విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ఐఈఈఎంఏని ప్రశంసించిన కేంద్ర విద్యుత్, కొత్త & పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్.కె. సింగ్


- ఎలక్రామా- 2025ని ప్రారంభించడంపై ప్రశంసలు కురిపించిన మంత్రి

Posted On: 28 FEB 2024 5:47PM by PIB Hyderabad

భారత దేశంలోని ఎలక్ట్రికల్, పరిశ్రమల ఎలక్ట్రానిక్స్ అనుబంధ పరికరాల తయారీదారుల అత్యున్నత సంఘం ఇండియన్ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐఈఈఎంఏ), ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రికల్ షో అయిన ఎలక్రామా- 2025 (ELECRAMA) యొక్క 16 ఎడిషన్ను అధికారికంగా ప్రకటించింది ప్రదర్శన 2025 ఫిబ్రవరి 22 నుండి 26 వరకు ఢిల్లీలో జరగాల్సి ఉంది మరియు "సుస్థిరమైన భవిష్యత్తు కోసం రీఇమేజినింగ్ ఎనర్జీఅనే ఇతివృత్తంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. హరిత, మరింత స్థితిస్థాపక శక్తి పర్యావరణ వ్యవస్థను సాధించే దిశగా సంభాషణ, సహకారాన్ని పెంపొందించడం ఈ ఈవెంట్ లక్ష్యం. ఎలక్రామా- 2025 అత్యాధునిక ఆవిష్కరణలు, నూతన పోకడలను  మరియు ఈ రంగం వృద్ధికి దారితీసే పరిష్కారాలను అన్వేషించడానికి పరిశ్రమ నాయకులు, విధాన రూపకర్తలు మరియు వాటాదారులకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఎలక్రామా- 2025 ప్రకటనపై ఐఈఈఎంఏని ప్రశంసిస్తూ, కేంద్ర విద్యుత్ మరియు నూతన & పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్. కె. సింగ్ ఒక ప్రకటన వెల్లడించారు.  "గత 9 సంవత్సరాలలో సుమారు 200 గిగా వాట్ల  ఉత్పత్తి సామర్థ్యాన్ని జోడించడం ద్వారా ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని విద్యుత్ కొరత నుండి కాపాడుతూ తగినంత విద్యుత్తు అందుబాటులో ఉండే దేశంగా మార్చింది. మేము దేశం మొత్తాన్ని ఏకీకృత గ్రిడ్‌తో అనుసంధానించాము, దేశంలోని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి 1,16,000 మెగావాట్లను బదిలీ చేయగల సామర్థ్యం మనకు ఉంది. ఈ చర్యలన్నీ భారతదేశ భవిష్యత్తును శక్తివంతం చేస్తున్నాయి. ఎలక్రామా అనేది మనం భవిష్యత్తును ఎలా శక్తివంతం చేస్తున్నామో ప్రతిబింబిస్తుంది. ఎలక్రామా 2025 కోసం పరిచయం చేయబడిన కొత్త థీమ్‌లను చూసినందుకు నేను సంతోషిస్తున్నాను. సుస్థిర భవిష్యత్తు కోసం శక్తిని పునర్నిర్మించడంపై దృష్టి సారించడంతో ఈ ఇతివృత్తాలు ప్రభుత్వ దీర్ఘకాలిక దృష్టి మరియు కార్యక్రమాలకు నేరుగా మద్దతునిస్తాయి. ” అని అన్నారు. ఈ కార్యక్రమం ఆవిష్కరణ కార్యక్రమంలో చైర్‌పర్సన్, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ & ఎక్స్-అఫిషియో