ఆర్థిక మంత్రిత్వ శాఖ
రాష్ట్ర మరియు కేంద్ర జిఎస్టి ఫార్మేషన్‌ల ఎన్‌ఫోర్స్‌మెంట్ చీఫ్‌ల తొలి జాతీయ సదస్సును ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
- వాటాదారుల ఆందోళనలను అర్థం చేసుకోవడానికి, సమ్మతిని మెరుగుపరచడానికి, ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి మరియు పన్ను వ్యవస్థను మరింత పారదర్శకంగా మరియు సమర్ధవంతంగా చేయడానికి మరింత సహకారంతో పని చేయాలని జిఎస్‌టి అధికారులను ప్రోత్సహించిన ఆర్థిక మంత్రి
- జిఎస్‌టి పరోక్ష పన్నులను సరళీకృతం చేసింది మరియు ప్రజల జీవితాలను సులభతరం చేసింది: ఆర్థిక శాఖ సహాయ మంత్రి
- సమర్థవంతంగా మెరుగైన జీఎస్టీ అమలు కోసం కీలక ప్రాధాన్యతలను వివరిస్తూ విధానపరమైన సాంకేతిక జోక్యాలను మరింత మెరుగుపరచడం గురించి ఫీడ్‌బ్యాక్ అవసరాన్ని నొక్కి చెప్పిన రెవెన్యూ కార్యదర్శి
- సీబీఐసీ సూచనలతో సమకాలీకరణలో అమలు మరియు న్యాయబద్ధత మధ్య సమతుల్యతను కొనసాగించడం యొక్క ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించిన సీబీఐసీ ఛైర్మన్
- జీఎస్టీ ఎగవేత టైపోలాజీలు, ప్రాధాన్య పద్ధతులు మరియు ప్రబలంగా ఉన్న రంగాలు, సహకార ప్రయత్నాల ప్రాముఖ్యత, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం మరియు అధిక-రిస్క్ పన్ను
చెల్లింపుదారులను గుర్తించడం ద్వారా మోసపూరిత ప్రవర్తనను ముందస్తుగా నిరోధించడం వంటి అంశాలపై ఒక రోజు ప్రారంభ సమావేశంలో లోతైన చర్
Posted On:
04 MAR 2024 7:28PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈరోజు న్యూఢిల్లీలో రాష్ట్ర మరియు కేంద్ర జిఎస్టి ఫార్మేషన్‌ల ఎన్‌ఫోర్స్‌మెంట్ అధినేతల మొట్టమొదటి జాతీయ సదస్సును ప్రారంభించారు. వివిధ పరోక్ష పన్నులలో అధికారులు చేపట్టే అమలు చర్యలను.. పన్ను అధికారుల కార్యకలాపాలను అర్థం చేసుకోవడం మరియు క్రమబద్ధీకరించడానికి ఈ సదస్సు మరో ముందడుగును అందించింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి; ఆర్థిక శాఖలోని రెవెన్యూ విభాగం కార్యదర్శి శ్రీ సంజయ్ మల్హోత్రా; పరోక్ష పన్నులు మరియు కస్టమ్స విభాగం (సీబీఐసీ) ఛైర్మన్ శ్రీ సంజయ్ కుమార్ అగర్వాల్, రెవెన్యూ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు, రాష్ట్రాల జీఎస్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్ చీఫ్‌లు మరియు సెంట్రల్ సీఎస్టీ అధికారులు, జీఎస్టీఎన్ సీఈఓ మరియు జీఎస్టీన్ ప్రతినిధి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ), డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) వంటి ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్ అధినేతలు , డైరెక్టర్ సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో (ఎన్సీబీ); మరియు డిజి, సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో (సీఈఐబీ) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ 2017 మొదలు జిఎస్‌టి సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా నమ్మదగిన, లక్ష్య-ఆధారిత మరియు సామర్థ్యం గల వ్యవస్థగా మార్చడంలో కేంద్రం, రాష్ట్రాల జిఎస్‌టి నిర్మాణాల నిరంతర కృషిని ప్రశంసించారు. లొసుగులను పూడ్చడానికి అలాగే మెరుగైన పన్ను చెల్లింపుదారుల సేవలను అందించడానికి సాంకేతికతను ఉపయోగించుకోవాలని అన్ని జిఎస్‌టి నిర్మాణాలను కేంద్ర ఆర్థిక మంత్రి కోరారు. ఆవిష్కరణ యొక్క ప్రాముఖ్యతను ఎత్తిచూపుతూ, కేంద్ర ఆర్థిక మంత్రి అభివృద్ధి చెందుతున్న ఉత్తమ అభ్యాసాలను పంచుకోవాలని సూచించారు, జాతీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాల అంతటా కూడా నిరంతర సమన్వయం యొక్క అవసరాన్ని గురించి నొక్కి చెప్పారు. దీనికి తోడు కేంద్రం మరియు రాష్ట్రాల ఎన్‌ఫోర్స్‌మెంట్ చీఫ్‌ల మధ్య క్రమం తప్పకుండా ఇటువంటి సమావేశాలను నిర్వహించడం మరియు అడ్డంకులను చర్చించడం, విజయవంతమైన వ్యూహాలను మార్చుకోవడం మరియు మరింత పటిష్టమైన సామరస్యపూర్వకమైన పన్ను మౌలిక సదుపాయాల వైపు సమిష్టిగా ముందుకు సాగడం కోసం ఈ వేదికను ఉపయోగించుకోవడం యొక్క ప్రాముఖ్యతను గురించి కేంద్ర మంత్రి శ్రీమతి సీతారామన్ నొక్కి చెప్పారు.
వ్యవస్థను మరింత పారదర్శకంగా…
వర్గీకరణ సంబంధిత అంశాలపై స్పష్టత రావాలంటే తగిన మార్గాల ద్వారా వీలైనంత త్వరగా పరిశీలించాలని కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నొక్కి చెప్పారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో గడిచిన 10 సంవత్సరాలు నిరంతరం ప్రయత్నాల ద్వారా వ్యవస్థలను ప్రక్షాళన చేయవచ్చని, మరింత ప్రభావవంతంగా ఉండవచ్చని చూపించారని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు. వాటాదారుల ఆందోళనలను అర్థం చేసుకోవడానికి, సమ్మతిని మెరుగుపరచడానికి, ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి మరియు పన్ను వ్యవస్థను మరింత పారదర్శకంగా మరియు సమర్ధవంతంగా చేయడానికి తగిన సహకారంతో పని చేయాలని జీఎస్టీ అధికారులకు సీతారామన్ ఉద్బోధించారు.
సులభతరం చేసేందుకు కృషి
శ్రీ చౌదరి ఈ సదస్సు నిర్వహణ చొరవను అభినందిస్తూ, పరోక్ష పన్నుల అమలుకు సంబంధించిన వివిధ సమస్యలను క్రమబద్ధీకరించడానికి ఇది దోహదపడుతుందని, సదస్సులో మేధోమథనం ద్వారా రాబోయే సవాళ్లకు వ్యూహాలను రూపొందించడంలో కూడా ఇది సహాయపడుతుందని అన్నారు. భారత దేశంలో జీఎస్టీని పెద్ద సంస్కరణగా అభివర్ణించిన శ్రీ చౌదరి, జీఎస్టీ పరోక్ష పన్నులను సరళీకృతం చేసిందని.. సమర్థవంతమైన పన్ను రేటును తగ్గించిందని, తద్వారా ప్రజల జీవితాలను సులభతరం చేసిందని అన్నారు. మరింత ఎక్కువ మంది పన్ను చెల్లింపుదారులకు ఈ వ్యవస్థను సులభతరం చేసేందుకు కృషి చేయాలని శ్రీ చౌదరి జిఎస్‌టి నిర్మాణాలను ఉద్బోధించారు.
‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’సాధించే దిశగా
జిఎస్‌టి వసూళ్లలో అనేక రెట్లు పెరుగుదలను ఉటంకిస్తూ శ్రీ చౌదరి ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’సాధించే దిశగా ప్రధాన మంత్రి యొక్క దార్శనికతను సాధించడంలో జిఎస్‌టి అధికారుల సహకారాన్ని ప్రశంసించారు. 2014లో బలహీనంగా ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రయాణాన్ని ఇప్పుడు మొదటి ఐదు స్థానాలకు చేర్చడంలో ప్రధానమంత్రి మరియు ఆర్థిక మంత్రి నాయకత్వాన్ని ఘనత వహించారు. శ్రీ చౌదరి నెలవారీ జీఎస్టీ ఆదాయం త్వరలోనే లక్షిత రూ.2 లక్షల కోట్లకు చేరగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో, రెవెన్యూ కార్యదర్శి శ్రీ సంజయ్ మల్హోత్రా, జిఎస్‌టి వ్యవస్థ యొక్క విజయాన్ని నిర్ధారించడంలో అమలు యొక్క కీలక పాత్రను నొక్కిచెప్పారు. శ్రీ మల్హోత్రా కీలకమైన ప్రాధాన్యతలను వివరించారు. అధిక-ప్రమాదకర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడం, పన్ను ఎగవేతదారులను ఎదుర్కోవడం, పన్ను చెల్లింపుదారుల హక్కులతో అమలును సమతుల్యం చేయడం, కేంద్ర మరియు రాష్ట్ర అధికారుల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం మరియు విధానం మరియు సాంకేతిక జోక్యాల మెరుగుదల కోసం అభిప్రాయాన్ని సేకరించడం వంటివి కీలక ప్రాధాన్యతలని ఆయన వివరించారు. నకిలీ సంస్థలు మరియు జిఎస్‌టి ఎగవేతలు మన జాతీయ ఆదాయానికి గండి కొట్టడంతో పాటు.. న్యాయమైన పోటీని వక్రీకరిస్తాయని మరియు నిగూడమైన ఆర్థిక వ్యవస్థకు ఆజ్యం పోస్తాయని సీబీఐసీ ఛైర్మన్ శ్రీ సంజయ్ కుమార్ అగర్వాల్ వన్డే కాన్ఫరెన్స్ సందర్భాన్ని తెలియజేస్తూ అన్నారు. బలమైన డేటా ఎనలిటిక్స్ మరియు టెక్నాలజీ వినియోగం యొక్క ప్రాముఖ్యతను మరియు సీఎస్టీ ఎగవేతకు పాల్పడేవారి కంటే ముందు ఉండవలసిన అవసరాన్ని ఆయన హైలైట్ చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్య సమయంలో అనుసరించాల్సిన ప్రక్రియకు సంబంధించి సీబీఐసీ జారీ చేసిన సూచనలను పాటించాలని అధికారులకు ఆయన గుర్తు చేశారు. తన స్వాగత ప్రసంగంలో, అదనపు కార్యదర్శి, రెవెన్యూ మాట్లాడు జీఎస్టీ అమలులో సహకారాన్ని పెంపొందించడానికి మరియు ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి, కేంద్ర మరియు రాష్ట్ర జీఎస్టీ అధికారులను ఒకచోట చేర్చడానికి ఈ ప్లాట్‌ఫారమ్ యొక్క ప్రత్యేక సామర్థ్యాన్ని హైలైట్ చేశారు.
