కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
విమర్శ్ 2023: లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల కోసం 5జీ హ్యాకథాన్
- టీసీఓఈ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం - ఎస్ఆర్ఐ యూనిట్) సంస్థ ‘బీపీఆర్&డీ(ఎంహెచ్ఏ) సహకారంతో 5జీ యూజ్‌కేస్ డెమో ఫెసిలిటేషన్‌కు నాయకత్వం వ
- ఐఐటీ మద్రాస్‌లో డీఓటీ నిధులతో ఏర్పాటు చేసిన 5జీ టెస్ట్ బెడ్ సైట్ వేదికగా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలపై దృష్టి సారించిన స్టార్ట్-అప్‌లు & సంస్థలు 5జీ యూజ్ కేస్ పీఓసీల ప్రదర్శన
- జాతీయ 5G హ్యాకథాన్, విమర్శ్ 2023, ఐఐటీ మద్రాస్‌లో 5జీ టెస్ట్‌బెడ్ ప్రదర్శనలతో చివరి దశకు చేరిక
Posted On:
24 FEB 2024 5:11PM by PIB Hyderabad
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ), బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్&డీ), హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) సహకారంతో ఎస్ఆర్ఐ యూనిట్ యొక్క టెలికాం సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (టీసీఓఈ) ఇండియా విమర్శ్ 2023 5జీ హ్యాకథాన్ను నిర్వహించింది. హ్యాకథాన్ క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం మరియు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల కోసం వినూత్న పరిష్కారాలను అన్వేషించడం మరియు వారు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్వహించడం జరిగింది. 2024 ఫిబ్రవరి 21 మరియు 22 తేదీల్లో నిర్వహించబడిన మూడో మరియు చివరి దశ స్క్రీనింగ్‌లో భాగంగా, 23 స్టార్టప్‌లు ఇన్‌స్టిట్యూట్‌లలో 22 యూజ్ కేస్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్‌లను (PoC) సమర్పించాయి. డీఓటీ-ఫండెడ్ ఐఐటీ మద్రాస్ 5జీ టెస్ట్‌బెడ్‌లో వీటిని సమర్పించారు. గౌరవనీయమైన జ్యూరీ సభ్యుల సమక్షంలో ప్రదర్శనలు జరిగాయి.
గోవాకు చెందిన నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీ, సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్- జైపూర్, ఐఐటీ- పట్నా, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14C), ఐఐటీ -జోధ్‌పూర్, ఐఐటీ- ఢిల్లీ, సెక్యూరిటీ అస్యూరెన్స్, ఐఐటీఎం, స్టాండర్డ్స్-ఆర్&డీ-ఇన్నోవేషన్, టీఎస్డీఎస్ఐ మెంబర్‌షిప్‌ల డెవలప్‌మెంట్ & స్టార్ట్-అప్‌ల స్ట్రాటెజీ, నేషనల్ సైబర్ క్రైమ్ రీసెర్చ్ & ఇన్నోవేషన్ సెంటర్ (ఎన్సీఆర్&ఐసీ), సైబర్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, బీపీఆర్&డీ మరియు డీఓటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుండి విశిష్ట జ్యూరీ సభ్యులు ఈ హాకథాన్కు ఎంపికయ్యారు. ఆటోమేటెడ్ డ్రోన్‌ల భౌతిక ప్రదర్శన, ఏఆర్/వీఆర్, నిఘా & పరిశోధన, సాక్ష్యాధారాల సేకరణ, అత్యవసర ప్రతిస్పందన, ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, 5జీ మెటాడేటా విశ్లేషణ, జియో ఫెన్సింగ్, ఏఐ ఆధారిత ఎఫ్‌ఐఆర్ దాఖలు మొదలైన వాటికి సంబంధించిన కేసులను ఉపయోగించడాన్ని జ్యూరీ పరశీలించింది. మరిన్ని వివరాలు విమర్శ్ 2023 5జీ హ్యాకథాన్ 2023 (టీసీఓఈ.ఇన్)లో అందుబాటులో ఉన్నాయి. డ్రోన్ ఆధారిత నిఘా భద్రత మరియు సాధారణ భద్రత, ఏఐ సహాయక ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయడం, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్‌కు జియోఫెన్సింగ్ సొల్యూషన్, క్రైమ్ సీన్ రిక్రియేషన్ ద్వారా ఏఆర్ ఆధారిత శిక్షణ మరియు ప్రిడిక్టివ్ పోలీసింగ్ కోసం ఏఐ ఆధారిత డేటా అనలిటిక్స్ & డేటా ప్రాసెసింగ్ యాప్ మొదలైనవి ప్రభావవంతమైన పరిష్కారాలలో నిలిచాయి.
***
(Release ID: 2008940)
Visitor Counter : 120