సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

బ్యాంకాక్‌లోని సనమ్ లుయాంగ్ పెవిలియన్‌ వద్ద బుద్ధ భగవానుడి పవిత్ర అస్థికలను దర్శించుకున్న దాదాపు లక్ష మంది భక్తులు

Posted On: 25 FEB 2024 10:08PM by PIB Hyderabad

గౌతమ బుద్ధ భగవానుడు, అతని ఇద్దరు శిష్యుల పవిత్ర శరీర అవశేషాలను దర్శించుకునేందుకు థాయ్‌లాండ్ ప్రజలు బ్యాంకాక్‌కు తరలివస్తున్నారు. బిహార్ గవర్నర్ శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, భారత కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత మంత్రి డా.వీరేంద్ర కుమార్ నేతృత్వంలోని 22 మంది సభ్యుల ప్రతినిధి బృందం ఆ అస్థికల పాత్రలను భారత్‌ నుంచి థాయ్‌లాండ్‌ తీసుకువెళ్లింది.

ఈ నెల 24న, మఖాబుచా (మాఘ పూజ) సందర్భంగా దాదాపు 1 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. సనమ్ లుయాంగ్ పెవిలియన్‌లోని పగోడా వద్ద ప్రతిష్టించిన బుద్ధ భగవానుడి పవిత్ర శరీర అవశేషాలను దర్శించుకున్నారు.

బుద్ధ భగవానుడు, అతని ఇద్దరు శిష్యులు అరహత సరిపుత్ర, అరహత మౌద్గల్యాయాన నాలుగు పవిత్ర ఎముకల అవశేషాలను 26 రోజుల ప్రదర్శన కోసం ఫిబ్రవరి 22న థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌కు తీసుకువెళ్లారు. బ్యాంకాక్‌లోని సనమ్ లుయాంగ్ పెవిలియన్‌లో ప్రత్యేకంగా నిర్మించిన పగోడాలో ప్రజల పూజల కోసం ఫిబ్రవరి 23న ప్రతిష్ఠించారు.

థాయిలాండ్‌లోని వివిధ ప్రాంతాల్లో బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాలను ఉంచుతారు, ప్రజలంతా పూజలు & ప్రార్థనలు చేసేందుకు వీలు కల్పిస్తారు:

సనమ్ లుయాంగ్ పెవిలియన్, బ్యాంకాక్: 22 ఫిబ్రవరి 2024 - 03 మార్చి 2024 (11 రోజులు)

హో కుమ్ లుయాంగ్, రాయల్ రుజాప్రూక్, చియాంగ్ మాయి: 04 మార్చి 2024 – 8 మార్చి 2024 (5 రోజులు)

వాట్ మహా వానరం, ఉబోన్ రట్చథని: 09 మార్చి 2024 - 13 మార్చి 2024 (5 రోజులు)

వాట్ మహాతట్, అలూయెక్, క్రాబీ: 14 మార్చి 2024 - 18 మార్చి 2024 (5 రోజులు)

థాయిలాండ్‌లో చారిత్రాత్మక & ఆధ్యాత్మిక ప్రదర్శనలు ముగిసిన తర్వాత, పవిత్ర శేషాలను 19 మార్చి 2024న థాయిలాండ్ నుంచి భారత్‌కు తిరిగి తీసుకొస్తారు.

***



(Release ID: 2009009) Visitor Counter : 90


Read this release in: English , Urdu , Hindi