నిర్మాణ సంస్థల ద్వారా వివిధ ప్రదర్శనలు
ఈ ఒక రోజు సదస్సులో, జిఎస్‌టి నిర్మాణ సంస్థల ద్వారా వివిధ ప్రదర్శనలు కూడా చేయబడ్డాయి. జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ సమర్పించిన డేటా ప్రకారం, మే 2023 నుండి నకిలీ రిజిస్ట్రేషన్లు మరియు బోగస్ బిల్లింగ్‌పై దేశవ్యాప్తంగా అణిచివేత కార్యక్రమాలను చేపట్టడం ఫలితంగా ఐటీసీ పన్ను ఎగవేత రూ. 31,512 బోగస్ సంస్థలతో కలిపి 49,623 కోట్లకు చేరింది. 2020 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రూ.1,14,755 కోట్ల నకిలీ ఐటీసీ ఎగవేతలను గుర్తించినట్లు సీబీఐసీ తెలిపింది. మహారాష్ట్ర రాష్ట్ర జీఎస్టీ అనుమానిత అసలైన పన్ను చెల్లింపుదారుల (ఎన్టీటీపీలు) నిజ సమయ పర్యవేక్షణ డాష్‌బోర్డ్‌ను ప్రదర్శించింది. 29 ఫిబ్రవరి 2024 నాటికి, రాష్ట్రం 41,601 అనుమానిత ఎన్జీటీపీలను గుర్తించింది, వాటిలో 6,034 ఎన్జీటీపీలు కనుగొనబడ్డాయి. రిజిస్ట్రేషన్ సమయంలో సేకరించిన వివిధ ఇంటెలిజెన్స్, సీబీఐసీ/ఇతర రాష్ట్రాల నుండి ఇ-వే బిల్లులు మరియు ఇన్‌పుట్‌ల ఆధారంగా డిటెక్షన్ అనేది మరింత హైలైట్ చేయబడింది. ప్రారంభ దశలో గుర్తింపు రేటును మెరుగుపరచడానికి తీసుకున్న చర్యలను వివరించింది. కేంద్ర మరియు రాష్ట్ర జీఎస్టీ ఫార్మేషన్‌ల నుండి కేంద్ర మరియు రాష్ట్ర జిఎస్‌టి ఫార్మేషన్‌లకు చెందిన ప్రతినిధులు జిఎస్‌టి ఎగవేత రకాలు, ప్రాధాన్య పద్ధతులు మరియు ప్రబలంగా ఉన్న రంగాలు, సహకార ప్రయత్నాల ప్రాముఖ్యత వంటి లోతైన చర్చల ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. ఇప్పటికే ఉన్న మోసపూరిత ప్రవర్తన కానీ అధిక-రిస్క్ పన్ను చెల్లింపుదారులను గుర్తించడం ద్వారా ముందస్తుగా నిరోధించడానికి గురించి కూడా ఇందులో చర్చించారు. నకిలీ ఇన్‌వాయిస్ మరియు మనీలాండరింగ్, గుర్తింపు చౌర్యం మరియు సర్క్యులర్ ట్రేడింగ్ వంటి దాని సంబంధిత సమస్యలను పరిష్కరించడంపై కూడా చర్చించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ ద్వారా అమలు చేయబడిన ఉత్తమ పద్ధతులు మరియు నిరోధక చర్యలు కూడా భాగస్వామ్యం చేయబడ్డాయి. కాన్ఫరెన్స్ వ్యాపారాలకు కనీస అంతరాయాన్ని నిర్ధారిస్తూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఎదుర్కొంటున్న చట్టపరమైన మరియు కార్యాచరణ సవాళ్లను నావిగేట్ చేయడం గురించి చర్చించారు. సీబీఐసీ మరియు డీజీజీఐ జీఎస్టీ అమలుకు మరింత పన్ను చెల్లింపుదారుల-స్నేహపూర్వక విధానాన్ని కలిగి ఉండవలసిన అవసరాన్ని నొక్కిచెప్పడంతో పాటు, ప్రబలంగా ఉన్న వాణిజ్య విధానాలకు సంబంధించిన సమస్యలపై అనవసరమైన ఆడిట్‌లను నివారించడం మరియు సాక్ష్యం-ఆధారిత విచారణలకు ప్రాధాన్యత ఇవ్వడంపై దృష్టి సారించడం గురించి హైలైట్ చేయబడింది. లొకేషన్ సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని మరియు సమన్‌లను ఉపయోగించకుండా ఉత్తరాల ద్వారా అధికారికంగా సమాచారాన్ని అభ్యర్థించాలని కూడా సూచించింది.
