ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మూడు రోజుల భారత జాతీయ ప్రజారోగ్య సదస్సును కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి, ప్రొఫెసర్. ఎస్ పీ సింగ్ బఘేల్ ప్రారంభించారు.


ఆరోగ్యకరమైన ప్రజలు మరింత ఉత్పాదకతను కలిగి ఉండటమే కాకుండా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు మరింత దృఢంగా ఉంటారు. అందువల్ల మన అభివృద్ధి ఎజెండాలో ఆరోగ్యానికి ప్రధాన అంశంగా ప్రాధాన్యత ఇవ్వడం అత్యవసరం: ప్రొ. బాఘెల్

కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి మహమ్మారి సమయంలో ఎన్ సీ డీ సీ ఒక యోధుడిలా పోరాడింది: డాక్టర్ వి కే పాల్

Posted On: 23 FEB 2024 4:26PM by PIB Hyderabad

మొదటి భారత జాతీయ ప్రజారోగ్య  సదస్సు (ఎన్ పి హెచ్ ఐ కాన్ 2024)ని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రొ.ఎస్.పి.సింగ్ బఘెల్  నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీ కే పాల్ సమక్షంలో ఈరోజు ఇక్కడ ప్రారంభించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్ సీ డీ సీ)  2024 ఫిబ్రవరి 23 నుండి 25 వరకు ఈ మూడు రోజుల సుదీర్ఘ సమావేశం నిర్వహిస్తుంది.

 

ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎస్ పి సింగ్ బఘెల్ మాట్లాడుతూ, ప్రజారోగ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మరియు వికసిత్ భారత్ కోసం గౌరవ ప్రధానమంత్రి దృష్టికి అనుగుణంగా విధానాలను రూపొందించడంలో సదస్సు యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. దృఢమైన ఆరోగ్య విధానాలు మరియు జోక్యాల అభివృద్ధికి దోహదపడే ఈ కీలక కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఎన్ సీ డీ సీ నాయకత్వ  అంకితభావాన్ని మంత్రి ప్రశంసించారు.

 

ప్రొ. బాఘెల్ మాట్లాడుతూ, “భారతదేశ అభివృద్ధికి సంబంధించి మా దృష్టిలో ఆరోగ్యం అనేది కేవలం వ్యాధులు లేకపోవడమే కాదు, ప్రాథమిక మానవ హక్కు మరియు స్థిరమైన అభివృద్ధికి మూలస్తంభం అని గుర్తించడం ప్రధానమైనది. ఆరోగ్యకరమైన జనాభా మరింత ఉత్పాదకతను కలిగి ఉండటమే కాకుండా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు మరింత దృఢంగా ఉంటారు. అందువల్ల మన అభివృద్ధి ఎజెండాలో ఆరోగ్యానికి కేంద్ర సిద్ధాంతంగా ప్రాధాన్యతనివ్వడం అత్యవసరం”.

 

అధిక జనాభా, వేగవంతమైన పట్టణీకరణ మరియు పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ అవసరాలతో, సవాళ్లు అపారంగా ఉన్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ, ఈ సవాళ్ల మధ్య అందరికి ఆరోగ్యకరమైన మరియు మరింత సంపన్నమైన భవిష్యత్తును ఆవిష్కరించడానికి, సహకరించడానికి మరియు మార్గం సుగమం చేయడానికి ప్రత్యేకమైన అవకాశాలు ఉన్నాయి.

 

దేశంలోని ప్రజారోగ్య సమస్యలు మరియు సంబంధిత అనుబంధ ఆరోగ్య పద్ధతులపై అనుభవాలు మరియు ఉత్తమ అభ్యాసాలను పరస్పరం మార్పిడి చేసుకోవడానికి ఈ సమావేశం ఒక ఉమ్మడి వేదికను అందిస్తుంది.

 

మహమ్మారి సమయంలో కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు అవిశ్రాంతంగా పనిచేసినందుకు ఎన్‌సిడిసిని డాక్టర్ వి.కె. పాల్ ప్రశంసించారు. ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడానికి భారతదేశం తన బలమైన ఆరోగ్య కేంద్రాల నెట్‌వర్క్‌పై ఆధారపడవలసి ఉందని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఆరోగ్య అత్యవసర పరిస్థితులను సులభంగా పరిష్కరించేందుకు పరిశోధనలకు ఉత్తమ పద్దతులను అనుసరించాలని ఆయన పరిశోధకులను కోరారు.

