రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వదేశీ విధానంతో భారతదేశ రక్షణ వ్యవస్థ గతంలో కంటే పటిష్టంగా ఉంది: రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్


" శత్రువులను తిప్పికొట్టడానికి సాయుధ బలగాలు పూర్తి సామర్ధ్యంతో సన్నద్ధంగా ఉన్నాయి "

"2028-29 నాటికి రక్షణ ఎగుమతులు రూ.50,000 కోట్లకు చేరుతాయి".. రక్షణ శాఖ మంత్రి

" సాంకేతిక పరిజ్ఞానం తీసుకునే దేశంగా కాకుండా సాంకేతిక పరిజ్ఞానం అందించే దేశంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు అమలు జరుగుతున్నాయి." శ్రీ రాజ్‌నాథ్ సింగ్

Posted On: 07 MAR 2024 12:56PM by PIB Hyderabad

" ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న   స్వదేశీ విధానంతో  భారతదేశ రక్షణ వ్యవస్థ  గతంలో కంటే పటిష్టంగా ఉంది. స్వదేశీ స్పూర్తితో రక్షణ రంగాన్ని బలోపేతం చేయడానికి చర్యలు అమలు జరుగుతున్నాయి" అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఒక ప్రైవేటు మీడియా సంస్థ ఈరోజు ఢిల్లీలో రక్షణ రంగంపై నిర్వహించిన సదస్సులో  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఆలోచనా దృక్పథం మారడంతో రక్షణ రంగంలో సమూల మార్పులు వచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు.  ప్రస్తుత ప్రభుత్వం, గత ప్రభుత్వాలు అనుసరించిన  విధానాల  మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం 'దృక్కోణం' అని అన్నారు.  ప్రస్తుత ప్రభుత్వం భారతదేశ ప్రజల సామర్థ్యం పట్ల పూర్తి నమ్మకంతో ఉందని మంత్రి తెలిపారు. దీనికి భిన్నంగా అంతకుముందు అధికారంలో ఉన్నవారు  ప్రజల సామర్థ్యం పట్ల విశ్వాసం కనబరచలేదు అని  మంత్రి అన్నారు.

రక్షణ తయారీలో ‘ఆత్మ నిర్భరత ’ను ప్రోత్సహించడం ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద మార్పుగా శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. ప్రభుత్వ విధానాలతో రక్షణ రంగంలో సమూల మార్పులు వచ్చాయన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం  ఉత్తరప్రదేశ్,తమిళనాడులో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ల ఏర్పాటు చేసిందని అఆయన వివరించారు. స్వావలంబన సాధించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ చేపట్టిన సంస్కరణలతో భాగంగా రక్షణ కారిడార్లు ఏర్పాటు అయ్యాయన్నారు.  సంస్కరణలలో భాగంగా ప్రభుత్వం స్వదేశంలో తయారు చేయడానికి వస్తువులను  గుర్తించి జాబితా  విడుదల చేసిందని, దేశీయ పరిశ్రమకు మూలధన సేకరణ బడ్జెట్‌లో 75% కేటాయించిందని,  ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు కార్పొరేటీకరణ చేసిందన్నారు. రక్షణ రంగాన్ని అభివృద్ధి చేయడానికి  ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (iDEX), iDEX ప్రైమ్, iDEX (ADITI),  ఏసింగ్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్ (TDF)వంటి పథకాలు/ ఆవిష్కరణలను ప్రభుత్వం ప్రారంభించిందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. 

ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు   రక్షణ రంగంపై సానుకూల ప్రభావం చూపుతున్నాయని తెలిపిన  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ “2014లో దాదాపు రూ. 40,000 కోట్ల వరకు ఉన్న  వార్షిక రక్షణ ఉత్పత్తి ఇప్పుడు రికార్డు స్థాయిలో రూ.1.10 లక్షల కోట్లు దాటింది. తొమ్మిదేళ్ల క్రితం రూ.1,000 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు నేడు రూ.16,000 కోట్లకు చేరుకున్నాయి. 2028-29 నాటికి రూ.50,000 కోట్ల ఎగుమతులు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది" అని అన్నారు. 

దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రక్షణ వ్యవస్థకు జవసత్వాలు అందించిందని  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.  దీని వల్ల భారతదేశం బలమైన, స్వావలంబన కలిగిన సైన్యంతో ప్రపంచ వేదికపై శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించిందని ఆయన అన్నారు. “ఈ రోజు కేంద్రంలో బలమైన  నాయకత్వం ఉంది. దీని కారణంగా మన బలగాలు బలమైన సంకల్ప శక్తి పొందాయి. సైనికుల మనోధైర్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం  నిరంతరం కృషి చేస్తోంది. శత్రువులను తిప్పికొట్టడానికి సాయుధ బలగాలు పూర్తి సామర్ధ్యంతో  సన్నద్ధంగా ఉన్నాయి " అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. 

