ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

ఏ ఐ ఆవిష్కరణ ఆవరణాన్ని బలోపేతం చేయడానికి ప్రతిష్టాత్మకమైన ఇండియా ఏ ఐ మిషన్‌కు క్యాబినెట్ ఆమోదం


ఏ ఐ ఆవిష్కరణలను ఉత్ప్రేరకపరచడానికి 10,000 లేదా అంతకంటే ఎక్కువ జీ పీ యూ ల ప్రభుత్వ ఏ ఐ కంప్యూట్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలి

స్వదేశీ పునాది నమూనాల అభివృద్ధిలో పెట్టుబడి

ఇండియా ఏ ఐ స్టార్టప్ రుణాలు ఏ ఐ స్టార్టప్‌ల కోసం ఐడియా నుండి వాణిజ్యీకరణ వరకు నిధులను విడుదల చేస్తుంది

సురక్షితమైన, విశ్వసనీయ మరియు నైతిక ఏ ఐ అభివృద్ధి & విస్తరణ కోసం దేశీయ సాధనాలు

Posted On: 07 MAR 2024 7:48PM by PIB Hyderabad

మేకింగ్ ఏ ఐ ఇన్ ఇండియా మరియు మేకింగ్ ఏ ఐ వర్క్ ఫర్ ఇండియా అనే దార్శనికతకు అనుగుణంగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్, రూ.10,371.92 కోట్ల బడ్జెట్ వ్యయంతో సమగ్ర జాతీయ స్థాయి ఇండియాఏఐ మిషన్‌కు ఆమోదం తెలిపింది.

 

ఇండియా ఏ ఐ మిషన్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో వ్యూహాత్మక కార్యక్రమాలు మరియు భాగస్వామ్యాల ద్వారా ఏ ఐ ఆవిష్కరణను ఉత్ప్రేరకపరిచే సమగ్ర పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. కంప్యూటింగ్ అందుబాటును ప్రజాస్వామ్యీకరించడం ద్వారా, సమాచార నాణ్యతను మెరుగుపరచడం, స్వదేశీ ఏ ఐ సామర్థ్యాలను అభివృద్ధి చేయడం,  ఏ ఐ అగ్రశ్రేణి ప్రతిభను ఆకర్షించడం, పరిశ్రమల సహకారాన్ని ప్రారంభించడం, స్టార్టప్ రిస్క్ క్యాపిటల్‌ను అందించడం, సామాజికంగా ప్రభావవంతమైన ఏ ఐ ప్రాజెక్ట్‌లను నిర్ధారించడం మరియు నైతిక ఏ ఐ ని బలోపేతం చేయడం ద్వారా భారతదేశ ఏ ఐ పర్యావరణ వ్యవస్థ యొక్క బాధ్యతాయుతమైన, సమగ్ర వృద్ధికి దారి తీస్తుంది.

 

డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డిఐసి) కింద 'ఇండియాఎఐ' ఇండిపెండెంట్ బిజినెస్ డివిజన్ (ఐబిడి)కింది విభాగాలు ద్వారా మిషన్ అమలు చేయబడుతుంది

 

1. ఇండియా ఏ ఐ కంప్యూట్ సామర్థ్యం: భారతదేశం యొక్క వేగంగా విస్తరిస్తున్న ఏ ఐ స్టార్టప్‌లు మరియు పరిశోధన ఆవరణ వ్యవస్థ నుండి పెరుగుతున్న డిమాండ్‌లను తీర్చడానికి ఇండియా ఏ ఐ కంప్యూట్ పునాది అత్యున్నతమైన  విస్తరించే ఏ ఐ కంప్యూటింగ్ ఆవరణ వ్యవస్థ ను నిర్మిస్తుంది. పర్యావరణ వ్యవస్థ 10,000 లేదా అంతకంటే ఎక్కువ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల (జీ పీ యూ లు) ఏ ఐ కంప్యూట్ అవస్థాపనను కలిగి ఉంటుంది. ఇది పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా నిర్మించబడింది. ఇంకా ఏ ఐ ని ఒక సేవగా మరియు ఏ ఐ ఆవిష్కర్తలకు ముందుగాశిక్షణఇచ్చిన మోడల్‌లను అందించడానికి ఏ ఐ వాణిజ్యబజారు రూపొందించబడుతుంది. ఏ ఐ ఆవిష్కరణకు కీలకమైన వనరుల కోసం ఇది ఒక-స్టాప్ పరిష్కారంగా పని చేస్తుంది.

 

2. ఇండియా ఏ ఐ ఆవిష్కరణ కేంద్రం: ఇండియా ఏ ఐ ఆవిష్కరణ కేంద్రం దేశీయ లార్జ్ మల్టీమోడల్ మోడల్స్ (ఎల్ ఎం ఎం ఎస్) మరియు రంగ నిర్దిష్ట పునాది మోడల్‌ల అభివృద్ధి మరియు విస్తరణను అవసర రంగాలలో చేపడుతుంది.