 

కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అపూర్వ చంద్ర, స్థానిక స్థాయిలో అనుభవాలు మరియు ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడానికి ఫోరమ్‌ను అందించడంలో ఎన్ పి హెచ్ ఐ కాన్ 2024  ప్రాముఖ్యతను తన సందేశం లో అందించారు. ప్రజారోగ్య అభివృద్ధి కోసం విధాన అభివృద్ధి మరియు జోక్యాలకు మద్దతు ఇవ్వడంలో సదస్సు పాత్రను ఆయన నొక్కి చెప్పారు. విజయవంతమైన మరియు ప్రభావవంతమైన ఈ సమావేశం  లో పాల్గొనే ప్రతినిధులకు ఎన్ సీ డీ సీ కి తన శుభాకాంక్షలు అందజేశారు.

 

ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్. అతుల్ గోయెల్, ఎన్ పి హెచ్ ఐ కాన్ 2024 ను నిర్వహించడంతోపాటు జాతీయ నిపుణులు, ప్రోగ్రామ్ అమలు చేసేవారు మరియు విద్యార్థులను ఒకచోట చేర్చినందుకు ఎన్ సీ డీ సీ ని అభినందించారు.  వినూత్న పరిష్కారాలను ప్రోత్సహించడం మరియు సుద్రుడమైన  ఆరోగ్యకరమైన దేశాన్ని నిర్మించే పెద్ద లక్ష్యానికి దోహదం చేయడం లో కాన్ఫరెన్స్ యొక్క సహకార స్వభావాన్ని డాక్టర్ గోయెల్  నొక్కిచెప్పారు,

 

భారతదేశం డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి డాక్టర్ రోడెరికో హెచ్. ఆఫ్రిన్, మాట్లాడుతూ వైద్యపరమైన నివారణలు, నిరోధనలు, ప్రపంచ ఆరోగ్య భద్రత సంసిద్ధత మరియు ప్రతిస్పందన మరియు డిజిటల్ ఆరోగ్యానికి ప్రాప్యత కోసం ప్రోగ్రామ్‌లు మరియు వనరులను విస్తరించడంలో భారతదేశం ప్రపంచ అగ్రగామిగా అవతరించే అవకాశం ఉందని ఉద్ఘాటించారు. "ప్రజారోగ్య రంగంలో అత్యుత్తమ పద్ధతులు మరియు కార్యక్రమాలను హైలైట్ చేయడం మరియు ప్రదర్శించడం చాలా కీలకం" అని ఆయన పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా, పునరుద్ధరించబడిన ఎన్ సీ డీ సీ వెబ్‌సైట్, ఎన్ సీ డీ సీ యొక్క కొత్త E

ఈ-జర్నల్, ఎపి - డీస్ - ఫెరే (Epi-Dis-Phere) ప్రజారోగ్య సుదృడత మరియు ఎన్ సీ డీ సీ లో చేయవలసిన ప్రెజెంటేషన్‌ల వాచక మరియు పోస్టర్ సారాంశాలతో కూడిన ఈ -టెక్నో-డాక్ కూడా ప్రారంభించబడింది.

 

నేపథ్య సమాచారం 

 

నేషనల్ పబ్లిక్ హెల్త్ ఇండియా కాన్ఫరెన్స్ అనేది ఆరోగ్య నిపుణుల కోసం అనుభవాలు మరియు ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడానికి  సహకార అభ్యాస వేదికను రూపొందించే లక్ష్యంతో జాతీయ స్థాయి చొరవ. సమర్థవంతమైన ప్రజారోగ్య కార్యక్రమ నిర్వహణకు దోహదపడే ఆరోగ్య విధాన రూపకర్తలు మరియు అమలుదారుల అంతర్దృష్టులపై సమావేశం దృష్టి సారిస్తుంది. జంతు ఆధార వ్యాధులు, యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్, పర్యావరణం మరియు వాతావరణ మార్పుల ఎన్ సీ డీ లు, క్షయవ్యాధి వంటి అంశాలతో సహా సమిష్టి ఆరోగ్యం కోసం సహకారాన్ని నొక్కిచెప్పడం,  మరియు మౌలిక సదుపాయాల బలోపేతం వంటి ఆరోగ్య ప్రాధాన్యతలను పరిష్కరించడంలో ఇది వినూత్న విధానాలను హైలైట్ చేస్తుంది. ఈ సదస్సు ప్రజారోగ్య పర్యవేక్షణ లో సమగ్ర ఆరోగ్య సమాచార వేదిక, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ వంటి అధునాతన సాధనాలు మరియు సాంకేతికతలను అన్వేషిస్తుంది.

