రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

జన్ ఔషధి కేంద్రాలకు క్రెడిట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన డాక్టర్ మన్సుఖ్ మాండవియా


2014లో దేశంలో కేవలం 80 జన ఔషధి కేంద్రాలు ఉండగా నేడు దేశవ్యాప్తంగా 11,000 యూనిట్లు పనిచేస్తున్నాయి: డాక్టర్ మన్సుఖ్ మాండవియా

"ప్రతిరోజూ 10 నుండి 12 లక్షల మంది ప్రజలు జన్ ఔషధి కేంద్రాలను సందర్శిస్తున్నారని అంచనా వేయబడింది. వారికి గణనీయమైన పొదుపు మరియు అవసరమైన మందులను అందిస్తోంది"

"ఎస్‌ఐడిబిఐ మరియు పిఎంబిఐ మధ్య అవగాహన ఒప్పందం దేశంలోని జన్ ఔషధి కేంద్రాల నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేస్తుంది మరియు ఆధునీకరించడానికి అవకాశం ఉన్నందున చిన్న మరియు కొత్త పారిశ్రామికవేత్తలకు ఒక ఆశీర్వాదంగా ఉద్భవిస్తుంది"

ఈ ఎమ్ఒయు కింద జన్ ఔషధి కేంద్రాలకు చెందిన చిన్న వ్యాపారవేత్తలకు సిడ్బి ద్వారా సరసమైన వడ్డీ రేటుతో రూ.2 లక్షలు అందించబడతాయి.

Posted On: 12 MAR 2024 2:05PM by PIB Hyderabad

కేంద్ర రసాయనాలు & ఎరువులు మరియు ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈరోజు జన్ ఔషధి కేంద్రాల కోసం క్రెడిట్ సహాయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బి) మరియు ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (పిఎంబిఐ) మధ్య జరిగిన ఎంఓయూ మార్పిడి కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. జన్ ఔషధి కేంద్రాలకు క్రెడిట్ సహాయం కోసం https://jak-prayaasloans.sidbi.in/home. వెబ్‌సైట్‌ను కూడా ఆయన ప్రారంభించారు.

 

image.png

image.png



సభను ఉద్దేశించి డాక్టర్ మాండవ్య మాట్లాడుతూ సరసమైన మరియు అందుబాటులో ఉండే మందులు ఏ సమాజానికైనా అవసరమైన అవసరం. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వాటిని పేదలకు 'సంజీవని' అని పేర్కొన్నారు. 2014లో దేశంలో కేవలం 80 జన్ ఔషధి కేంద్రాలు ఉండగా నేడు దేశవ్యాప్తంగా 11,000 యూనిట్లు పనిచేస్తున్నాయి. "ప్రతిరోజూ దాదాపు 10 నుండి 12 లక్షల మంది ప్రజలు ఈ జన్ ఔషధి కేంద్రాలను సందర్శిస్తున్నారని అంచనా వేయబడింది. వారికి గణనీయమైన పొదుపు మరియు అవసరమైన మందులను ఇవి అందిస్తున్నాయని" ఆయన తెలిపారు.

దేశంలో జన్ ఔషధి కేంద్రాల నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించిన డాక్టర్ మాండవ్య..సేకరణ ప్రక్రియను పటిష్టం చేయడం, అందించే ఉత్పత్తులను విస్తరించడం, క్రమబద్ధమైన సరఫరా గొలుసు నెట్‌వర్క్‌ను కొనసాగించడం వంటి వాటిపై చాలా కృషి చేశామని చెప్పారు. కఠినమైన నాణ్యత తనిఖీలు మరియు నియంత్రణకు భరోసా అందిస్తున్నామన్నారు. ఈ జన్ ఔషధి కేంద్రాల యొక్క వ్యక్తిగత ఆపరేటర్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించిందని, మారుమూల మరియు కొండ ప్రాంతాలలో ఉన్న వారికి అదనపు సహాయంతో సహా, ఈ కేంద్రాలను తెరవడానికి వారిని ప్రోత్సహించాలని కేంద్రమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం చిన్న పారిశ్రామికవేత్తలకు ఆర్థిక స్వయంప్రతిపత్తిని అందించడంతో పాటు దేశవ్యాప్తంగా జన్ ఔషధి కేంద్రాల నెట్‌వర్క్ మరియు పరిధిని బలోపేతం చేసిందన్నారు.