 

3. ఇండియా ఏ ఐ డేటాసెట్స్ ప్లాట్‌ఫారమ్ - ఇండియా ఏ ఐ డేటాసెట్స్ ప్లాట్‌ఫారమ్ ఏ ఐ ఆవిష్కరణల కోసం నాణ్యమైన వ్యక్తిగతేతర డేటాసెట్‌లకు అందుబాటును క్రమబద్ధీకరిస్తుంది. భారతీయ స్టార్టప్‌లు మరియు పరిశోధకులకు వ్యక్తిగతేతర డేటాసెట్‌లకు అడ్డంకులు లేని అందుబాటు కోసం సమీకృత పరిష్కారాన్ని అందించడానికి ఏకీకృత డేటా ప్లాట్‌ఫారమ్ అభివృద్ధి చేయబడుతుంది.

 

4. ఇండియా ఏ ఐ అప్లికేషన్ అభివృద్ధి కార్యక్రమం - ఇండియా ఏ ఐ అప్లికేషన్ అభివృద్ధి కార్యక్రమం కేంద్ర మంత్రిత్వ శాఖలు, స్టేట్ డిపార్ట్‌మెంట్‌లు మరియు ఇతర సంస్థల నుండి సేకరించిన సమస్య ప్రకటనల ఆధారంగా అవసర రంగాలలో ఏ ఐ అప్లికేషన్‌లను అభివృద్ధి చేస్తుంది. పెద్ద ఎత్తున సామాజిక ఆర్థిక పరివర్తనను ఉత్ప్రేరకపరిచే సంభావ్యతతో ప్రభావవంతమైన ఏ ఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడం/ విస్తరించడం /అభివృద్ధి చేయడంపై ఈ చొరవ దృష్టి సారిస్తుంది.

 

5. ఇండియా ఏ ఐ భవిష్య నైపుణ్యాలు- ఇండియా ఏ ఐ భవిష్య నైపుణ్యాలు అనేది ఏ ఐ ప్రోగ్రామ్‌లలోకి ప్రవేశించడానికి ఉన్న అడ్డంకులను తగ్గించడానికి ఉద్దేశించబడింది మరియు అండర్ గ్రాడ్యుయేట్, మాస్టర్స్-లెవల్ మరియు పీహెచ్ డీ లలో ఏ ఐ కోర్సులను పెంచుతుంది.  ప్రాథమిక పునాదిస్థాయి కోర్సులను అందిస్తుంది అలాగే భారతదేశంలోని టైర్ 2 మరియు టైర్ 3 నగరాల్లో డేటా మరియు ఏ ఐ ల్యాబ్‌లు ఏర్పాటు చేయబడతాయి.

 

6. ఇండియా ఏ ఐ స్టార్టప్ రుణాలు: ఇండియా ఏ ఐ స్టార్టప్ రుణాలు లోతైన సాంకేతికత ఏ ఐ స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడానికి మరియు వేగవంతం చేయడానికి మరియు భవిష్యత్తు ఏ ఐ ప్రాజెక్ట్‌లను ప్రారంభించడానికి నిధులకు క్రమబద్ధమైన ప్రాప్యతను అందించడానికి ఉద్దేశించబడింది.

 

7. సురక్షితమైన & విశ్వసనీయ ఏ ఐ - ఏ ఐ యొక్క బాధ్యతాయుతమైన అభివృద్ధి, విస్తరణ మరియు స్వీకరణను ముందుకు తీసుకెళ్లడానికి ఆవిష్కర్తల కోసం అసెస్‌మెంట్ చెక్‌లిస్ట్‌లు మరియు ఇతర మార్గదర్శకాలు మరియు గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్‌లు, తగిన రక్షణ  అవసరాన్ని గుర్తించడం, సురక్షితమైన  విశ్వసనీయ ఏ ఐ పునాది, స్వదేశీ సాధనాలు మరియు ఫ్రేమ్‌వర్క్‌ల అభివృద్ధితో సహా బాధ్యతాయుతమైన ఏ ఐ ప్రాజెక్ట్‌ల అమలును అనుమతిస్తుంది. 

 

ఆమోదించబడిన ఇండియా ఏ ఐ మిషన్ భారతదేశ సాంకేతిక సార్వభౌమత్వాన్ని నిర్ధారించడానికి ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది మరియు దేశీయ సామర్థ్యాలను నిర్మిస్తుంది. ఇది దేశం యొక్క యువ జనాభా లభ్యతను ఉపయోగించుకోవడానికి అత్యంత నైపుణ్యం కలిగిన ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది. భారతదేశం ఈ పరివర్తనాత్మక సాంకేతికతను సామాజిక ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించవచ్చో మరియు దేశ ప్రపంచ పోటీతత్వాన్ని పెంపొందించుకోవడాన్ని ప్రపంచానికి ప్రదర్శించేందుకు ఇండియా ఏ ఐ మిషన్ సహాయం చేస్తుంది.

 

 ***



(Release ID: 2012587) Visitor Counter : 86