జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

6 నదుల పరీవాహక ప్రాంతాల నిర్వహణ కోసం 12 సాంకేతిక విద్యా సంస్థలతోఒప్పందం కుదుర్చుకున్న జలశక్తి మంత్రిత్వ శాఖ


గంగానది తరహాలో ఆరు పెద్ద నదులు అభివృద్ధి

Posted On: 28 FEB 2024 8:00PM by PIB Hyderabad

దేశంలో 6 నదుల పరీవాహక ప్రాంతాల  నిర్వహణ కోసం 12 సాంకేతిక విద్యా సంస్థలతో జలశక్తి మంత్రిత్వ శాఖ  ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో  జలవనరుల సంరక్షించి, అభివృద్ధి చేయడానికి జరుగుతున్న కృషిలో భాగంగా జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ ఒప్పందాలు కుదుర్చుకుంది.  జలవనరుల రంగంలో మున్ముందుఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ ఒప్పందాలు దోహదపడతాయి.  దేశంలో నదీ పరివాహక ప్రాంతాల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న  పనులు ఇదే వేగం, పురోగతితో కొనసాగితే జల  వనరులు పుష్కలంగా లభించాలి అన్న  భారతదేశం  కల త్వరలో నెరవేరుతుంది.నదీ పరివాహక ప్రాంతాల అభివృద్ధి, పరిరక్షణ కోసం భారతదేశం అమలు చేస్తున్న కార్యక్రమాలు  ప్రపంచంలోని ఇతర దేశాలకు  మార్గదర్శకత్వం గా నిలుస్తాయి.   6 నదుల పరీవాహక నిర్వహణకు సంబంధించి విద్య మరియు పరిశోధన సహకారం కోసం 12 సాంకేతిక విద్యా సంస్థల మధ్య ఒప్పందం పై సంతకాలు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నకేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ నదీ పరివాహక ప్రాంతాల అభివృద్ధి, సంరక్షణ కోసం అమలు జరుగుతున్న కార్యక్రమాలను వివరించారు. జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద జలశక్తి మంత్రిత్వ శాఖ, విద్యాసంస్థల మధ్య ఈ ఒప్పందం కుదిరిందని తెలిపారు. . ఈ ప్రాజెక్టు కింద మహానది, గోదావరి, కృష్ణా, కావేరి, నర్మద, పెరియార్ నదుల పరివాహక ప్రాంతాల ప్రస్తుత   నిర్వహణ, భవిష్యత్తులో అమలు చేయాల్సిన  నిర్వహణ ప్రణాళిక రూపొందించడానికి  అవసరమైన పరిశోధన, పర్యవేక్షణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని సేకరించే బాధ్యతను  12 సంస్థలు (ఐఐటీ,ఎన్ఐటీ, నేరి  ) చేపడతాయి. 

ఒప్పందంపై ఎన్ఆర్సిడి తరఫున  ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జీ  అశోక్ కుమార్, సంస్థల కన్సార్టియం డైరెక్టర్లు, ఐఐటీ  IIT కాన్పూర్ డైరెక్టర్  సంతకం చేశారు. న్యూ ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొనే అన్ని సంస్థల డైరెక్టర్లు, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, జల శక్తి మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. 

ఐఐటీ కాన్పూర్ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న  సి గంగా (గంగా బేసిన్ మేనేజ్‌మెంట్ అండ్ స్టడీస్ సెంటర్) పనితీరును జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ప్రశంసించారు.   ఉపనిషత్ లో పేర్కొన్న 'ఏకోహం బహుస్యాం"  స్పూర్తితో పని చేస్తున్న జలశక్తి శాఖ . ఒకదానిని అనేకంగా విస్తరింప చేయడానికి కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు.  6 నదుల పరీవాహక ప్రాంతాల అభివృద్ధి కోసం  విద్యాసంస్థల సహకారాన్ని తీసుకుంటామన్నారు. గంగా నది పరిరక్షణ కోసం అమలు జరుగుతున్న కార్యక్రమాలకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని సి గంగా అందిస్తోందని మంత్రి తెలిపారు. ఇదే  తరహాలో 6 ప్రధాన నదుల   పరీవాహక పరిరక్షణ, అభివృద్ధి కారయ్కర్మాలు అమలు జరుగుతాయని మంత్రి వివరించారు.  జలమంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న విద్యాసంస్థలు తూర్పు, పశ్చిమ, మధ్య, దక్షిణాన నదుల పరీవాహక ప్రాంతాలకు   సాంకేతిక సహకారం అందిస్తాయని అన్నారు. 