సెక్రటరీ, పవర్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ శ్రీ ఘనశ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ: " ఎలక్రామా కార్యక్రమం పరిశ్రమతో పూర్తిగా అనుసంధానించబడి ఉంది. నేను ఈ ప్రదర్శనను భవిష్యత్తుకు సంబంధించినదిగా భావిస్తున్నాను. మనం సాంప్రదాయ నుండి సాంప్రదాయేతర ఇంధన వనరులకు మారే రహదారిని ప్రారంభించే సమయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతోంది. పరిశ్రమ ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది, అలాగే కొత్త సృజనాత్మక పరిష్కారాలు మరియు సాంకేతికతల ఉనికిని ప్రమోట్ చేయడం, ప్రదర్శించడంతోపాటు ఇప్పటికే ఉన్న సాంకేతికతలను అందుబాటులో ఉంచడం జరుగుతుందని అన్నారు. ఐఈఈఎంఏ అధ్యక్షుడు శ్రీ హమ్జా ఆర్సివాలా పరిశ్రమ యొక్క పథాన్ని రూపొందించడంలో ఎలక్రామా యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. "నేడు, భారతదేశం గర్వంగా స్వావలంబనగా నిలుస్తుంది, ప్రపంచ వేదికను నడిపించడానికి సిద్ధంగా ఉంది. ఎలక్రామా 2025 మన విద్యుత్ రంగాన్ని 'ఆల్-ఎలక్ట్రిక్ ఫ్యూచర్' వైపు నడిపించే దిశగా ఉంది. ఎలక్రామా 2023 యొక్క అద్భుతమైన విజయాన్ని ఆధారం చేసుకొని, మేము ఎలక్రామా 2025ని మరింత గణనీయమైనదిగా – పెద్దదిగా, విస్తృమైనదిగా అంచనా వేస్తున్నాము. అని అన్నారు. ” దీనికి కొనసాగింపుగా ఐఈఈఎంఏ  ఉపాధ్యక్షుడు శ్రీ విక్రమ్ గండోత్రా మాట్లాడుతూ “ఎలక్రామా - 2025 ఒక సంచలనాత్మక ఈవెంట్‌గా ఉంటుందని హామీ ఇచ్చారు, గ్రీన్ హైడ్రోజన్‌తో సహా కొత్త రకాల శక్తి రంగంలో అత్యాధునిక ఉత్పత్తులు మరియు సాంకేతికతల యొక్క ఆకట్టుకునే శ్రేణిని ప్రదర్శిస్తుంది, డిజిటల్ ఎనర్జీ, రెన్యూవబుల్స్, ఈవీ ఛార్జింగ్, ఎనర్జీ స్టోరేజ్, ఫ్యూయల్ సెల్, ఏఐ మరియు ఐఓటీ సాంకేతిక ఆధారిత ఉత్పత్తుల ప్రదర్శన వేదికగా ఉంటుంది. 16వ ఎడిషన్లో 100కు పైగా దేశాల నుంచి 10+ డెడికేటెడ్ కంట్రీ పెవిలియన్‌ల నుండి బృందాలు పాల్గొననున్నాయి.  వారితో 20 బిలియన్ల డాలర్ల విలువైన వ్యాపార విచారణలను ఆశిస్తున్నాము. ” అని అన్నారు. ఈ సందర్భంగా స్కిండ్లర్ ఎలక్ట్రిక్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్  శ్రీ దీపక్ శర్మ మాట్లాడుతూ “పరిశ్రమ లీడర్‌లు మరియు విధాన కర్తలను ఒకచోట చేర్చడానికి, వారి మధ్య చర్చలను పెంపొందించడానికి, వినూత్న సాంకేతికతలను ప్రదర్శించడానికి మరియు జ్ఞాన భాగస్వామ్యాన్ని ఎనేబుల్ చేయడానికి శక్తివంతమైన వేదికగా ఎలక్రామా -2025 నిలుస్తుంది. ఐఈఈఎంఏ బృందానికి అభినందనలు. ” అని అన్నారు.

***



(Release ID: 2010287) Visitor Counter : 56


Read this release in: English , Urdu , Hindi , Tamil