రక్షణ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో సమావేశమైన సందర్భంగా ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించడంపై చర్చించిన రక్షణమంత్రి & నెదర్లాండ్స్ రక్షణ మంత్రి
హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర భద్రతను పెంచేందుకు కలిసి పని చేయనున్న రెండు దేశాలు
భారతీయ విక్రయదారులను తమ సరఫరా లంకెలో కలుపుకునేలా డచ్ ఒరిజనల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులను ప్రోత్సహించవచ్చు ః శ్రీ రాజ్‌నాథ్ సింగ్
Posted On:
23 FEB 2024 12:17PM by PIB Hyderabad
కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ నెదర్లాండ్స్ రక్షణ మంత్రి మిస్ కజ్సా ఒల్లొగ్రెన్‌తో ఫిబ్రవరి 23, 2024న న్యూఢిల్లీలో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు.
ముఖ్యంగా సముద్రతీర, పారిశ్రామిక రంగాలలో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని విస్తరింప చేసుకునే అవకాశాలపై మంత్రులిద్దరూ చర్చించారు. ఇరు నావికాదళాల మధ్య పెరిగిన పరస్పర్ చర్యను గుర్తిస్తూ, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర భద్రతను పెంచేందుకు కలిసి పని చేసేందుకు ఆసక్తిని వ్యక్తం చేశారు.
తమ సరఫరా లంకెలలోకి భారతీయ విక్రయదారులను కలుపుకోవడాన్ని డచ్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులను ప్రోత్సహించవచ్చని రక్షణమంత్రి సూచించారు. భారత్ సజీవమైన ఆవిష్కరణను, పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసింది. సాంకేతికతలు, నైపుణ్యాల, పరిమాణంలో భారత్, డచ్ పరిపూరకత నేపథ్యంలో రక్షణ పరిశ్రమలు, సెమీ కండక్టర్లు, క్లీన్ ఎనర్జీ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాలలో మరింత పరస్పర చర్యను ప్రోత్సహించేందుకు ఇరు పక్షాలూ అంగీకరించాయి.
నెదర్లాండ్స్ రక్షణ మంత్రి న్యూఢిల్లీలోని రెయిజీనా డైలాగ్‌లో పాలుపంచుకుంటున్నారు.
న్యూఢిల్లీలో సమావేశమైన సందర్భంగా ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించడంపై చర్చించిన రక్షణమంత్రి & నెదర్లాండ్స్ రక్షణ మంత్రి
హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర భద్రతను పెంచేందుకు కలిసి పని చేయనున్న రెండు దేశాలు
భారతీయ విక్రయదారులను తమ సరఫరా లంకెలో కలుపుకునేలా డచ్ ఒరిజనల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులను ప్రోత్సహించవచ్చు ః శ్రీ రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23(పిఐబి)ః కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ నెదర్లాండ్స్ రక్షణ మంత్రి మిస్ కజ్సా ఒల్లొగ్రెన్‌తో ఫిబ్రవరి 23, 2024న న్యూఢిల్లీలో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు.
ముఖ్యంగా సముద్రతీర, పారిశ్రామిక రంగాలలో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని విస్తరింప చేసుకునే అవకాశాలపై మంత్రులిద్దరూ చర్చించారు. ఇరు నావికాదళాల మధ్య పెరిగిన పరస్పర్ చర్యను గుర్తిస్తూ, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర భద్రతను పెంచేందుకు కలిసి పని చేసేందుకు ఆసక్తిని వ్యక్తం చేశారు.
తమ సరఫరా లంకెలలోకి భారతీయ విక్రయదారులను కలుపుకోవడాన్ని డచ్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులను ప్రోత్సహించవచ్చని రక్షణమంత్రి సూచించారు. భారత్ సజీవమైన ఆవిష్కరణను, పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసింది. సాంకేతికతలు, నైపుణ్యాల, పరిమాణంలో భారత్, డచ్ పరిపూరకత నేపథ్యంలో రక్షణ పరిశ్రమలు, సెమీ కండక్టర్లు, క్లీన్ ఎనర్జీ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాలలో మరింత పరస్పర చర్యను ప్రోత్సహించేందుకు ఇరు పక్షాలూ అంగీకరించాయి.
నెదర్లాండ్స్ రక్షణ మంత్రి న్యూఢిల్లీలోని రెయిజీనా డైలాగ్‌లో పాలుపంచుకుంటున్నారు.
***
(Release ID: 2008433)
Visitor Counter : 177