ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశంలో స్నేక్‌బైట్ ఎన్వినోమింగ్ నివారణ, నియంత్రణ కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ - 'వన్ హెల్త్' స్ఫూర్తితో 2030 నాటికి పాముకాటు మరణాలను సగానికి తగ్గించాలన్నది లక్ష్యం


పాముకాటుపై బుక్‌లెట్, చేయాల్సినవి, చేయకూడని అంశాలతో పోస్టర్‌లు, పాముకాటు
అవగాహనపై 7 నిమిషాల వీడియోతో సహా ఐఈసి ప్రచార సామాగ్రి అందుబాటులోకి

పాముకాటుకు గురైన వ్యక్తులు, సంఘాలకు తక్షణ సహాయం, మార్గదర్శకత్వం, మద్దతు అందించే కీలక వనరు అయిన
స్నేక్‌బైట్ హెల్ప్‌లైన్ ఐదు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయడం

నేషనల్ రేబీస్ కంట్రోల్ ప్రోగ్రామ్ వెబ్‌సైట్ కూడా ప్రారంభం

దేశంలో జూనోటిక్ వ్యాధులపై నిఘాను పటిష్టం చేయడానికి ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇనిషియేటివ్ ప్లాట్‌ఫారమ్‌లో
జూనోసెస్ నివారణ, నియంత్రణ కోసం అమలులోకి నేషనల్ వన్ హెల్త్ ప్రోగ్రామ్

Posted On: 12 MAR 2024 5:17PM by PIB Hyderabad

భారతదేశంలో పాముకాటు ఎన్వినమింగ్ (NAP-SE) నివారణ, నియంత్రణ కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర ప్రారంభించారు. 2030 నాటికి పాముకాటు మరణాలను సగానికి తగ్గించాలనే లక్ష్యంతో, ఎన్ఏపిఎస్ఈ 'వన్ హెల్త్' విధానం ద్వారా పాముకాటుల నిర్వహణ, నివారణ, నియంత్రణ కోసం రాష్ట్రాలు వారి సొంత కార్యాచరణ ప్రణాళికను అభివృద్ధి చేయడానికి విస్తృత విధాన మార్గాన్ని అందిస్తుంది. మానవ, వన్యప్రాణులు, గిరిజన, జంతు ఆరోగ్య విభాగం కింద వివిధ  కార్యకలాపాలు అన్ని స్థాయిలలో సంబంధిత భాగస్వాముల చేత నిర్వహిస్తారు. 

ఈ సందర్బంగా ఐఈసి విభాగం ప్రచార సామాగ్రిని రూపొందించింది. పాముకాటు మరణాలకు అంతం పలుకుదాం అన్న శీర్షికతో చిన్న పుస్తకం ప్రజల అవగాహన కోసం రూపొందించారు. చేయకూడని, చేయాల్సిన విషయాలతో కూడిన పోస్టర్, ప్రజావగాహనకు ఏడు నిమిషాల వీడియో ని అందుబాటులోకి తెచ్చారు. ఈ సామాగ్రి ప్రజలలో అవగాహన పెంచడానికి, కీలకమైన సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి, పాముకాటును ఎదుర్కోడానికి  చురుకైన చర్యలు తీసుకోవడానికి కమ్యూనిటీలను శక్తివంతం చేయడానికి అమూల్యమైన సాధనాలుగా ఉపయోగపడతాయి.

పాముకాటు సంఘటనల వల్ల ప్రభావితమైన వ్యక్తులు, సంఘాలకు తక్షణ సహాయం, మార్గదర్శకత్వం, సహాయాన్ని అందించే కీలక వనరు అయిన స్నేక్‌బైట్ హెల్ప్‌లైన్ నంబర్ (15400) ఐదు రాష్ట్రాల్లో (పుదుచ్చేరి, మధ్యప్రదేశ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ) ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నారు.  ఈ ప్రయత్నం సామాన్య ప్రజలకు వైద్య సంరక్షణ, సమాచారం తక్షణ చర్యగా అందివ్వనున్నది. 

 



 

జూనోసెస్ (జంతువుల నుండి సంక్రమించే వ్యాధుల) నివారణ, నియంత్రణ కోసం నేషనల్ వన్ హెల్త్ ప్రోగ్రామ్ కూడా ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇనిషియేటివ్ ప్లాట్‌ఫారమ్‌లో చేర్చేరు. ఈ చొరవ దేశంలో జూనోటిక్ వ్యాధులపై నిఘాను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

నేపథ్యం: 

విషపూరిత పాము కాటు ప్రాణాంతక వ్యాధి. విషపూరితమైన పాము కాటు వైద్య సమస్యలకు దారి తీస్తుంది, ఇది సకాలంలో, సరైన చికిత్స అందించకపోతే ప్రాణాంతకం లేదా శాశ్వత బలహీనతకు దారితీస్తుంది. సురక్షితమైన, ప్రభావవంతమైన యాంటీవీనమ్‌లు అందుబాటులో ఉంచడం, సకాలంలో రవాణా, రిఫరల్‌కు తక్షణమే లభ్యతతో ఎక్కువ శాతం పాముకాటు విషపూరిత మరణాలు, విపత్తు పరిణామాలను నివారించవచ్చు.

భారతదేశంలో, సంవత్సరానికి 30-40 లక్షల పాముకాటు సంఘటనలు జరుగుతున్నాయి. దీని కారణంగా సుమారు 50,000 మరణాలు సంభవిస్తున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా పాముకాటు మరణాలలో సగం. దేశాలలో పాము కాటు బాధితుల్లో కొద్దిమంది మాత్రమే క్లినిక్‌లు మరియు ఆసుపత్రులకు నివేదిస్తున్నారు. (2016-2020) సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇన్వెస్టిగేషన్ (సిబిహెచ్ఐ) నివేదికల ప్రకారం , భారతదేశంలో పాముకాటు కేసుల సగటు ఏడాదికి సుమారు 3 లక్షలు ఉంటున్నాయి. పాముకాటు విషం కారణంగా దాదాపు 2000 మరణాలు సంభవిస్తున్నాయి.

భారతదేశంలో, దాదాపు 90 శాతం పాముకాటులు నాలుగు రకాల పాములా ద్వారా సంభవిస్తున్నాయి. అవి కట్ల పాము, త్రాచు పాము,  రక్త పింజేరి, కోరల పింజేరి. ప్రతిరోధకాలను కలిగి ఉన్న పాలీవాలెంట్ యాంటీ స్నేక్ వెనమ్ (ఏఎస్వి)  80 శాతం పాముకాటు కేసులలో ప్రభావవంతంగా ఉంటుంది, అయినప్పటికీ, పాముకాటుకు గురైన రోగులకు చికిత్స చేయడానికి శిక్షణ పొందిన మానవ వనరులు, ఆరోగ్య సౌకర్యాల కొరత అలాగే ఉంది. అలాగే, సంభవం, అనారోగ్యం, మరణాలు, సామాజిక-ఆర్థిక భారం, చికిత్స విధానాలు మొదలైన వాటిపై డేటా అందుబాటులో లేకపోవడం భారతదేశంలో పాముకాటును తగ్గించే ప్రణాళికలో ప్రధాన అవరోధాలు.

 

***


(Release ID: 2014313) Visitor Counter : 168


Read this release in: English , Urdu , Hindi