 

image.png


సిడ్బి మరియు పిఎంబిఐ మధ్య జరిగిన ఎమ్ఒయు పట్ల హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి "ఈ అవగాహనా ఒప్పందం జన్ ఔషధి కేంద్రాల చిన్న మరియు కొత్త పారిశ్రామికవేత్తలకు ఒక వరంగా ఉద్భవిస్తుంది" అని పేర్కొన్నారు. దేశంలో జన్ ఔషధి కేంద్రాల నెట్‌వర్క్‌ను మరింత పెంచడంలో బలోపేతం చేయడంలో మరియు ఆధునీకరించడంలో ఈ అవగాహనా ఒప్పందానికి ఉన్న విశిష్ఠతను గుర్తించిన కేంద్రమంత్రి..ఈ కార్యక్రమ ప్రయోజనాలను రాష్ట్రాలు మరియు క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేయాలని మంత్రిత్వ శాఖ మరియు సిడ్బి అధికారులను కోరారు.

ఈ క్రెడిట్ సహాయ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పాల్గొన్న వ్యక్తులతో పాటు ఈ చొరవలో కొంతమంది లబ్ధిదారులను కూడా కేంద్ర మంత్రి సత్కరించారు.

 

image.png


సిడ్బి చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శివసుబ్రమణియన్ రామన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న వ్యాపారాల కోసం వర్కింగ్ క్యాపిటల్ లోన్‌ని అందించడానికి క్రెడిట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ జీఎస్టీ మరియు డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ) రెండింటి ప్రయోజనాన్ని పొందుతుందని తెలియజేశారు. "డిపిఐ ప్రస్తుతం గుర్తింపు (ఆధార్ ద్వారా) మరియు చెల్లింపు (ఆధార్‌తో అనుసంధానించబడిన యుపిఐ ద్వారా) ఆధారంగా ఉంది. బ్యాంకుల నుండి రుణాలు పొందలేని కోట్లాది చిన్న వ్యాపారులకు రుణ ప్రవాహాన్ని అందించడానికి మరియు వడ్డీ వ్యాపారులచే దోపిడీకి గురికాకుండా ఉండేందుకు ఈ రోజు మనం మూడవ పొరను, ఇతర రెండు పొరలను ఉపయోగించి 'క్రెడిట్ లేయర్'ని జోడిస్తున్నాము అని చెప్పారు.

నేపథ్యం:

గత కొన్ని సంవత్సరాలుగా ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన భారతీయ పౌరులందరికీ సరసమైన మరియు నాణ్యమైన ఔషధాల ప్రయోజనాన్ని విజయవంతంగా అందించింది. గౌరవనీయులైన ప్రధాన మంత్రి యొక్క నిబద్ధత విజయవంతంగా దేశం మొత్తాన్ని దాదాపు 11,000 జన్ ఔషధి కేంద్రాలతో కవర్ చేయడం ద్వారా అతిపెద్ద విజయాన్ని నమోదు చేశాయి. రాబోయే రెండేళ్లలో జన ఔషధి కేంద్రాల సంఖ్యను 25,000కి  పెంచడం ద్వారా భౌగోళిక పరిధిని పెంచాలని నిర్ణయించబడింది.

ప్రైవేట్ వ్యవస్థాపకులు మరియు ప్రోత్సాహకాల రూపంలో ప్రభుత్వ మద్దతుతో నిర్వహిస్తున్న ఈ జన్ ఔషధి కేంద్రాలు సుమారు 2000 రకాల మందులు మరియు 300 రకాల శస్త్రచికిత్స పరికరాలను అందించగలుగుతున్నాయి. ప్రతిరోజూ 10 నుండి 12 లక్షల మంది ప్రజలు జన్ ఔషధి కేంద్రాలను సందర్శిస్తున్నారని మరియు అవసరమైన మందులను కొనుగోలు చేసేటప్పుడు వారి డబ్బును ఆదా చేస్తున్నారని అంచనా.