 గంగా నదిని శుద్ధి చేసేందుకు గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయని తెలిపిన శ్రీ షెకావత్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేసి విజయం సాధించిందని అన్నారు. పరిపాలన తో  విద్యా సంబంధమైన పరిజ్ఞానాన్ని మిళితం చేసి క్లీన్ గంగ కార్యక్రమం అమలు జరుగుతోందని ఆయన తెలిపారు. ప్రభుత్వం అమలు చేసిన చర్యలు ఆశించిన ఫలితాలు ఇస్తున్నాయని తెలిపిన మంత్రి  యునెస్కో ప్రపంచంలోని పది ఉత్తమ పరిరక్షణ , పునరుజ్జీవన కార్యక్రమాల్లో ఒకటిగా  నమామి గంగే మిషన్‌ను చేర్చిందన్నారు. . గంగా నది స్వచ్ఛత, నిరంతరాయ ప్రవాహాన్ని కొనసాగించే లక్ష్యంతో నదుల పరిరక్షణను ఒక ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కార్యక్రమాన్ని  జీవనోపాధికి అనుసంధానం చేసి అర్థ గంగ సూత్రాన్ని ఆచరణలోకి తెచ్చి  నదుల సంరక్షణ, పునరుజ్జీవన పథకాన్ని ప్రారంభించారని శ్రీ షెకావత్ వివరించారు.జలవనరుల  రంగంలో పరిశోధన, శాస్త్రీయ డాక్యుమెంటేషన్ దేశంలో వేగంగా అమలు జరుగుతుందని తెలిపారు. 

గంగా నది పరీవాహక ప్రాంతం  నిర్వహణ సమయంలో సాధించిన  అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని  ఈ ఆరు నదుల బేసిన్ నిర్వహణ ప్రణాళిక అమలు జరగాలని శ్రీ షెకావత్  సూచించారు.  నదులకు సంబంధించిన అంశాల్లో  అంతర్ రాష్ట్ర సహకారం, సమన్వయం అవసరమని అన్నారు. 

ఈ కార్యక్రమంలో జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి దేబాశ్రీ ముఖర్జీ , క్లీన్ గంగ కోసం నేషనల్ మిషన్ డైరెక్టర్ జనరల్ శ్రీ జి. అశోక్ కుమార్ కూడా ప్రసంగించారు. సి గంగా వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ వినోద్ తారే ఆరు నదుల పరిస్థితి అంచనా, నిర్వహణ ప్రణాళిక వివరాలు  అందించారు.

 సంస్థలకు అప్పగించిన  బాధ్యతలు 

నర్మదా నది పరీవాహక ప్రాంత నిర్వహణ  — ఐఐటీ  ఇండోర్ , ఐఐటీ   గాంధీనగర్

 

గోదావరి నది పరీవాహక ప్రాంత నిర్వహణ — ఐఐటీ   హైదరాబాద్, NEERI నాగ్‌పూర్

 

మహానది నది పరీవాహక ప్రాంత నిర్వహణ — ఐఐటీ   రాయ్‌పూర్,ఐఐటీ రూర్కెలా

 

కృష్ణా నది పరీవాహక ప్రాంత నిర్వహణ — ఎన్ఐటీ  వరంగల్ , ఎన్ఐటీ  సూరత్కల్

 

కావేరి నది పరీవాహక ప్రాంత నిర్వహణ — ఐఐఎస్సీ  బెంగళూరు మరియు ఎన్ఐటీ తిరుచ్చి 

 

పెరియార్ నది పరీవాహక ప్రాంత నిర్వహణ — ఐఐటీ   పాలక్కాడ్ మరియు ఎన్ఐటీ   కాలికట్

 

***

 


(Release ID: 2009971) Visitor Counter : 202