 

భారతదేశంలో ఇటీవలి ప్రజారోగ్య కార్యక్రమాలపై దృష్టి సారించే  ఏడు శాస్త్రీయ సెషన్‌లు ఉంటాయి; పబ్లిక్ ప్రజారోగ్య పర్యవేక్షణ మరియు ప్రతిస్పందన కోసం అధునాతన పరికరాలు & సాంకేతికతలు , సమిష్టి సమగ్ర ఆరోగ్యం; వ్యాధి నిర్మూలన; భారతదేశంలో అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల అమలు; పరిశోధనలో సమగ్రత మరియు నైతికత మరియు వైద్య విద్యలో ప్రస్తుత పాఠ్యాంశాలు భారతదేశంలో ప్రజారోగ్య అమలుకు - అడ్డంకులు మరియు అవకాశాలు వంటి శాస్త్రీయ సెషన్‌లు ఉంటాయి.

 

దేశంలోని వివిధ స్థాయిలలో ఎన్‌సిడిలు, క్షయవ్యాధి మరియు ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం మరియు ఆరోగ్య మెరుగుదల కోసం ఆకాంక్షించే బ్లాక్‌లు వంటి ఇటీవలి ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడంలో వినూత్న విధానాలు మరియు ప్రయత్నాలను ఈ సమావేశం హైలైట్ చేస్తుంది. జంతు ఆధార వ్యాధులు, యాంటీ-మైక్రోబయల్ రెసిస్టెన్స్, పర్యావరణం మరియు వాతావరణ మార్పులకు ప్రత్యేక సూచనతో ఒక ఆరోగ్యం పట్ల బహుళ రంగాల విధానాలకు సహకరించే మార్గాలను కూడా ఇది హైలైట్ చేస్తుంది. పరిశోధనలో నైతికతకు సంబంధించిన అంతర్దృష్టులు, భారీ డేటా నిర్వహణలో సరికొత్త అధునాతన పరికరాలు మరియు సాంకేతికతల అన్వయం మరియు దాని విశ్లేషణ ముఖ్యంగా సంక్షోభ సమయంలో శాస్త్రీయత ఆధారిత ఆరోగ్య విధాన  జోక్యాల కోసం ఈ రంగాల ఔచిత్యాన్ని ఆవిష్కరించాయి.

 

వైద్య మరియు ప్రజారోగ్య నిపుణుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ప్రజారోగ్యానికి ప్రస్తుత వైద్య కరికులమ్ అప్లికేషన్‌లోని అడ్డంకులు మరియు అవకాశాలపై నిపుణులు  చర్చిస్తారు. భారతదేశంలోని 30 రాష్ట్రాలు మరియు యూ టీ లకు చెందిన ప్రజారోగ్య నిపుణులు 100 కంటే ఎక్కువ మౌఖిక మరియు పోస్టర్ ప్రదర్శనలు చేస్తారు.

 

శ్రీమతి ఎల్ ఎస్ చాంగ్సన్, అదనపు కార్యదర్శి & మిషన్ డైరెక్టర్ (ఎన్ హెచ్ ఎం), ఆరోగ్య మంత్రిత్వ శాఖ; ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, రాష్ట్ర ప్రజారోగ్య కార్యక్రమాల ప్రతినిధులు, నిపుణులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులు మరియు ముఖ్య వాటాదారులు పాల్గొన్నారు.

 

***


(Release ID: 2008743) Visitor Counter : 186


Read this release in: English , Urdu , Hindi , Tamil