ప్రధాన మంత్రి కార్యాలయం

పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో 'వికసిత్ భారత్- 'వికసిత్ వెస్ట్ బెంగాల్' కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి


పశ్చిమ బెంగాల్ లో రూ.4500 కోట్లకు పైగా విలువైన రైలు, రోడ్డు రంగానికి సంబంధించిన బహుళ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి

పలు రైలు మార్గాల విద్యుదీకరణ ప్రాజెక్టులు, అనేక ఇతర ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన ప్రధాని

సిలిగురి-రాధికాపూర్ మధ్య కొత్త ప్యాసింజర్ రైలు సర్వీసు ప్రారంభం

రూ.3,100 కోట్ల వ్యయం తో రెండు జాతీయ రహదారుల ప్రాజెక్టుల ప్రారంభం

'నేటి ప్రాజెక్టులు వికసిత్ పశ్చిమబెంగాల్ దిశగా మరో ముందడుగు'

“మా ప్రభుత్వం తూర్పు భారతాన్ని దేశ వృద్ధి చోదకశక్తిగా భావిస్తోంది”

“ఈ పదేళ్లలో రైల్వే అభివృద్ధిని ప్యాసింజర్ నుంచి ఎక్స్ ప్రెస్ వేగానికి తీసుకెళ్లాం. మా మూడవ టర్మ్ లో ఇది సూపర్ ఫాస్ట్ వేగంతో ముందుకు వెళ్తుంది"

Posted On: 09 MAR 2024 5:19PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో జరిగిన 'వికసిత్ భారత్- వికసిత్ వెస్ట్ బెంగాల్ ' కార్యక్రమంలో ప్రసంగించారు. పశ్చిమబెంగాల్ లో రూ.4500 కోట్లకు పైగా విలువైన రైలు, రోడ్డు రంగానికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ఆయన ప్రారంభం, జాతికి అంకితం చేశారు.

సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, అందమైన తేయాకు భూమిలో ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. నేటి ప్రాజెక్టులు 'వికసిత్ పశ్చిమబెంగాల్ దిశగా మరో ముందడుగు అని ఆయన అభివర్ణించారు.

పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర భాగం ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉందని, పొరుగు దేశాలతో వాణిజ్య మార్గాలను కూడా అందిస్తుందని ప్రధాన మంత్రి చెప్పారు. అందువల్ల, పశ్చిమ బెంగాల్ తో పాటు రాష్ట్ర ఉత్తర భాగాన్ని అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రాధాన్యత అని ప్రధాన మంత్రి చెప్పారు. రైలు, రోడ్డు మౌలిక సదుపాయాలను ఆధునీకరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన ఆయన, ఎక్లాఖీ - బలూర్ఘాట్, రాణినగర్ జల్పాయిగురి - హల్దిబరి , సిలిగురి - అలుబరి సెక్షన్లలో రైలు మార్గాల విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయని, ఇది ఉత్తర , దక్షిణ దినాజ్పూర్, కూచ్ బెహర్, జల్పాయిగురి ప్రాంతాలలో రైళ్ల వేగాన్ని పెంచుతుందని, సిలిగురి - సముక్తల మార్గం సమీప అటవీ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. బర్సోయ్ - రాధికాపూర్ సెక్షన్ విద్యుదీకరణ వల్ల బీహార్, పశ్చిమబెంగాల్ రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. రాధికపూర్, సిలిగురి మధ్య కొత్త రైలు సేవలను జెండా ఊపి ప్రారంభించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, పశ్చిమ బెంగాల్లో రైల్వేలను బలోపేతం చేయడం కొత్త అభివృద్ధి అవకాశాలకు వేగాన్ని ఇస్తుందనిసాధారణ ప్రజల జీవితాలను సులభతరం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు.

 

భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల్లో రైళ్ల వేగాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆధునిక ఫాస్ట్ రైళ్లను ప్రారంభిస్తున్నామని ప్రధాన మంత్రి చెప్పారు. న్యూ జల్పాయిగురి నుంచి ఢాకా కంటోన్మెంట్ వరకు మిథాలీ ఎక్స్ప్రెస్ నడుస్తోందని, బంగ్లాదేశ్ ప్రభుత్వ సహకారంతో రాధికపూర్ స్టేషన్ వరకు కనెక్టివిటీని విస్తరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

స్వాతంత్ర్యానంతర దశాబ్ధాలలో తూర్పు భారతదేశ ప్రయోజనాలను విస్మరించడాన్ని గుర్తు చేసిన ప్రధాన మంత్రి, ప్రస్తుత ప్రభుత్వం తూర్పు భారతదేశాన్ని దేశ వృద్ధి చోదకశక్తిగా భావిస్తోందని అన్నారు. అందుకే ప్రాంతంలో కనెక్టివిటీని మెరుగుపరచడానికి అపూర్వమైన పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పారు. పశ్చిమ బెంగాల్ వార్షిక సగటు రైల్వే బడ్జెట్ కేవలం 4,000 కోట్ల రూపాయలు కాగా, ఇప్పుడు 14,000 కోట్ల రూపాయలకు పెరిగిందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. నార్త్ బెంగాల్ నుంచి గౌహతి, హౌరా వరకు సెమీ హైస్పీడ్ వందే భారత్ రైలును అప్ గ్రేడ్ చేయడం కోసం చేపట్టిన 500 అమృత్ భారత్ స్టేషన్లలో సిలిగురి స్టేషన్ ను చేర్చడం గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు. “ పదేళ్లలో రైల్వే అభివృద్ధిని ప్యాసింజర్ నుంచి ఎక్స్ ప్రెస్ స్పీడ్ వరకు తీసుకెళ్లాం. మా మూడవ టర్మ్ లో ఇది సూపర్ ఫాస్ట్ వేగంతో ముందుకు సాగుతుంది" అని ప్రధాని మోదీ అన్నారు.

