పోర్టల్, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా వెబ్‌సైట్, నమస్తే యోగా, Y-బ్రేక్ యాప్ లాంటి ఆవిష్కరణలకు మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా శ్రీకారం చుట్టింది. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా రెండు భాషల్లో ఆధునీకరించిన సౌకర్యాలు కల్పించారు. ఆధునీకరించిన మొబైల్ యాప్‌లు ఆధునిక దృశ్యమానంగావినియోగదారులకు అవసరమైన సమాచారం అందిస్తాయి.Android, iOS వినియోగదారులు వీటిని ఉపయోగించవచ్చు. . యాప్‌లు వ్యక్తిగతీకరించిన యోగా రొటీన్‌లు, ప్రోగ్రెస్ ట్రాకింగ్, మెడిటేషన్ సెషన్‌లను అందిస్తాయి, తాజా సమాచారం కోసం రెగ్యులర్ అప్‌డేట్‌లు, బగ్ పరిష్కారాలు, పరికరాల అంతటా మెరుగైన అనుకూలత, మెరుగైన పనితీరు అందిస్తాయి.
యోగా మహోత్సవ్-2024 లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. థీమ్ ఆధారిత సాంకేతిక సదస్సులు (యోగా ద్వారా మహిళల ఆరోగ్యానికి సాధికారత, యోగా ద్వారా జీవితాన్ని మార్చడం) జరిగాయి. ప్యానెల్ చర్చ (యోగా ,మహిళా సాధికారత: విభిన్న కొలతలు), వై-బ్రేక్ , యోగా ప్రదర్శనలతో కార్యక్రమం ముగిసింది.
ప్రముఖ యోగా సంస్థలు, యోగా గురువులు, ఇతర ఆయుష్ వాటాదారుల సహకారంతో ప్రచారం కల్పించడం లక్ష్యంగా 100 రోజుల పాటు సన్నాహక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
***
(Release ID: 2014430)
Visitor Counter : 168