ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈశాన్య రాష్ర్టాల్లో రిమోట్ లాండ్ కస్టమ్స్ స్టేషన లో ఎలక్ర్టానిక్ డేటా ఇంటర చేంజ్ (ఇడిఐ) ప్రారంభించిన కేంద్ర ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్


రిమోట్ ఎల్ సిఎస్ కు ఇడిఐ అనుసంధానత కల్పించడంతో వస్తువుల వాస్తవ కదలికలపై కచ్చితమైన సమాచారం అందుబాటులోకి వస్తుంది : కేంద్ర ఆర్థిక మంత్రి

కస్టమ్స్ స్టేషన్లను ఇడిఐతో అనుసంధానం చేయడం వల్ల పన్ను విధానాలు, కస్టమ్స్ విధానాలు ‘‘ఫేస్ లెస్’’, ‘‘ఆటోమేటెడ్’’ అవుతాయి : రెవిన్యూ కార్యదర్శి

ఈశాన్య ప్రాంతం (ఎన్ఇఆర్) భౌగోళికంగా వ్యూహాత్మక ప్రాధాన్యం అయినది, లాండ్ కస్టమ్స్ స్టేషన (ఎల్ సిఎస్) ద్వారా వాణిజ్యం పెరుగుదలకు అద్భుత అవకాశాలు కలిగి ఉంటుంది : సిబిఐసి చైర్మన్

వాణిజ్య, వ్యాపార ప్రయోజనాలు అందరికీ అందించడంలో టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకోవడానికి సిబిఐసి కట్టుబడి ఉంది : సిబిఐసి సభ్యుడు (కస్టమ్స్)

ఇప్పుడు వస్తువుల కదలికలు, కస్టమ్స్ అనుసమతులు మరింత సమర్థవంతం అవుతాయి, తద్వారా ప్రాంతీయ వాణిజ్యం పెరగడంతోపాటు ఆర్థిక వృద్ధి ఉత్తేజితం అవుతుంది

Posted On: 29 FEB 2024 6:14PM by PIB Hyderabad

ఈశాన్య ప్రాంతానికి చెందిన లాండ్ కస్టమ్స్  స్టేషన్ల (ఎల్ సిఎస్) వద్ద ఎలక్ర్టానిక్ డేటా ఇంటర్ చేంజ్ (ఇడిఐ) వ్యవస్థను కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్  న్యూఢిల్లీ నుంచి వర్చువల్  గా ప్రారంభించారు. ఈ రిమోట్ ఎల్ సిఎస్ కు ఇడిఐ అనుసంధానత ఏర్పడడంతో వస్తు కదలికలు, కస్టమ్స అనుమతులు మరింత సమర్థవంతం అయి ప్రాంతీయ వాణిజ్యం పెరుగుతుంది, ఇది ఆర్థిక వృద్ధిని ఉత్తేజితం చేస్తుంది. 

కేంద్ర ఆర్థిక శాఖలో రెవిన్యూ కార్యదర్శి శ్రీ సంజయ్  మల్హోత్రా, కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు (సిబిఐసి) చైర్మన్  శ్రీ సంజయ్ కుమార్ అగర్వాల్, సిబిఐసి (పరిపాలన, విజిలెన్స్) సభ్యుడు శ్రీ అలోక్ శుక్లా, సిబిఐసి (పన్ను విధానం, లీగల్) సభ్యుడు శ్రీ వివేక్  రంజన్, సిబిఐసి (కస్టమ్స్) సభ్యుడు శ్రీ సుర్జిత్  భుజబల్,  సిబిఐసి  (ఐటి, పన్ను చెల్లింపు సర్వీసులు, టెక్నాలజీ) సభ్యురాలు శ్రీమతి అరుణా నారాయణ్ గుప్తాలతో పాటు సిబిఐసి, ఆర్థికమంత్రిత్వ శాఖకు చెందిన రెవిన్యూ శాఖ సీనియర్ అధికారులు ఈ ఇడిఐ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

దేశంలో డిజిటల్  మౌలిక వసతులు కల్పించాలని, డిజిటల్  విప్లవ ప్రయోజనాలు అందరికీ అందుబాటులోకి వచ్చేలా చూడాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు దీటుగా దేశంలోని ప్రత్యేకించి ఉత్తర, ఈశాన్య ప్రాంత సరిహద్దుల్లోని నాన్-ఇడిఐ ఎల్ సిఎస్ లను ఇడిఐ ఎల్ సిఎస్ లుగా మార్చేందుకు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సిబిఐసి) చేస్తున్న కృషిని ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ 2023 జూలై 21వ తేదీన గువాహటిలో జరిగిన ఒక సమావేశంలో ప్రశంసించారు. ఈశాన్య ప్రాంతంలో పని చేస్తున్న ఎల్ సిఎస్ లన్నింటినీ ఇడిఐ సదుపాయం గల కేంద్రాలుగా మార్చాలని ఆమె సిబిఐసికి నొక్కి చెప్పారు.