" యువతను పూర్తిగా విశ్వసిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది. ఇదే సమయంలో  ప్రైవేట్ రంగానికి ఆదర్శవంతమైన వాతావరణాన్నికల్పించింది" అని  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. “మా యువకులు ఒక అడుగు ముందుకు వేస్తే, మేము 100 అడుగులు వేసి వారికి సహాయం అందిస్తాము. . వారు 100 అడుగులు వేస్తే, మేము 1,000 అడుగులు ముందుకు వేస్తాము” అని ఆయన వ్యాఖ్యానించారు. 

సాంకేతిక పరిజ్ఞానం అంశాన్ని ప్రస్తావించిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్  అభివృద్ధి చెందుతున్న దేశాలకు 'ఆవిష్కరణ'  'అనుకరణ' అనే రెండు ఎంపికలు ఉన్నాయని అన్నారు. " సాంకేతిక పరిజ్ఞానం తీసుకునే దేశంగా కాకుండా సాంకేతిక పరిజ్ఞానం అందించే దేశంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు అమలు జరుగుతున్నాయి." అని  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. సాంకేతిక పరంగా, ఆవిష్కరణల పరంగా అభివృద్ధి చూడని దేశాలు అభివృద్ధి చెందిన దేశాల నుంచి  సాంకేతికతను పొందడం తప్పు కాదు. ఇతర దేశాల సాంకేతిక అంశాలు అమలు చేసే దేశాలు  ఆవిష్కరణ సామర్థ్యం, మానవ వనరులు కొత్త సాంకేతికతలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన స్థాయికి చేరుకోవడం కష్టతరంగా ఉంటుంది. . ఒక దేశం ఇతర దేశాల  సాంకేతికతను అనుకరిస్తే, అది ఇప్పటికీ పాత సాంకేతిక విధానంలో  ముందుకు సాగాల్సి  ఉంటుంది.  ఇతర దేశాలను అనుసరించడం వల్ల  రెండవ తరగతి సాంకేతికతకు ఉపయోగించాల్సి ఉంటుంది. .ఇది అభివృద్ధి చెందిన దేశం కంటే 20-30 ఏళ్లు వెనుకబడి ఉండేలా  చేస్తుంది. దేశం  ఆత్మవిశ్వాసాన్నికోల్పోతుంది. అనుకరణ  మనస్తత్వం సంస్కృతి, భావజాలం, సాహిత్యం, జీవనశైలి , తత్వశాస్త్రం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అనుకరణ  మనస్తత్వాన్ని బానిస మనస్తత్వం అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భావిస్తారు. ” అని ఆయన అన్నారు.

బానిసత్వ ఆలోచనా విధానాన్ని పారదోలడానికి  ప్రభుత్వం, మీడియా, మేధావులు టక  కర్తవ్యంగా భావించి పనిచేయాలని  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ కోరారు. ఈ సందర్భంగా . ప్రధానమంత్రి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్నిశ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తావించారు.  బానిస మనస్తత్వాన్ని విడనాడాలని, జాతీయ వారసత్వం పట్ల గర్వపడాలి అని ప్రధానమంత్రి  ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  " ఇతరుల నుంచి  జ్ఞానం పొందాలి. ఇదే సమయంలో  మన జాతీయ వారసత్వం గురించి కూడా తెలుసుకోవాలి మరియు దాని గురించి గర్వపడాలి" అని రక్షణ మంత్రి అన్నారు.

వలసవాద మనస్తత్వాన్ని తొలగించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వివరించారు.దీనిలో భాగంగా భారతీయ శిక్షాస్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహితను ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని మంత్రి తెలిపారు.  “దేశ సంస్కృతిపై యువతకు ప్రభుత్వం విశ్వాసం కల్పించింది.  భారతదేశంలో భారతీయతను పునరుద్ధరించాము.  చరిత్రను చూసే విధానంలో మార్పు వచ్చింది. ఐఐటిలు, ఐఐఎమ్‌లతో పాటు ఇతర ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో చదువుతున్న యువతకు ఆత్మ విశ్వాసం కలిగింది.  విదేశాల్లో అవకాశాల కోసం ప్రయత్నించకుండా యువత దేశంలోనే స్టార్టప్‌లు , ఆవిష్కరణల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు సహకరిస్తున్నారు, ”అని ఆయన అన్నారు.

శతాబ్దాల కాలంగా  భారతీయ సంస్కృతిలో  సైనిక శక్తి మరియు ఆధ్యాత్మికత మధ్య సామరస్యం ఉంది అని రక్షణ శాఖ మంత్రి పేర్కొన్నారు. సేవలో ఉన్న, రిటైర్డ్ సిబ్బంది, దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన వారి అభ్యున్నతి కోసం ప్రభుత్వం  నిరంతరం కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.. “సాయుధ బలగాలు సరికొత్త అత్యాధునిక ఆయుధాలు/ప్లాట్‌ఫారమ్‌లతో ఆధునీకరించబడుతున్నాయి. ధైర్యవంతుల త్యాగాలకు గుర్తుగా  న్యూ ఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్‌ని ఏర్పాటుఅయ్యింది. . దీంతోపాటు మాజీ సైనికుల చిరకాల డిమాండ్‌ అయిన వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ పథకాన్నికేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది" అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వివరించారు.

***



(Release ID: 2012246) Visitor Counter : 62