ఆయుష్
azadi ka amrit mahotsav

ఝజ్జర్ ,పూణేలో రెండు ‘ఆయుష్ ప్రాజెక్ట్’లను ప్రారంభించిన ప్రధానమంత్రి


హర్యానాలోని ఝజ్జర్‌లో 'సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా నేచురోపతి' ప్రారంభం

మహారాష్ట్రలోని పూణేలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి ‘నిసార్గ్ గ్రామ్’ ప్రారంభోత్సవం

Posted On: 25 FEB 2024 8:04PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు, ఆయుష్ మంత్రిత్వ శాఖ‌ నెలకొల్పిన రెండు సంస్థలను  ప్రారంభించారు.  దేశంలో సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ రెండు సంస్థలను నెలకొల్పింది. . హర్యానాలోని ఝజ్జర్‌లో 'సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతి' (CRIYN), మహారాష్ట్రలోని పూణేలో నిసర్గ్ గ్రామ్'  పేరుతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి (NIN) ను ఆయుష్ మంత్రిత్వ శాఖ నెలకొల్పింది. 

 “రోగనిరోధక శక్తిని, వ్యాధితో పోరాడే సామర్ద్యాన్నిపెంపొందించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.దీని కోసం  పౌష్టికాహారానికి పెద్దపీట వేస్తున్నాం. వ్యాధుల నివారణ అంశంలో కీలకంగా ఉండే యోగా, ఆయుర్వేదం, పరిశుభ్రత అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. సాంప్రదాయ భారతీయ వైద్య విధానాలు,ఆధునిక వైద్య విధానాలకు ప్రభుత్వం సమన ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సహిస్తోంది.  ఈరోజు, మహారాష్ట్ర , హర్యానాలో యోగా , నేచురోపతికి సంబంధించిన రెండు పెద్ద ఆసుపత్రులు , పరిశోధన కేంద్రాలు ప్రారంభమయ్యాయి.  సాంప్రదాయ వైద్యానికి సంబంధించిన డబ్ల్యూహెచ్‌ఓ కేంద్రం  గుజరాత్‌లో ఏర్పాటు అవుతుంది.  పేద, మధ్యతరగతి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి తక్కువ ఖర్చుతో  మెరుగైన వైద్యం అందేలా చూసేందుకు ప్రభుత్వం  ప్రయత్నిస్తోంది" అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రారంభ ఉపన్యాసంలో తెలిపారు. .

పశ్చిమ బెంగాల్‌లోని కళ్యాణి నుంచి కేంద్ర ఆయుష్ఓ,డరేవులు, షిప్పింగ్,జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ వర్చువల్ విహనంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, పశ్చిమ బెంగాల్‌లోని కళ్యాణి లో   ప్రధానమంత్రి ఎయిమ్స్‌ను ప్రారంభించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే ఈ కార్యక్రమంలో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. కేంద్ర ఆయుష్ మరియు మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్.ముంజ్‌పరా మహేంద్ర భాయ్ గుజరాత్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

'సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతి, ఝజ్జర్ (హర్యానా) కేంద్రం  ప్రారంభోత్సవ కార్యక్రమంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. దేవర్ఖానా గ్రామంలో ఈ సంస్థ ఏర్పాటు అయ్యింది.  ప్రధాని స్వయంగా  నేచురోపతి కేంద్రాన్ని ప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. .యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా ప్రధానమంత్రి కృషి చేసి విజయం సాధించారని అన్నారు.  భారతీయ సంప్రదాయ వైద్య విధానాల బలం ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరిస్తోందని ఆయన అన్నారు.

ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతి, ఝజ్జర్ (హర్యానా) ఏర్పాటు అయ్యింది.యోగా , నేచురోపతి రంగంలో పరిశోధన , విద్యా సౌకర్యాలు కేంద్రంలో లభిస్తాయి.  యోగా, నేచురోపతి ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. సంస్థలో  యోగా బ్లాక్ , డైట్ బ్లాక్ కాకుండా ఓపీడీ , ట్రీట్‌మెంట్ బ్లాక్, అకడమిక్ బ్లాక్, హాస్టల్ , రెసిడెన్షియల్ బ్లాక్‌లతో కూడిన 200 పడకల ఆసుపత్రి ఉంది. 63.88 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్రాన్ని అభివృద్ధి చేశారు.

నేచురోపతి లో  అండర్ గ్రాడ్యుయేట్ (UG)/పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG)/పారా మెడికల్ కోర్సులు అందించడానికి  ‘నిసార్గ్ గ్రామ్’ ద్వారా కృషి జరుగుతుంది.  ‘నిసార్గ్ గ్రామ్’ లో  నేచురోపతి మెడికల్ కాలేజీతో పాటు మల్టీ-డిసిప్లినరీ రీసెర్చ్ అండ్ ఎక్స్‌టెన్షన్ సర్వీస్ సెంటర్‌తో 250 పడకల ఆసుపత్రి. కళాశాల బాయ్స్, గర్ల్స్ హాస్టల్, ఆడిటోరియం, యోగా హాల్, కాటేజీలతో కూడిన రెసిడెన్షియల్, నాన్-రెసిడెన్షియల్ సౌకర్యాలు ఉన్నాయి.  ప్రసిద్ధ గాంధీ మెమోరియల్ హాల్ కూడా క్యాంపస్‌లో అంతర్భాగంగా ఉంది. 25 ఎకరాల విస్తీర్ణంలో 213.55 కోట్ల రూపాయల ఖర్చుతో  నిసార్గ్ గ్రామ్’ నిర్మాణం జరిగింది. 

పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి (NIN), ఝజ్జర్‌లోని దేవర్‌ఖానా విలేజ్‌లోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతి (CRIYN) ప్రారంభం కావడంతో సాంప్రదాయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ద్వారా సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ అందించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి మరింత పటిష్టంగా అమలు జరుగుతుంది. ఈ సంస్థలు అభివృద్ధి చెందుతున్న ఆరోగ్య సంరక్షణ సవాళ్లను నివారించడానికి, పరిష్కరించడానికి హైడ్రోథెరపీ, మసాజ్, క్లినికల్ న్యూట్రిషన్, యోగ థెరపీ వంటి విభిన్న విధానాలు వినియోగిస్తాయి. ముఖ్యంగా పెరుగుతున్న  నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (NCDలు) పై దృష్టి సారించి  అత్యాధునిక మౌలిక సదుపాయాలు, విద్యా కార్యక్రమాలతో ఈ రెండు సంస్థలు ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం కృషి సాగిస్తాయి. 


(Release ID: 2009022) Visitor Counter : 85