రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

జాతీయ రహదారి 716 మీద,తమిళనాడు,ఆంధ్రప్రదేశ్ సరిహద్దునుంచి పుత్తూరు వరకు 20.03 కిలోమీటర్ల మేర ప్రస్తుతం రెండు లైన్ల జాతీయ రహదారి విస్తరణ పనులకు రూ 1346.81 కోట్ల రూపాయలు మంజూరు చేసిన కేంద్ర మంత్రి శ్రీ నితిన్గడ్కరి.

Posted On: 12 MAR 2024 12:45PM by PIB Hyderabad

జాతీయ రహదారి 716 మీద  తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దునుంచి పుత్తూరు వరకు 20,03 కిలోమీటర్లమేర ప్రస్తుత రెండు లైన్ల జాతీయ రహదారిని రూప1346.81 కోట్ల రూపాయల వ్యయంతో విస్తరించేందుకు కేంద్ర రోడ్డు రవాణా,జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరి ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని ఆయన ఒక పోస్ట్లో తెలిపారు. ఈ ప్రాజెక్టు  కింద ప్రస్తుత రెండు లైన్ల జాతీయ రహదారిని నాలుగులైన్ల రహదారిగా మార్చడంతోపాటు సైకిళ్లు ఇతర చిన్న వాహనాలు వెళ్లేందుకు కుడి ఎడమ వైపుల అదనపు రోడ్డు సదుపాయం కల్పిస్తారు. అదపంగా మల్లవరం నుంచి రేణిగుంటవరకు ప్రస్తుతం ఉన్న 17.40 కిలోమీలటర్ల నాలుగులైన్ల రహదారి ని ఆరు లైన్లకు విస్తరించడం తోపాటు కుడి ఎడమల అదనపు రోడ్డుసదుపాయాన్నికల్పిస్తారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల కిందకు వచ్చే ఈ పథకాన్ని పేకేజ్ 2 కింద  హెచ్.ఎ.ఎం విధానంలో నిర్మిస్తారు. ఈ రోడ్డు అభివృద్ధితో ఈ మార్గం యాక్సిస్ నియంత్రిత కారిడార్గా రూపుదిద్దుకుంటుందని మంత్రి తెలిపారు. ఇది తిరుత్తణి, తిరుపతి పుణ్యక్షేత్రాలకు అనుసంధానత మెరుగుపరచడంలో కీలకపాత్ర వహిస్తుందని తెలిపారు.

 

***



(Release ID: 2014314) Visitor Counter : 43


Read this release in: English , Urdu , Hindi , Tamil