రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కర్ణాటకలోని బళ్లారి మరియు అనంతపూర్ జిల్లాల మీదుగా 13.087 కి.మీ విస్తరించి ఉన్న జాతీయ రహదారి 150 ఏ కోసం రూ. 626.01కోట్లు శ్రీ నితిన్ గడ్కరీ మంజూరు చేశారు.

प्रविष्टि तिथि: 12 MAR 2024 12:46PM by PIB Hyderabad

కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఒక పోస్ట్‌లో, కర్ణాటకలో  బళ్లారి మరియు అనంతపూర్ జిల్లాల మీదుగా 13.087 కి.మీ విస్తరించి ఉన్న జాతీయ రహదారి 150 ఏ లోని బళ్లారి నుండి బైరాపూర్ సెక్షన్‌ను కలుపుతూ బళ్లారి బైపాస్ యొక్క 4-లేనింగ్ పూర్తి చేయడానికి రూ. 626.01 కోట్లు మంజూరు చేయబడ్డాయని తెలిపారు.

 

ఇది బళ్లారి పట్టణంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, తద్వారా రహదారి భద్రతను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.  హోస్పేట్ నుండి బళ్లారి వరకు విశాలమైన ప్రాజెక్ట్‌లో భాగంగా దక్షిణం వైపు 28కిమీ బైపాస్ ఇప్పటికే పురోగతిలో ఉంది.

 

***


(रिलीज़ आईडी: 2013967) आगंतुक पटल : 80
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Telugu , Kannada