జీఎస్టీఎన్ మరియు డీజీ సిస్టమ్స్, సీబీఐసీ ప్రమాదకర పన్ను చెల్లింపుదారులను గుర్తించడానికి మరియు జీఎస్టీ ఎగవేతను ఎదుర్కోవడానికి పన్ను అధికారులకు అందుబాటులో ఉన్న వివిధ విశ్లేషణాత్మక సాధనాలను వివరించింది. టూల్స్‌ను క్రమబద్ధీకరించడం మరియు వాటిని అన్ని జీఎస్టీ అమలు ఫార్మేషన్‌లకు అందుబాటులో ఉంచడం గురించి కూడా చర్చ కేంద్రీకృతమైంది. డీజీ అనలిటిక్స్ మరియు రిస్క్ మేనేజ్‌మెంట్ మొదటి రిటర్న్‌ను దాఖలు చేయడానికి ముందే సైకిల్ ప్రారంభంలో సంభావ్య జీఎస్టీ ఎగవేతదారులను గుర్తించడానికి రిస్క్ అనలిటికల్ టూల్‌ను ప్రదర్శించింది. నకిలీ రిజిస్ట్రేషన్ల సంఖ్యను తగ్గించడంలో జీఎస్టీ సేవా కేంద్రాలు ఇటీవల సాధించిన విజయాన్ని గుజరాత్ హైలైట్ చేసింది. గుజరాత్ కంట్రోల్ ఆఫ్ టెర్రరిజం అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్, 2015 కింద 20 మందిని అరెస్టు చేసిన నకిలీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఇటీవలి కేసు కూడా ఉత్తమ అభ్యాసానికి సంబంధించిన కేస్ స్టడీగా హైలైట్ చేయబడింది. సర్వీస్ సెక్టార్‌లో బిల్ ట్రేడింగ్ మరియు మైల్డ్ స్టీల్ స్క్రాప్, మిస్ క్లాసిఫికేషన్ వంటి ప్రత్యేక కేస్ టైపోలాజీలను కర్ణాటక హైలైట్ చేసింది. పశ్చిమ బెంగాల్ GST మోసాలపై పరిశోధనకు సహాయపడే సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను హైలైట్ చేసింది. ఉత్తరాఖండ్, సిక్కిం మరియు ఆంధ్రప్రదేశ్ కూడా జీఎస్టీ అమలులో తమ ఉత్తమ విధానాలను ప్రదర్శించాయి. ఈ సదస్సు వివిధ రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వాల మధ్య అనుభవాలన్ని పంచుకోవడం మరియు జ్ఞాన బదిలీని సులభతరం చేసింది. పాల్గొనేవారు గత అమలు చర్యలను సమీక్షించారు, విలువైన అభ్యాసాలను సేకరించారు మరియు పన్ను అమలు అధికారుల కోసం భవిష్యత్తు పని ప్రాంతాలను అన్వేషించారు. సానుకూల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా, క్రమం తప్పకుండా అనుభవాన్ని పంచుకోవాల్సిన అవసరాన్ని సమావేశం తెలియపరించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ చీఫ్‌ల నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ స్టేట్ మరియు సెంట్రల్ జిఎస్‌టి ఫార్మేషన్స్ ద్వైవార్షికంగా ముందుకు సాగాలని నిర్ణయించారు.
***
(Release ID: 2011909)
Visitor Counter : 91