సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంకకు చెందిన ప్రభుత్వ అధికారులకు ఎన్‌సిజిజి ముస్సోరీలో నేడు ప్రారంభమైన 2వ సామర్ధ్య నిర్మాణ కార్యక్రమం
కార్యక్రమానికి హాజరైన 40 మంది డివిజనల్ కార్యదర్శులు, సహాయ ప్రధాన కార్యదర్శులు, డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డివిజనల్ కార్యదర్శులుగా పని చేస్తున్నప్రభుత్వ అధికారులు
శ్రీలంక ప్రభుత్వ అధికారులకు రేపటి తరం నైపుణ్యాలను అందించాలన్నది రెండు వారాల కార్యక్రమ లక్ష్యం
Posted On:
26 FEB 2024 4:03PM by PIB Hyderabad
నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్‌సిజిజి - సుపరిపాలన జాతీయ కేంద్రం) శ్రీలంక సీనియర్ సివిల్ సర్వెంట్ల (ప్రభుత్వాధికారులు) కోసం 2 సామర్ధ్య నిర్మాణ కార్యక్రమం నేడు ముస్సోరిలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని 26 ఫిబ్రవరి 2024 నుంచి 8 మార్చి 2024వరకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, మునిసిపల్ కార్యదర్శులు, డివిజనల్ కార్యదర్శులు, అసిస్టెంట్ డివిజనల్ కార్యదర్శులు, డిప్యూటీ కమిషనర్, డిప్యూటీ ల్యాండ్ కమిషనర్, ప్రాంతీయ డైరెక్టర్లు, అసిస్టెంట్ చీఫ్ సెక్రెటరీ, ప్రాంతీయ స్పోర్ట్స్ డైరెక్టర్ సహా శ్రీలంకలో వివిధ హోదాలలో పని చేస్తున్న 40మంది సీనియర్ సివిల్ సర్వెంట్లు హాజరయ్యారు. శ్రీలంక సీనియర్ సివిల్ సర్వెంట్ల మొదటి బృందం 12-17 ఫిబ్రవరి, 2024 మధ్య కాలంలో ఎన్‌సిజిజిని సందర్శించింది. ప్రధానమంత్రి కార్యదర్శి శ్రీ అనురా దిస్సనాయక 14మంది సభ్యులతో కూడిన ఈ బృందానికి నేతృత్వం వహించారు. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని పాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం కింద పని చేసే ఎన్‌సిజిజి స్వయంప్రతిపత్తి గల సంస్థ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రభుత్వ విధానంలో సామర్ధ్య నిర్మాణం, క్రియాశీలక పరిశోధనకు కట్టుబడి ఉంటుంది.
సుపరిపాలనా జాతీయ కేంద్రం (ఎన్‌సిజిజి) డైరెక్టర్ జనరల్ , పాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదులు (డిఎఆర్‌పిజి) కార్యదర్శి శ్రీ వి. శ్రీనివాస్ ఎన్‌సిజిజి కార్యనిర్వహక చట్రంను మాత్రమే కాక, కేంద్రం ఏర్పడినప్పటి నుంచి అది సాధించిన చెప్పుకోదగ్గ పురోగతిని పరిచయం చేశారు. గరిష్ట పాలన - కనీస ప్రభుత్వం అన్న విధాన సూత్రం కింద ప్రభుత్వాన్ని- పౌరులను సన్నిహితం చేసేందుకు డిజిటల్ సాంకేతికతను స్వీకరించడంలోనే గొప్ప విజయాన్ని పట్టి చూపుతూ, పరిపాలనలో నూతన రూపావళిలో లోతైన అంతర్దృష్టులను ఆయన తన ఉపన్యాసంలో అందించారు. సిపిజిఆర్ఎఎంఎస్ ద్వారా ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వంటి చెప్పుకోదగిన విజయాలను పట్టి చూపుతూ, దీనివల్ల ప్రజలకు చేకూరే లబ్ధిని నొక్కి చెప్పారు. అంతేకాకుండా, ఇ- ఉన్నత్, నివేష్ మిస్త్రా, సేవా సింధు సహా కీలకమైన ఇ-గవర్నెన్స్ చట్రాలను ఉదహరిస్తూ సమగ్రమైన పాలన కోసం డిజిటల్ పరిష్కారాలను ఉపయోగించుకోవాలన్న భారత్ నిబద్ధతను ప్రదర్శించారు. ఈ కార్యక్రమ ప్రాథమిక లక్ష్యం భారతదేశంలో పాలన, ప్రజా సేవల బట్వాడాను మెరుగుపరిచేందుకు అమలు చేసిన విజ్ఞానం, ఆవిష్కరణల మార్పిడిని సులభతరం చేయడం. శ్రీలంకలో కూడా భారత్‌ను అనుకరించి ఇ -గవర్నెన్స్ నమూనాలను విజయవంతంగా అన్వేషించి, అమలు చేసేందుకు పాల్గొన్నవారిని ప్రోత్సహిస్తూ, దానివల్ల గల సంభావ్య పరివర్తనాత్మక ప్రభాన్ని నొక్కి చెప్పారు.
ఈ కోర్సు గురించి స్థూలదృష్టిని ఇస్తూ, ఎన్‌సిజిజి దేశంలో చేపట్టిన భూసేకరణ, పాలన రూపావళిని మార్చడం, అందరికీ గృహాలు, డిజిటల్ సాంకేతికతను ఉపయోగించుకోవడం, తీర ప్రాంతాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ విపత్తు నిర్వహణ, పిఎం జన్ ఆరోగ్య యోజన, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలు, స్వామిత్వ పథకం, జిఇఎంః పాలనలో పారదర్శకతను తేవడం, ఆధార్ తయారీ ః సుపరిపాలనకు ఒక మంచి పరికరం, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయం, వర్తుల ఆర్ధిక వ్యవస్థ, ఎన్నికల నిర్వహణ సహా దేశంలో చేపట్టిన అనేక చొరవలను ఎన్‌సిజిజి పంచుకుంటోందని అసోసియేట్ ప్రొఫెసర్, కోర్స్ కోఆర్డినేటర్ డా. ఎపి సింగ్ చెప్పారు. అభ్యాస అనుభవాన్ని మరింత సుసంపన్నం చేసేందుకు, పాలన, సమాజ గతిశీలితలోకి ఆచరణాత్మక అంతర్దృష్టులను అందించేందుకు క్షేత్ర పర్యటనలుగా ఇందిరాగాంధీ ఫారెస్ట్ నేషనల్ అకాడెమీ, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగ, తాజ్ మహల్ వంటి ప్రముఖ సంస్థలకు వారిని తీసుకువెళ్ళారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో ఎన్‌సిజిజి బాంగ్లాదేశ్, కెన్యా, టాంజానియా, టునీసియా, సిషెల్స్, గాంబియా, మాల్దీవులు, శ్రీలంక, ఆఫ్గనిస్థాన్, లావోస్, వియత్నాం, నేపాల్, భూటాన్, మయన్మార్, ఇథియోపియా, ఎరెట్రియా, కంబోడియా సహా 17 దేశాలకు చెందిన సివిల్ సర్వెంట్లకు శిక్షణను ఇచ్చింది. సామర్ధ్య నిర్మాణ కార్యక్రమాన్ని కోర్స్ కోఆర్డినేటర్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. ఎపి.సింగ్, అసోసియేట్ కోర్స్ కోఆర్డినేటర్ డా. ముకేష్ భండారీ, ఎన్‌సిజిజి బృందం పర్యవేక్షించనున్నారు.
***
(Release ID: 2009341)
Visitor Counter : 101