ఎగుమతులకు ఎదురవుతున్న అవరోధాలను తొలగించేందుకు కృషి చేయాలని సిబిఐసి, కస్టమ్స్ శాఖలను లాండ్  కస్టమ్స్ స్టేషన్ల వద్ద ఇడిఐ సదుపాయం ప్రారంభిస్తున్న సందర్భంగా ఆర్థికమంత్రి ఆదేశించారు. రిమోట్ ఎల్ సిఎస్ కు ఇడిఐ అనుసంధానత కల్పించడం ఈ దిశగా ఒక ముందడుగు అని, దీని వల్ల వస్తువుల కదలికలకు సంబంధించిన వాస్తవిక డేటా అందుబాటులోకి వస్తుందని  ఆమె అన్నారు.  
సునిశితమైన సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేకించి జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో   సిబ్బంది నియామకం విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆర్థికమంత్రి పిలుపు ఇచ్చారు. 

‘‘2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారుచేయాలన్నది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచన. ఇద సాకారం కావాలంటే ఆధునిక డిజిటల్  మౌలిక వసతులను అందుబాటులోకి తేవడం, టెక్నాలజీని సంపూర్ణంగా వినియోగంలోకి తేవడం, డిజిటల్ విప్లవం ప్రయోజనాలు పౌరులందరికీ అందుబాటులోకి తేవడం అవసరం. కస్టమ్స్  స్టేషన్లకు ఎలక్ర్టానిక్ డేటా ఇంటర్  చేంజ్ (ఇడిఐ) అనుసంధానత కల్పించడం ఈ దిశగా ముందడుగు.  దీని వల్ల కస్టమ్స్  విధానాలు ‘‘ఫేస్ లెస్’’, ‘‘ఆటోమేటెడ్’’ అవుతాయి అని శ్రీ మల్హోత్రా అన్నారు. 
‘‘ఎన్ఇఆర్ లోని రిమోట్  ప్రాంతాల్లో ఉన్న లాండ్ కస్టమ్స్ స్టేషన్లకు ఇడిఐ అనుసంధానత కల్పించే ఈ కార్యక్రమం ద్వారా సిబిఐసి ఈశాన్య భారతం  అభివృద్ధికి ఎంతో అవసరమైన పునాది వేసింది’’ అని శ్రీ మల్హోత్రా చెప్పారు. 

ఈ సందర్భంగా శ్రీ అగర్వాల్ స్వాగతోపన్యాసం చేస్తూ ఈశాన్య ప్రాంతానికి (ఎన్ఇఆర్) భౌగోళికంగా వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్నదని, లాండ్ కస్టమ్స్  స్టేషన్ల (ఎల్ సిఎస్) వద్ద పొరుగు దేశాలకు వాణిజ్యం పెరుగుదలకు మంచి అవకాశాలున్నాయని అన్నారు. 

ఈశాన్యంలోని 7 రాష్ర్టాలు-అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, మణిపూర్, అరుణాచల్  ప్రదేశ్, సిక్కిం అన్నింటినీ కవర్  చేస్తూ 44 ఎల్ సిఎస్ లున్నాయని శ్రీ అగర్వాల్ చెప్పారు. ఎల్ సిఎస్ ల వద్ద  భౌతిక మౌలిక వసతుల కల్పన, కస్టమ్స్  విధానాల ఆటోమేషన్ భారత కస్టమ్స్  శాఖకు ఎల్లప్పుడూ ప్రాధాన్యతాంశాలుగానే ఉన్నాయి. 

‘‘ఈశాన్య ప్రాంతాల్లోని (ఎన్ఇఆర్) రిమోట్ ప్రదేశాల్లో వాణిజ్య సరళీకరణను ప్రోత్సహించడం, సమర్థతను పెంచడం దిశగా ఇడిఐ వ్యవస్థ ప్రారంభం ఒక ముందడుగు. వాణిజ్య, వ్యాపార ప్రయోజనాలకు టెక్నాలజీని ఉపయోగించుకోవడం పట్ల మా కట్టుబాటుకు ఇది నిదర్శనం’’ అని ధన్యవాదాలు తెలుపుతూ సభ్యుడు (కస్టమ్స్) శ్రీ సుర్జిత్  భూజబల్ అన్నారు.  

ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి టెక్నాలజీని వినియోగించుకోవడంలో భాగంగా ఇక్కడ పొందుపరిచిన ఎల్ సిఎస్ ల వద్ద ఇడిఐ సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. అవి భారత-బంగ్లాదేశ్  సరిహద్దులోని ఘసువాపురా, భోలాగంజ్, షెల్లా బజార్, బోర్సోరా, ఖోవైఘాట్, బఘ్మారా, గోనక్ గంజ్, కరీంగంజ్, దాకి; భారత-మయన్మార్ సరిహద్దులోని జోఖౌతర్. ఆప్టికల్  ఫైబర్ లేదా మొబైల్  నెట్ వర్క్  అందుబాటులో లేని సుదూర ప్రాంతాల్లో ఉన్న ఎల్ సిఎస్ వద్ద విశేషమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. పలు ప్రాంతాల్లో విశాట్ ఏర్పాటు ద్వారా సిబిఐసి ఈ అవరోధాలను అధిగమించగలిగింది. కస్టమ్స్  కార్యకలాపాల టెక్నికల్ సామర్థ్యం పెంచడం మాత్రమే కాదు, కర్తవ్య కాల్  దిశగా జాతి వేస్తున్న అడుగుకు సిబిఐసి కట్టుబాటును కూడా ఇది ప్రతిబింబిస్తుంది.  

***
 


(Release ID: 2010545) Visitor Counter : 137


Read this release in: English , Urdu , Hindi , Assamese