ఆయుష్
రేపు పూణె, ఝజ్జర్‌లో ఆయుష్ ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
మహారాష్ట్ర, పూణెలో రూ. 213.55 కోట్ల వ్యయంతో నిర్మించిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి, నిసర్గ్ గ్రామ్ ప్రారంభం
హర్యానా, ఝజ్జర్‌లో రూ. 63.88 కోట్ల వ్యయంతో సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగ & నేచురోపతి ప్రారంభం
Posted On:
24 FEB 2024 6:01PM by PIB Hyderabad
తన గుజరాత్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఫిబ్రవరి 25న ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన రెండు సంస్థలను కూడా ప్రారంభించనున్నారు. ఇవి దేశంలో సంపూర్ణ ఆరోగ్య సంక్షేమ పరిదృశ్యాన్ని మరింత ప్రోత్సహించనున్నాయి. ప్రధానమంత్రి 25 ఫిబ్రవరి 2024న దృశ్యమాధ్యమం ద్వారా మహారాష్ట్ర, పూణెలోని నిసర్గ్ గ్రామ్ పేరు కలిగిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి (ఎన్ఐఎన్)ని, హర్యానాలోని ఝజ్జర్‌లో సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగ& నాచురోపతి (సిఆర్ఐవైఎన్)ను ప్రారంబించి, దేశానికి అంకితం చేయనున్నారు.
నిసర్గ - ఎన్ఐఎన్ పూణె
నిసర్గ్ గ్రామ్ అన్నదిఅండర్ గ్రాడ్యుయేట్ (యుజి) పోస్ట్ గ్రాడ్యుయేట్ (పిజి) / పారా మెడికల్ కోర్సులను అందించే నేచురోపతి వైద్య కళాశాలతో పాటు బహుశాస్త్ర సంబంధిత పరిశోధన, విస్తరణ సేవల కేంద్రం కలిగిన 250 పడకల ఆసుపత్రి. కళాశాలకు యువతీ, యువకుల హాస్టళ్ళు కలిగి రెసిడెన్షియల్ & నాన్- రెసిడెన్షియల్ సౌకర్యాల, ఆడిటోరియం, యోగా హాల్, కాటేజీలు, ప్రముఖ గాంధీ స్మారక హాల్ కూడా క్యాంపస్‌లో భాగంగా ఉంటాయి. దాదాపు 25 ఎకరాల ప్రాజెక్టు మొత్తం విలువ రూ. 213. 55 కోట్లు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ హర్యానా ఝజ్జర్‌లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగ & నేచురోపతిని కూడా ప్రారంభిస్తారు. ఇది అగ్ర స్థాయి యోగ, నేచురోపతి పరిశోధన, విద్యా కేంద్రం. ఈ ప్రాజెక్టు ద్వారా తృతీయ స్థాయి యోగ, నేచురోపతి ఆరోగ్య సంరక్షణ మౌలికసదుపాయాలను సృష్టించనున్నారు. ఈ సంస్థలోయోగా బ్లాక్, డైట్ బ్లాక్ మాత్రమే కాక ఒపిడి, చికిత్స బ్లాక్, అకడమిక్ బ్లాక్, హాస్టల్, రెసిడెన్షియల్ బ్లాక్ సహా 200 పడకల ఆసుపత్రి ఉంటుంది. దాదాపు 19 ఎకరాల ప్రాజెక్టును రూ. 63.88 కోట్ల వ్యయంతో నిర్మించారు.
సంప్రదాయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి (ఎన్ఐఎన్) & ఝజ్జార్‌లోని దేవెర్‌ఖానా గ్రామంలోని సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగ అండ్ నేచురోపతి (సిఆర్ఐవైఎన్)లు ప్రముఖ మైలురాళ్ళకు ప్రాతినిధ్యం వహిస్తాయి.
ఈ సంస్థలు అభివృద్ధి చెందుతున్న ఆరోగ్య సంరక్షణ సవాళ్ళను , ముఖ్యంగా పెరుగుతున్న సాం్రకమికం కాని వ్యాధులు ప్రబలంగా పెరుగుతున్న క్రమంలో వాటిని పరిష్కరించేందుకు, నివారించేందుకు హైడ్రోథెరపీ (జల/ ద్రవ చికిత్స), మసాజ్, చికిత్పా పంబంధ పౌష్టికాహారం, యోగా థెరపీ వంటి విభిన్న విధానాలు వినియోగిస్తాయి. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, విద్యా కార్యక్రమాలతో ఈ సంస్థలు తమ ఆరోగ్యాన్ని, సంక్షేమానికి వ్యక్తులు ప్రాధాన్యత ఇచ్చేందుకు తోడ్పడతాయి.
***
(Release ID: 2008934)
Visitor Counter : 102