వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) నుండి అన్ని రంగాలలోని ప్రభుత్వ ప్రయోగశాలల్లో పరీక్షా సౌకర్యాల ఏర్పాటుకు రూ.340 కోట్ల విలువైన ప్రతిపాదనల పరిశీలన


ఉన్నత విద్య, పరిశోధన అభివృద్ధి సంస్థలలో ల్యాబ్‌ల అప్‌గ్రేడేషన్, బిఐఎస్ పథకం ద్వారా క్లిష్టమైన ప్రాంతాలలో పరీక్షా సౌకర్యాల కోసం ల్యాబ్‌లను మెరుగుపరచడం కేంద్రం లక్ష్యం

Posted On: 11 MAR 2024 5:22PM by PIB Hyderabad

దేశంలో మౌలిక సౌకర్యాలలో నాణ్యతను పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్యూరో అఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ద్వారా ప్రయోగశాలల నెట్ వర్క్ స్థాయిని పెంచి, మరింత పటిష్టం చేయడానికి కేంద్రం పూనుకుంది. ఇందుకు రూ.340 కోట్ల విలువ చేసే ప్రతిపాదనలను పరిశీలించింది. జౌళి, ఆహారం, తూనికలు, కొలతలు, విద్యుత్ సరఫరా వంటి కీలక రంగాల్లో నాణ్యత పెంచడానికి చర్యలకు ఉపక్రమించింది కేంద్రప్రభుత్వం. 

దేశంలోని మొత్తం నాణ్యమైన మౌలిక సదుపాయాలలో పరీక్షా సౌకర్యాల లభ్యత కీలక పాత్ర పోషిస్తుంది. తయారీదారులు, రెగ్యులేటర్లు, వినియోగదారులు తమ సాంకేతిక అవసరాలను తీర్చుకునేలా నాణ్యమైన ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించాలి. వివిధ రంగాలలో పరీక్షా సౌకర్యాలు, ప్రయోగశాల మౌలిక సదుపాయాల లభ్యతను పెంచడానికి ప్రభుత్వం వరుస చర్యలను చేపట్టింది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వినియోగదారుల వ్యవహారాల శాఖ, టెక్స్‌టైల్స్, ఆహారం, వంటి రంగాలలో ప్రభుత్వ లాబొరేటరీలలో పరీక్షా సౌకర్యాలను రూపొందించడంలో బిఐఎస్ అందించే మద్దతు కోసం రూ.340 కోట్ల విలువైన ప్రతిపాదనలను స్క్రీనింగ్ కమిటీ ద్వారా పరిశీలించింది. తూనికలు, కొలతలు, పవర్ ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ ఈ రంగాలలో వృద్ధిని పెంచడంలో ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి.

కీలకమైన ప్రాంతాల్లో పరీక్షా సౌకర్యాల కల్పన/పెంపుదల కోసం ఇతర ప్రయోగశాలలకు మద్దతునిచ్చేలా కేంద్రం ఇప్పుడు ఈ పథకాన్ని ఉన్నత విద్యా సంస్థల ప్రయోగశాలలకు, ఆర్ అండ్ డి ప్రయోజనాల కోసం లేదా లాభ ప్రాతిపదికన కాకుండా ప్రైవేట్ సంస్థల ప్రయోగశాలలకు విస్తరించింది. www.bis.gov.inలో ప్రయోగశాలల ట్యాబ్‌లో అందుబాటులో ఉన్న పథకం నిబంధనల ప్రకారం అటువంటి ప్రయోగశాలలు మద్దతు కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

బిఐఎస్ లాబొరేటరీ రికగ్నిషన్ స్కీమ్ క్రింద వారి ప్రయోగశాల గుర్తింపు పొందడం ద్వారా బిఐఎస్ కన్ఫర్మిటీ అసెస్‌మెంట్ స్కీమ్‌ల కోసం నమూనాలను పరీక్షించడం కోసం అంతర్గత పరీక్షా సౌకర్యాలను కలిగి ఉన్న తయారీదారులు తమ ప్రయోగశాలలను బిఐఎస్ పరీక్ష పర్యావరణ వ్యవస్థతో అనుబంధించవచ్చు. https://lims.bis.gov.in/ లో బిఐఎస్ లేబొరేటరీ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఆన్‌లైన్‌లో లాగిన్ చేసి, ఆపై కొత్త ల్యాబ్ రిజిస్టర్ లింక్‌కి వెళ్లి దరఖాస్తు చేయాలి. పోర్టల్‌లో దశల వారీ నమోదు ప్రక్రియ కోసం వివరణాత్మక వినియోగదారు మాన్యువల్ కూడా ఉంది. 

పై స్కీమ్‌లకు సంబంధించి ఏదైనా స్పష్టత/సహాయం అవసరమైతే, బిఐఎస్ ని lrmd-bis@bis.gov.in లో లేదా బిఐఎస్ ఫెసిలిటేషన్ నంబర్ 1800-11-1206 లో సంప్రదించవచ్చు. 

 

***



(Release ID: 2013863) Visitor Counter : 50


Read this release in: English , Urdu , Hindi , Tamil