వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

అక్రమ కార్యకలాపాలను ప్రోత్సహించేలా ఉన్న ప్రకటనలు, ప్రచారం, సమ్మతి పత్రాలలో నిషేధంపై అడ్వైజరీ జారీ చేసిన కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ


బెట్టింగ్, జూదం ఖచ్చితంగా నిషేధం

గేమింగ్‌గా మభ్యపెడుతూ సాగే బెట్టింగ్, జూదం ఆమోదాలపై కఠినమైన చర్యలు

ఆన్‌లైన్ జూదం మరియు బెట్టింగ్‌ను ప్రోత్సహించే సెలబ్రిటీలు, ప్రభావశీలురుకు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే వారిలా సమాన బాధ్యతను కలిగి ఉంటుందని సీసీపీఏ హెచ్చరిక

Posted On: 06 MAR 2024 2:41PM by PIB Hyderabad

బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ప్రోత్సహించే ప్రకటనలు పెరుగుతున్న నేపథ్యంలో,  కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సీసీపీఏ)  ఒక సమగ్ర సలహా (అడ్వైజరీ) జారీ చేసింది. సలహా, వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ప్రకారం, వివిధ చట్టాల ప్రకారం నిషేధించబడిన చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ప్రోత్సహించేలా ఉన్న ప్రకటనలు, ప్రచారం, ఆమోదం నిషేధాన్ని స్పష్టం చేస్తుంది. దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాలు బెట్టింగ్, జూదం పబ్లిక్ గ్యాంబ్లింగ్ చట్టం, 1867 ప్రకారం ఖచ్చితంగా నిషేధించారు. చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు.  అయినప్పటికీ, ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, యాప్‌లు నేరుగా బెట్టింగ్, జూదం, అలాగే గేమింగ్ ముసుగులో ప్రకటనలు చేస్తూనే ఉన్నాయి. ఇటువంటి కార్యకలాపాల ఆమోదాలు ముఖ్యంగా యువతకు ఎక్కువగా ఆర్థిక,సామాజిక-ఆర్థిక చిక్కులలో పడేస్తున్నాయి.

బెట్టింగ్, జూదం ప్లాట్‌ఫారమ్‌లను ప్రచారం చేయకుండా వారిని హెచ్చరిస్తూ, మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు వివిధ సలహాలను జారీ చేయడంలో సమాచార,  ప్రసార మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలను ఈ సలహా స్పష్టంగా వివరిస్తుంది. ఆన్‌లైన్ ప్రకటనల మధ్యవర్తులు భారతీయ ప్రేక్షకులను ఉద్దేశించి ఇటువంటి ప్రకటనలను లక్ష్యంగా చేసుకోకుండా ఉండేలా తగు హెచ్చరికలు కూడా చేశారు.

తప్పుదోవ పట్టించే ప్రకటనల నివారణకు, తప్పుదోవ పట్టించే ప్రకటనల కోసం ఎండార్స్‌మెంట్లు, 2022కు మార్గదర్శకాలు ప్రస్తుత చట్టంలో నిషేధించిన ఉత్పత్తులు లేదా సేవల ప్రకటనలను నిర్దిష్టంగా నిషేధిస్తున్నట్లు సలహా ప్రముఖంగా వివరించింది.

ఉపయోగించిన మాధ్యమంతో సంబంధం లేకుండా అన్ని ప్రకటనలకు మార్గదర్శకాలు వర్తిస్తాయని పునరుద్ఘాటించింది.   చట్టవిరుద్ధమైన స్థితిని బట్టి  ఆన్‌లైన్ జూదం, బెట్టింగ్‌ల ప్రచారం లేదా ప్రకటనలో పాల్గొనే  సెలబ్రిటీలుశీలురును చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొన్న సమాన బాధ్యత కలిగి వుంటారని సీసీపీఏ హెచ్చరించింది. ఈ సలహా ద్వారా, బెట్టింగ్ లేదా జూదానికి పరిమితం కాకుండా చట్టం ద్వారా నిషేధించబడిన ఏదైనా ప్రకటన లేదా కార్యకలాపాల ఆమోదం కఠినమైన పరిశీలనకు లోబడి ఉంటుందని సీసీపీఏ హెచ్చరించింది. మార్గదర్శకాల ఉల్లంఘన జరిగినట్టు తెలిస్తే, తయారీదారులు, ప్రకటనదారులు, ప్రచురణకర్తలు, మధ్యవర్తులు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ఎండార్స్‌లు (సమ్మతి ఇచ్చిన వారు), ఇతర సంబంధిత వాటాదారులతో సహా, వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ప్రకారం, కఠినమైన చర్యలు చేపడతారు.
కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ,  ఈ మార్గదర్శకాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని, భారతీయ చట్టం ప్రకారం చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ప్రోత్సహించడం లేదా ఆమోదించడం మానుకోవాలని అన్ని వాటాదారులను కోరింది.

సలహాను ఇక్కడ యాక్సెస్ చేయవచ్చు ...

 https://consumeraffairs.nic.in/sites/default/files/file-uploads/latestnews/CCPA-1-1-2024-CCPA.pdf

****



(Release ID: 2012077) Visitor Counter : 86