ఔషధాల ధరపై వ్యక్తులు క్రమం తప్పకుండా పొదుపు చేస్తున్ననేపథ్యంలో ఆయా కుటుంబాల ఖర్చు గణనీయంగా తగ్గించబడింది. మొత్తం మీద భారతీయ పౌరులు జన్ ఔషధి కేంద్రాల నుండి ఔషధాలను కొనుగోలు చేసినప్పుడు గత 10 సంవత్సరాల కాలంలో రూ.28,000 కోట్ల కంటే ఎక్కువ మొత్తం ఆదా చేయగలిగారు.

జన్ ఔషధి కేంద్రాలను నడుపుతున్న వ్యవస్థాపకులకు ఇన్‌వాయిస్ ఆధారిత ఫైనాన్సింగ్‌ను సులభతరం చేయడం మరియు రిటైల్ మెడికల్ అవుట్‌లెట్‌ల మౌలిక సదుపాయాల స్థాపనకు మద్దతు ఇవ్వడానికి స్మాల్  ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బి) మరియు ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (పిఎంబిఐ) ముందుకు వచ్చి 02 అవగాహన ఒప్పందాలు (ఎంఓయులు)పై సంతకం చేశాయి.

జన్ ఔషధి కేంద్రాలకు వర్కింగ్ క్యాపిటల్ సహాయం అందించడానికి పైలట్ క్రెడిట్ ప్రోగ్రామ్ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఇప్పటికే ఉన్న 11,000 మరియు ప్రతిపాదిత 15,000 జన్ ఔషధి కేంద్రాలకు వర్కింగ్ క్యాపిటల్ క్రెడిట్ సౌకర్యాన్ని అందించడానికి ముందుకు వెళ్లాలని నిర్ణయించబడింది. సిడ్బి చాలా సరసమైన వడ్డీ రేటుతో రూ.2 లక్షల క్రెడిట్‌ పరిమితితో ప్రాజెక్ట్‌ లోన్‌ను అందిస్తుంది. ఇది వర్కింగ్ క్యాపిటల్‌గా మరియు సులభమైన రికవరీ ప్రక్రియతో పని చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ డిజిటల్ మోడ్‌లో పని చేస్తుంది. తద్వారా సులభంగా వ్యాపారం చేయడాన్ని నిర్ధారిస్తుంది.

ప్రాజెక్ట్ రుణం కోసం 2వ అవగాహన ఒప్పందం ప్రాజెక్ట్ వ్యయంలో 80% నిధులు అంటే రూ.4 లక్షల వరకూ చాలా లాభదాయకమైన వడ్డీ రేటు మరియు సులభమైన రీపేమెంట్ షరతులపై అందిస్తుంది. ఈ రుణం ఫర్నిచర్ & ఫిక్స్చర్స్, కంప్యూటర్, ఏసీ, రిఫ్రిజిరేటర్ మొదలైన వాటిపై ఖర్చులను సులభతరం చేస్తుంది. జన్ ఔషధి కేంద్రాన్ని స్థాపించే ప్రారంభ దశలో  ఇది హ్యాండ్‌హోల్డింగ్ మద్దతుగా ఉంటుంది.

ఈ రెండు అవగాహన ఒప్పందాల ద్వారా ఈ సూక్ష్మ మరియు చిన్న సంస్థలకు నిధులను పంపిణీ చేసేటప్పుడు జీఎస్టీ-సహాయ్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించాలని సిడ్బి ప్రతిపాదిస్తుంది.ఇది మొత్తం పథకానికి పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సిడ్బి మరియు పిఎంబిఐ అనే రెండు సంస్థలుకలిసి రావడం రాబోయే వ్యవస్థాపకులకు ఫైనాన్సింగ్‌ను సులభతరం చేస్తుంది. ఇది ఇప్పటికే జనాదరణ పొందిన జన్ ఔషధి కేంద్రాల నెట్‌వర్క్ ద్వారా సరసమైన మరియు నాణ్యమైన మందులను అందించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది.

ఈ కార్యక్రమంలో శ్రీ అరుణిష్ చావ్లా, సెక్రటరీ, ఫార్మాస్యూటికల్స్ విభాగం, రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ; శ్రీ భూషణ్ కుమార్ సిన్హా, జాయింట్ సెక్రటరీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆర్థిక మంత్రిత్వ శాఖ;  పీఎంబీఐ సీఈవో శ్రీ రవి దధీచ్, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

***



(Release ID: 2013961) Visitor Counter : 89