బొగ్గు మంత్రిత్వ శాఖ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు, క్యాప్టివ్ & వాణిజ్య గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి, సరఫరాలో వరుసగా 27%, 29% వృద్ధి

Posted On: 02 MAR 2024 2:41PM by PIB Hyderabad

క్యాప్టివ్, వాణిజ్య గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి, సరఫరా నెలవారీ ప్రాతిపదికన (ఎంవోఎం) & సంవత్సరం ప్రాతిపదికన (వైవోవై) పెరిగాయి. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 29 వరకు, క్యాప్టివ్ & వాణిజ్య బొగ్గు గనుల నుంచి మొత్తం బొగ్గు ఉత్పత్తి, పంపిణీ 126.80 ఎంటీ, 128.88 ఎంటీగా నమోదైంది. FY 2022-23 అదే కాలంతో పోలిస్తే ఇది వరుసగా 27.06%, 29.14% పెరుగుదల. అధిక ఉత్పత్తి సామర్థ్యం, బలమైన రవాణా వ్యవస్థకు ఇది నిదర్శనం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి చివరి నాటికి మొత్తం ఉత్పత్తి గనుల సంఖ్య 54గా ఉంది. వీటిలో 35 విద్యుత్ రంగానికి, 11 అనియంత్రిత రంగానికి, 8 బొగ్గు విక్రయాల కోసం కేటాయించారు. వాణిజ్య పరంగా చూస్తే, 91 గనులకు  విజయవంతంగా వేలం వేశారు. వాటిలో 7 గనుల్లో ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభమైంది.

2024 ఫిబ్రవరిలో మొత్తం బొగ్గు ఉత్పత్తి, పంపిణీ 14.85 ఎంటీ, 12.95 ఎంటీగా నమోదైంది. FY 2022-23 అదే కాలంలో ఇది వరుసగా 10.85 ఎంటీ, 9.72 ఎంటీగా ఉంది. దీనితో పోలిస్తే, ఇప్పుడు వరుసగా 37%, 33% వృద్ధి సాధ్యమైంది. సగటు రోజువారీ బొగ్గు ఉత్పత్తి, పంపిణీ రేటు వరుసగా రోజుకు 5.12 ఎల్‌టీ & 4.46 ఎల్‌టీగా ఉంది, స్థిరమైన పనితీరు కనిపిస్తోంది.

బొగ్గు ఉత్పత్తి & పంపిణీలో చెప్పుకోదగ్గ వృద్ధి భారతదేశ ఇంధన భద్రతకు భరోసానిస్తుంది. దిగుమతి చేసుకున్న బొగ్గుపై దేశం ఆధారపడటాన్ని తగ్గించడంలో బొగ్గు మంత్రిత్వ శాఖ నిబద్ధతకు ఇది నిదర్శనం. భారతదేశ స్వావలంబనను ప్రోత్సహించడానికి, 'భారత్‌లో తయారీ' ప్రచారానికి మద్దతుగా ఇవి నిలుస్తాయి.

విధాన సంస్కరణలను వ్యూహాత్మకంగా అమలు చేయడం, గనుల యాజమాన్యాల అంకితభావమే ఈ విజయానికి కారణమని బొగ్గు మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ఉత్సాహాన్ని కొనసాగించడంపై బొగ్గు మంత్రిత్వ శాఖ దృష్టి పెట్టింది. దేశంలో పెరుగుతున్న ఇంధన డిమాండ్లను తీర్చేలా ఉత్పత్తి కార్యకలాపాలను మరింత క్రమబద్ధీకరించడం & మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

***



(Release ID: 2010988) Visitor Counter : 87