పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

భారతదేశం నుండి భూటాన్ కు పెట్రోలియమ్, ఆయిల్, లూబ్రికెంట్స్ (పిఒఎల్) మరియు తత్సంబంధిత ఉత్పత్తుల సామాన్య సరఫరా అంశం లోభారతదేశాని కి మరియు భూటాన్ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పైసంతకాల కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 13 MAR 2024 3:25PM by PIB Hyderabad

భారతదేశం నుండి భూటాన్ కు పెట్రోలియమ్, ఆయిల్, లూబ్రికెంట్స్ (పిఒఎల్) మరియు తత్సంబంధి ఉత్పత్తుల సామాన్య సరఫరా అంశం లో భారతదేశ ప్రభుత్వాని కి మరియు రాయల్ గవర్నమెంట్ ఆఫ్ భూటాన్ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పై సంతకాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలియ జేసింది.

 

ఈ ఒప్పందం ప్రత్యేకించి హైడ్రోకార్బన్ రంగం లో ఏ విధమైనటువంటి లింగ వివక్ష, వర్గ విచక్షణ లేదా ఆదాయ పక్షపాత దృక్పథానికి తావు ఇవ్వకుండా, భూటాన్ తో మెరుగైన ఆర్థిక మరియు వాణిజ్య సంబంధాల ద్వారా భారతదేశం మరియు భారతదేశం యొక్క పౌరులకు లాభాన్ని అందించే ధ్యేయం తో రూపొందింది.

 

ప్రయోజనం:

 

ఈ అవగాహన పూర్వక ఒప్పంద పత్రం హైడ్రోకార్బన్ రంగం లో ద్వైపాక్షిక వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంది; దీనికి తోడు, భూటాన్ కు పెట్రోలియమ్ ఉత్పత్తులు భద్రం గాను, దీర్ఘకాలిక ప్రాతిపదిక తో ను సరఫరా అయ్యేటందుకు పూచీ పడుతుంది.

 

ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడం లో ఎగుమతుల ది కీలక పాత్ర కాబట్టి, స్వయం సమృద్ధి యుక్త భారతదేశం దిశ లో ముందడుగు ను వేయడాని కి తగిన ప్రోత్సాహాన్ని ఈ ఎమ్ఒయు అందిస్తుంది.

 

ఈ ఎమ్ఒయు భారతదేశం అనుసరిస్తున్న ‘పొరుగు దేశాల కు ప్రాధాన్యం’ అనే విధానం లో భాగం గా శక్తి సంబంధి సేతువు రూపం లో వ్యూహాత్మకం గా ఉపయుక్తం గా ఉండగలదు.

 

***



(Release ID: 2014342) Visitor Counter : 55