రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

జార్ఖండ్‌లోని ఖుంటిలో రూ.2500 విలువైన రెండు వరుసల జాతీయ రహదారుల ప్రాజెక్ట్‌ల ఆధునికీకరణకు శంకుస్థాపన


- శంకుస్థాపన పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ

Posted On: 11 MAR 2024 12:23PM by PIB Hyderabad

ఆధునిక మౌలిక సదుపాయాలను నిర్మించడం ద్వారా జార్ఖండ్ అభివృద్ధికి ఊపునిస్తూనిన్న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జార్ఖాన్లోని ఖుంటిలో రూ.2500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ వ్యయంతో రెండు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినట్టు కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఒక పోస్ట్ వెల్లడించారు.  శ్రీ అర్జున్ ముండాసీనియర్ నాయకుడు శ్రీ కరియా ముండాపార్లమెంటు సభ్యుడు శ్రీ సుదర్శన్ భగత్ మరియు ఇతర ప్రముఖుల సమక్షంలో పనులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన శంకుస్థాపన చేశారుఈరోజు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులలో తుపుదన నుండి కుండియాబర్తోలి సెక్షన్ (ఖుంటి బైపాస్తో సహా) 4-లేనింగ్ నిర్మాణం మరియు బీరో నుండి ఖుంటి సెక్షన్ వరకు విస్తరించడం మరియు అప్గ్రేడేషన్ చేయడం తదితర పనులు ఇందులో ఉన్నాయిబెరో నుండి ఖుంటి సెక్షన్ను నిర్మించడం వల్ల ట్రాఫిక్కు ఇబ్బంది తగ్గించడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఖాంటి బైపాస్‌ నిర్మాణం వల్ల స్థానిక ఉత్పత్తులు మార్కెట్లోకి చేరడం సులభతరం అవుతుందిదీని వల్ల  ప్రాంతం ఆర్థికంగాసామాజికంగా అభివృద్ధి చెందుతుంది. ప్రాజెక్టుల మూలంగా సమయం మరియు ఇంధనాన్ని ఆదా చేస్తాయిదీనివల్ల కాలుష్యం తగ్గుతుందిఆధునిక మరియు అధిక నాణ్యత గల రహదారులు సులభమైన మరియు సురక్షితమైన రవాణాను నిర్ధారిస్తాయిఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహం లభిస్తుందిఉపాధివ్యవస్థాపకతలకు అవకాశాలు కల్పిస్తాయని మంత్రి తెలిపారు.

***



(Release ID: 2013851) Visitor Counter : 50