రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఒడిశాలోని కంధమాల్ - గంజాం జిల్లాలో జాతీయ రహదారి-59ని 26.96 కి.మీల మేర విస్తరణ, పటిష్టతకు రూ.718.26 కోట్లు మంజూరు చేసిన కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
27 FEB 2024 3:25PM by PIB Hyderabad
కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఒడిశాలో జాతీయ రహదారి-59 విస్తరణకు భారీగా విరాళం ప్రకటించారు. . 2023-24 వార్షిక ప్రణాళిక కింద కంధమాల్ మరియు గంజాం జిల్లాలో విస్తరించి ఉన్న జాతీయ రహదారి-59పై డేరింగ్‌బడి ఘాట్ సెక్షన్ విస్తరణ మరియు బలోపేతం కోసం రూ.718.26 కోట్లు మంజూరు చేసినట్టుగా ఆయన తెలిపారు ఒక పోస్ట్‌లో ఈ విషయం వెల్లడించారు. ప్రాజెక్ట్ మొత్తం 26.96 కి.మీ. దరింగ్‌బడి ఘాట్ సెగ్మెంట్ ప్రస్తుతం ఇరుకైన క్యారేజ్‌వే మరియు సబ్‌ప్టిమల్ జామెట్రిక్స్ కారణంగా సవాళ్లను ఎదుర్కొంటుందని.. ఈ కారణంగా పశ్చిమ ఒడిశా నుండి వచ్చే దూర ప్రాంత వాహనాలు జాతీయ రహదారి 59ని దాటడానికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టుగా శ్రీ గడ్కరీ తెలిపారు. ప్రముఖ పర్యాటక ప్రదేశంగా ఉన్న ఈ ప్రాంతం ముఖ్యంగా శీతాకాలంలో ఈ విస్తరణ హైవే ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. భద్రతను పెంచుతుందన్నారు. జాతీయ రహదారి-59 వెంట అన్ని వాతావరణ పరిస్థితులలో కూడా మెరుగైన రోడ్డు అనుసంధానతను కలిగి ఉండేలా చూసేందుకు ఇది దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
***
(Release ID: 2009950)
Visitor Counter : 85