పశ్చిమ బెంగాల్ లో రూ.3,000 కోట్లకు పైగా విలువైన రెండు రోడ్డు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు. ఎన్ హెచ్ 27లోని ఘోష్పుకుర్ - ధూప్గురి సెక్షన్, నాలుగు వరుసల ఇస్లాంపూర్ బైపాస్ ను నాలుగు లేన్లుగా మార్చడం వల్ల జల్పాయిగురి, సిలిగురి, మైనాగురి నగరాల్లో ట్రాఫిక్ జామ్ తగ్గుతుందని, అలాగే సిలిగురి, జల్పాయిగురి, అలీపుర్దువార్ ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుందని ఆయన అన్నారు. "దువార్, డార్జిలింగ్, గ్యాంగ్టక్ , మిరిక్ వంటి పర్యాటక ప్రదేశాలను చేరుకోవడం సులభం అవుతుంది" అని ప్రధాని  అన్నారు, ఇది ప్రాంతంలోని వాణిజ్యం, పరిశ్రమ తేయాకు తోటలకు కూడా ఊతం ఇస్తుందని పేర్కొన్నారు.

ప్రసంగాన్ని ముగిష్టూ, ప్రధాన మంత్రి పశ్చిమ బెంగాల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. నేటి అభివృద్ధి పథకాల ప్రారంభం సందర్భంగా ప్రజలను అభినందించారు.

కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ సి.వి.ఆనందబోస్, కేంద్ర సహాయ మంత్రి శ్రీ నిశిత్ ప్రామాణిక్, పార్లమెంటు సభ్యులు శ్రీ రాజు బిస్టా, ఇతర పార్లమెంటు, శాసన సభ్యులు పాల్గొన్నారు.

నేపథ్యం

ప్రధాన మంత్రి ఉత్తర బెంగాల్, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల ప్రయోజనాలకు ఉద్దేశించిన పలు రైలు మార్గాల విద్యుదీకరణ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు ప్రాజెక్టులలో ఎక్లాఖీ - బలూర్ఘాట్ విభాగం; బర్సోయి - రాధికాపూర్ విభాగం; రాణినగర్ జల్పాయిగురి - హల్దీబరి విభాగం; బాగ్ దోగ్రా మీదుగా సిలిగురి - అలుబరి సెక్షన్ , సిలిగురి - సివోక్ - అలీపుర్దువార్ జంక్షన్ - సముక్తాలా (అలీపుర్దువార్ జంక్షన్ - న్యూ కూచ్ బెహర్ తో సహా) విభాగం ఉన్నాయి.

ప్రధాన మంత్రి జాతికి అంకితం చేసిన. ఇతర ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులలో మణిగ్రామ్ - నిమ్తితా సెక్షన్ లో రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టున్యూ జల్పాయిగురిలో ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ తో సహా అంబారీ ఫలకట - అలుబరిలో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ ఉన్నాయి. సిలిగురి- రాధికపూర్ మధ్య కొత్త ప్యాసింజర్ రైలు సర్వీసును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. రైలు ప్రాజెక్టులు రైలు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి, సరుకు రవాణాను సులభతరం చేస్తాయి. ఇంకా ప్రాంతంలో ఉపాధి కల్పనఆర్థిక వృద్ధికి దోహదం చేస్తాయి.

పశ్చిమ బెంగాల్ లో రూ.3,100 కోట్ల విలువైన రెండు జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. ఎన్ హెచ్ 27లోని నాలుగు లేన్ల ఘోష్ పుకూర్ - ధూప్గురి సెక్షన్, ఎన్ హెచ్ 27పై నాలుగు లేన్ల ఇస్లాంపూర్ బైపాస్ ప్రాజెక్టుల్లో ఉన్నాయి. ఘోష్పుకుర్ - ధూప్గురి విభాగం తూర్పు భారతదేశాన్ని దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలిపే ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్లో భాగం. విభాగాన్ని నాలుగు లేన్లుగా మార్చడం వల్ల ఉత్తర బెంగాల్ , ఈశాన్య ప్రాంతాల మధ్య అంతరాయం లేని కనెక్టివిటీకి వీలవుతుంది. నాలుగు వరుసల ఇస్లాంపూర్ బైపాస్ ఇస్లాంపూర్ పట్టణంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి సహాయపడుతుంది. రహదారి ప్రాజెక్టులు ప్రాంతంలో పారిశ్రామిక , ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయి.



(Release ID: 2013395) Visitor Counter : 97