ప్రధాన మంత్రి కార్యాలయం

‘ఇండియా‌స్ టెకేడ్: చిప్స్ ఫార్ వికసిత్ భారత్’ కార్యక్రమం లో పాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి;  సుమారు 1.25 లక్షల కోట్ల రూపాయల  విలువ కలిగిన మూడు సెమికండక్టర్ సదుపాయాల కు మార్చి నెల 13 వ తేదీ న ఆయన శంకుస్థాపన చేయనున్నారు


ఈ సందర్భం లో దేశం లోని యువత ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు

ఈ మూడు సదుపాయాల ను ఏర్పాటు చేయడం తో, సెమికండక్టర్ ఇకోసిస్టమ్ బలోపేతం  కానుంది; యువత కు ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి

Posted On: 12 MAR 2024 3:44PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 మార్చి నెల 13 వ తేదీ నాడు ఉదయం పూట 10:30 గంటల వేళ లో వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ఇండియాస్ టెకేడ్: చిప్స్ ఫార్ వికసిత్ భారత్కార్యక్రమం లో పాలుపంచుకోవడం తో పాటుగా సుమారు 1.25 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన మూడు సెమికండక్టర్ ప్రాజెక్టుల కు శంకుస్థాపన ను కూడా జరపనున్నారు. ఈ సందర్భం లో దేశవ్యాప్తం గా యువత ను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.

 

సెమికండక్టర్ డిజైన్ లో, సెమికండక్టర్ తయారీ లో మరియు సెమికండక్టర్ సంబంధి సాంకేతికత ను అభివృద్ధి చేయడం లో భారతదేశాన్ని ఒక గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దాలనేది, తద్ద్వారా దేశం లో యువతీ యువకుల కు ఉపాధి అవకాశాల ను పెద్ద ఎత్తున కల్పించాలనేది ప్రధాన మంత్రి యొక్క దృష్టికోణం లో భాగాలు గా ఉన్నాయి. ఈ దార్శనికత కు అనుగుణం గా, గుజరాత్ లోని ధోలెరా స్పెశల్ ఇన్‌వెస్ట్‌ మెంట్ రీజియన్ (డిఎస్ఐఆర్) లో సెమికండక్టర్ ఫాబ్రికేశన్ ఫెసిలిటీ కి, అసమ్ లోని మోరీగాఁవ్ లో అవుట్‌సోర్స్‌ డ్ సెమికండక్టర్ అసెంబ్లి ఎండ్ టెస్ట్ (ఒఎస్ఎటి) ఫెసిలిటీ కి, గుజరాత్ లోని సాణంద్ లో అవుట్‌సోర్స్‌ డ్ సెమికండక్టర్ అసెంబ్లి ఎండ్ టెస్ట్ (ఒఎస్ఎటి) ఫెలిసిటీ కి శంకుస్థాపన లు జరుగనున్నాయి.

 

భారతదేశం లో సెమికండక్టర్ ఫేబ్స్ ను ఏర్పాటు చేయడం కోసం ఉద్దేశించినటువంటి సవరించిన పథకం లో భాగం గా ధోలెరా స్పెశల్ ఇన్‌వెస్ట్‌ మెంట్ రీజియన్ (డిఎస్ఐఆర్) లో సెమికండక్టర్ ఫేబ్రికేశన్ ఫెసిలిటీ ని టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టిఇపిఎల్) ఏర్పాటు చేయనుంది. ఈ సదుపాయం 91,000 కోట్ల రూపాయల కు పైగా మొత్తం పెట్టుబడి తో ఏర్పాటు కానుంది. ఈ యూనిటు దేశం లో మొట్టమొదటి వాణిజ్య సరళి సెమికండక్టర్ ఫేబ్ యూనిటు అవుతుంది.

 

అవుట్ సోర్స్‌ డ్ సెమికండక్టర్ అసెంబ్లి ఎండ్ టెస్ట్ (ఒఎస్ఎటి) సదుపాయాన్ని అసమ్ లోని మోరీగాఁవ్ లో టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టిఇపిఎల్) ఏర్పాటు చేయనుంది. దీని ని మోడిఫైడ్ స్కీమ్ ఫార్ సెమికండక్టర్ అసెంబ్లి, టెస్టింగ్, మార్కింగ్ ఎండ్ పేకేజింగ్ (ఎటిఎమ్‌పి) లో భాగం గా దాదాపు 27,000 కోట్ల రూపాయల మొత్తం పెట్టుబడి తో ఏర్పాటు చేయడం జరుగుతుంది.

 

అవుట్‌సోర్స్‌ డ్ సెమికండక్టర్ అసెంబ్లి ఎండ్ టెస్ట్ (ఒఎస్ఎటి) సదుపాయాన్ని సాణంద్ లో సిజి పవర్ ఎండ్ ఇండస్ట్రియల్ సొల్యూశన్స్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. ఈ యూనిటు ను మోడిఫైడ్ స్కీమ్ ఫార్ సెమికండక్టర్ అసెంబ్లి , టెస్టింగ్, మార్కింగ్ ఎండ్ పేకేజింగ్ (ఎటిఎమ్‌ పి) లో భాగం గా మొత్తం దాదాపు 7,500 కోట్ల రూపాయల పెట్టుబడి తో ఏర్పాటు చేస్తున్నారు.

 

ఈ సదుపాయాల ద్వారా, సెమికండక్టర్ ఇకోసిస్టమ్ ను పటిష్టపరచడం తో పాటు ఆ ఇకోసిస్టమ్ భారతదేశం లో గట్టిగా నిలదొక్కుకోనుంది. ఈ యూనిటు లు వేల కొద్దీ యువతీ యువకుల కు సెమికండక్టర్ పరిశ్రమ లో ఉద్యోగాల ను కల్పించనున్నాయి. దీనికి అదనం గా, ఈ యూనిటు లు ఎలక్ట్రానిక్స్, టెలికమ్ ల వంటి సంబంధి రంగాల లో ఉద్యోగాల కల్పన కు ఉత్ప్రేరకం వలె కూడా పనిచేస్తాయి.

 

సెమికండక్టర్ పరిశ్రమ కు చెందిన ప్రముఖులు, వేల కొద్దీ కళాశాల విద్యార్థులు సహా యువతీ యువకులు పెద్ద సంఖ్య లో ఈ కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు.

 

***



(Release ID: 2013884) Visitor Counter : 146