మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

పౌష్టికాహారానికి సంబంధించి పోషణ్ ఉత్సవ్ ఈవెంట్ను రేపు న్యూఢిల్లీలో నిర్వహించనున్న కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ.


కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరాన్ఇ, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో ఛైర్ బిల్గేట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ సందర్భంగా పోషణ్ ఉత్సవ్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.

పౌష్టికాహారానికి సంబంధించిన సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు , కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖతో కలసి తన మద్దతు ప్రకటించనున్న కార్టూన్ కొయలేషన్ సంస్థ.

Posted On: 28 FEB 2024 2:08PM by PIB Hyderabad

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ (ఎం.డబ్ల్యు.సి.డి) పోషన్ ఉత్సవ్ను నిర్విహించనుంది. ఈ ఉత్సవం పౌష్టికాహార ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసే వేదికగా ఉపయోగపడనుంది. దీనిని కార్టూన్ కొయలేషన్ ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 29న న్యూఢిల్లీలో  కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ వేదికనుంచి పోషణ్ ఉత్సవ్ పుస్తకాన్ని విడుదల చేస్తారు. ఎం.డబ్ల్యు.సి.డితో కలిసి పౌష్టికాహార ప్రాధాన్యతపై సందేశాత్మక ప్రచారానికి తమ మద్దతును కార్టూన్ కొయలేషన్ ప్రకటించనుంది.

ఈ ఉత్సవానికి కేంద్ర మహిళా,శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరాని, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ (బిఎంజిఎఫ్) కో ఛైర్ బిల్ గేట్స్,కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతాధికారులు, ఇతర మంత్రిత్వశాఖ అధికారులు హాజరుకానున్నారు.

 

పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు చేసే ప్రయత్నంలో ఈ కార్యక్రమం ఒక మైలు రాయిగా మిగిలిపోనుంది. ఇది చిన్నపిల్లలలో ఆరోగ్యకరమైన జీవనానికి ఉపకరించనుంది. కార్టూన్ పాత్రలు,ఐఇసి మెటీరియల్ద్వారా ,ఆకట్టుకునే కథల ద్వారా పిల్లలలో పౌష్టికాహార ప్రాధాన్యతపై అవగాహన కల్పించడం జరుగుతుంది. తద్వారా వారిలో పౌష్టికాహారంపై సానుకూల మార్పును తీసుకురావడం జరుగుతుంది.ఈ ప్రయత్నాల ద్వారా జాతీయ స్థాయిలో పౌష్టికాహార అలవాట్లకు సంబంధించి నిర్దేశిత లక్ష్యాలను సాధించడానికి వీలుకలుగుతుంది. పోషణ్ ఉత్సవ్ లో పౌష్టికాహారానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలలో పాపులర్ కార్టూన్ పాత్రలను వాడుకుంటారు. ఈ పాత్ర లద్వారా పౌష్టికాహార ప్రాధాన్యతను తెలియజెబుతారు. ఇందుకు సంబంధించి కేంద్ర మహిళశిశు అభివృద్ది మంత్రిత్వశాఖఅమర్ చిత్రకథ మధ్య కొలాబరేషన్ ఉంటుంది. 

 

సాంస్కృతిక వారసత్వంసంప్రదాయ పౌష్టికాహార పద్ధతులను ప్రోత్సహించేందుకు పోషణ్ ఉత్సవ్ పుస్తకాన్ని విడుదల చేయనున్నారు. దీనిని దీనదయాళ్ రిసెర్చి ఇన్స్టిట్యూట్ (డిఆర్ఐ) రూపొందించింది. దీనికి బిల్మెలిండా గేట్స్ పౌండేషన్ మద్దతునిస్తోంది ఈ పుస్తకాన్ని పౌష్టికాహారానికి సంబంధించి ఒక అట్లాస్లా పనిచేయనుంది. ఇది సాంస్కృతికఆర్ధికశాస్త్రీయ దృక్ఫధంతో రూపొందించారు..

 

ప్రాచీన పౌష్టికాహార సంప్రదాయాలను పునరుద్ధరించడమే కాకఅంతర్జాతీయంగా పౌష్టికాహారానికి సంబంధించిన విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడాకి అధ్యయనానికి ఇది ప్రాధాన్యతనిస్తుంది. ఈ పుస్తకం దేశ సుసంపన్న పోషక విలువలతో కూడిన గొప్ప ఆహారపు అలవాట్లుపౌష్టికాహార వైవిధ్యతకు సంబంధించిన సమాచార నిధిగా ఈ పుస్తకం ఉపకరించనుంది.

***



(Release ID: 2010281) Visitor Counter : 64