రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో జాతీయ రహదారి ప్రాజెక్టుల కోసం 374.17 కోట్లు విడుదల చేసిన శ్రీ నితిన్ గడ్కరీ

Posted On: 12 MAR 2024 12:44PM by PIB Hyderabad

 ఒడిశా లో  ఈపిసీ విధానంలో  అయింతపల్లి జంక్షన్ వద్ద 3.5 కి.మీ పొడవునా 6-లేన్ ఫ్లైఓవర్ , సంబల్పూర్ జిల్లా, ఒడిశాలోని జాతీయ రహదారి -53 (గతంలో జాతీయ రహదారి -6) పై 2-లేన్ ఆర్ఓబి  (LHS) నిర్మాణానికి రూ. 374.17 కోట్లు విడుదల చేసినట్లు  కేంద్ర రోడ్డు రవాణా , రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఒక పోస్ట్‌లో తెలిపారు. 

ఐంతపాలి చౌక్ వద్ద భారీ ట్రాఫిక్ రద్దీని  తగ్గించడానికి  ప్రతిపాదిత 6-లేన్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందని  ఆయన చెప్పారు.ప్రాజెక్టులో భాగంగా 2-లేన్  ఆర్ఓబి ని నిర్మిస్తారు. గతంలో జాతీయ రహదారి -53లో టెలిబానీ-సంబల్‌పూర్ 4-లానింగ్ ప్రాజెక్ట్ నుండి మినహాయించారు. 

****



(Release ID: 2013983) Visitor Counter : 38


Read this release in: English , Urdu , Hindi , Odia , Tamil