బొగ్గు మంత్రిత్వ శాఖ
గత 10 ఏళ్లలో గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టించిన బొగ్గు రంగం
Posted On:
11 MAR 2024 11:50AM by PIB Hyderabad
దేశ ఇంధన అవసరాలను నెరవేరుస్తూ, అదే సమయంలో గణనీయమైన ఉపాధి వృద్ధికి చోదకంగా ఉండటంలో భారత బొగ్గు రంగం కీలక పాత్ర పోషించడాన్ని కొనసాగిస్తోంది. మార్చి 6, 2024 నాటికి విశేష స్థాయిలో 900 ఎంటిల బొగ్గు దేశంలో ఉత్పత్తి అయింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 1 బిటికిపైగా ఉత్పత్తి మైలు రాయిని సాధించే అవకాశాలున్నాయని అంచనాలు సూచిస్తున్నాయి. ఉత్పత్తిలో ఈ పెరుగుదల అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడటమే కాకుండా, దేశవ్యాప్తంగా బొగ్గు అధికంగా ఉన్న ప్రాంతాలలో గణనీయమైన ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది.
భారత ప్రభుత్వం బొగ్గు ఉత్పత్తి చేసే ప్రభుత్వ రంగ సంస్థలు (పిఎస్‌యూ)లు, ముఖ్యంగా కోల్ ఇండియా లిమిటెడ్ (అనుబంధ సంస్థలతో సహా), ముఖ్యంగా కోల్ ఇండియా లిమిటెడ్ (అనుబంధ సంస్థలతో సహా), ఎన్ఎల్‌సి ఇండియా లిమిటెడ్ 128,236 కాంట్రాక్టు కార్మికులు సహా 369,053 మంది వ్యక్తులతో కూడిన కార్మిక శక్తిని కలిగి ఉన్నాయి. అదనంగా, ఈ రంగం 3.1 లక్షల మంది పింఛనుదారులకు తోడ్పాటునందిస్తూ, సామాజిక సంక్షేమ, జీవనోపాధులపై దాని గణనీయ ప్రభావాన్ని నొక్కి చెప్తుంది.
ఇటీవలి సంవత్సరాలలో, కోల్ ఇండియా లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు విస్త్రతమైన నియామక డ్రైవ్‌ను చేపట్టడం ద్వారా 2014 నుంచి ఫిబ్రవరి 2024వరకు 59,681 సిబ్బందిని తమ కార్మిక శక్తిలో చేర్చుకుంది. ఉపాధి అవకాశాలను పెంపొందించాలన్న నిబద్ధతను ప్రతిఫలిస్తూ అదే సమయంలో ఎన్ఎల్‌సి ఇండియా లిమిటెడ్ 4,265మందిని నియమించింది.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మిషన్ మోడ్ రిక్రూట్‌మెంట్ చొరవ కింద కోల్ ఇండియా లిమిటెడ్ దాని అనుబంధ సంస్థలు 5,711 వ్యక్తులను నియమించడం ద్వారా నియామకాల ప్రయత్నాలు ఉదృతం కావడాన్ని వీక్షించింది. అదే సమయంలో, ఎన్ఎల్‌సి ఇండియా లిమిటెడ్ ఉపాధి అవసరాలను తీర్చడంలో చురుకైన విధానాన్ని ప్రదర్శిస్తూ.661 మంది సిబ్బందిని నియమించుకుంది.
పెరుగుతున్న డిమాండ్ కారణంగా బొగ్గు గనుల్లో మైనింగ్ కార్యకలాపాలు పెరగడం అన్నది రానున్న సంవత్సరాలలో ఉపాధి వృద్ధిని పెంచడాన్ని కొనసాగిస్తుంది. ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను అందించడమే కాకుండా, మైనింగ్ కార్యకలాపాలు గణనీయమైన పరోక్ష ఉపాధిని కూడా సృష్టిస్తూ, దేశవ్యాప్తంగా సామాజిక- ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తాయి. బొగ్గు రంగం విస్తరిస్తున్నందున సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడానికి, స్థిరమైన జీవనోపాధి ద్వారా వేలాదిమంది జీవితాలను మార్చడానికి కట్టుబడి ఉంది.
****
(Release ID: 2013862)
Visitor Counter : 93