ఆర్థిక మంత్రిత్వ శాఖ

కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన న్యూఢిల్లీలో ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి (ఎఫ్ ఎస్ డి సి) 28వ సమావేశం


సమ్మిళిత ఆర్థిక వృద్ధికి తోడ్పడటానికి ఆర్థిక రంగంలో అంతర్-నియంత్రణ సమన్వయాన్ని బలోపేతం చేయడంపై ఎఫ్ ఎస్ డి సి సభ్యుల దృష్టి

దేశీయ ,అంతర్జాతీయ స్థూల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక స్థిరత్వ ప్రమాదాలను గుర్తించే దిశగా నిరంతర నిఘా, క్రియాశీల ప్రయత్నాలకు ఎఫ్ ఎస్ డిసి ప్రాధాన్యం

ఆర్థిక రంగంలో కె వై సి ప్రక్రియను సరళతరం చేయడానికి, డిజిటలైజ్ చేయడానికి కౌన్సిల్ వ్యూహాన్ని రూపొందించనున్న కౌన్సిల్; సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా సామాజిక సంస్థల ద్వారా నిధుల సమీకరణ

ప్రారంభించడం; మరియు ఆన్ లైన్ యాప్ ల ద్వారా అనధికారిక రుణాల వ్యాప్తిని నిరోధించడానికి మరిన్ని చర్యలు

Posted On: 21 FEB 2024 4:30PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి (ఎఫ్ ఎస్ డిసి) 28వ సమావేశం ఈ రోజు న్యూఢిల్లీలో జరిగింది.

స్థూల ఆర్థిక స్థిరత్వం, వాటిని ఎదుర్కొనేందుకు భారత్ సన్నద్ధత తదితర అంశాలపై ఎఫ్ ఎస్ డి సి చర్చించింది. ప్రపంచంలోని ప్రధాన అంతర్జాతీయ ఆర్థిక కేంద్రాలలో ఒకటిగా ఎదగడానికి , దేశీయ ఆర్థిక వ్యవస్థకు విదేశీ మూలధనం, ఆర్థిక సేవలను సులభతరం చేయడంలో ప్రపంచంలోని ప్రధాన అంతర్జాతీయ ఆర్థిక కేంద్రాలలో ఒకటిగా జి ఐ ఎఫ్ టి  ఐ ఎఫ్ ఎస్ సి వ్యూహాత్మక పాత్రకు మద్దతు ఇవ్వడానికి ప్రస్తుతం ఉన్న ఇంటర్ - రెగ్యులేటరీ సమస్యలపై  కూడా చర్చించారు.

ఎఫ్ ఎస్ డి సి డlనిర్ణయాలు, కేంద్ర బడ్జెట్ ప్రకటనల అమలుకు వ్యూహరచనకు సంబంధించిన వివిధ అంశాలపై కూడా ఎఫ్ ఎస్ డీసీ చర్చించింది. వీటిలో, ఇవి ఉన్నాయి:

  • ఏకరీతి కెవైసి  నిబంధనలను నిర్దేశించడం, ఆర్థిక రంగం అంతర్ వినియోగం, కెవైసి ప్రక్రియను సరళీకరించడం, డిజిటలైజేషన్ చేయడం;
  •  సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా సామాజిక సంస్థల నిధుల సమీకరణను ప్రారంభించడం;
  • ఆన్ లైన్ యాప్ ల ద్వారా అనధికారిక రుణాల వల్ల కలిగే దుష్ప్రభావాలను నిరోధించడం, అవి మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడం.

దేశీయ అంతర్జాతీయ స్థూల ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఎఫ్ ఎస్ డి సి సభ్యులు నిరంతర నిఘాను కొనసాగించాల్సిన అవసరం ఉందని , అభివృద్ధి చెందుతున్న ఆర్థిక స్థిరత్వ ప్రమాదాలను గుర్తించడానికి,  ఆర్థిక రంగం  స్థితిస్థాపకతను నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి వారి క్రియాశీల ప్రయత్నాలను కొనసాగించాలని స్పష్టం చేసింది. సమ్మిళిత ఆర్థిక వృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులను అందించేలా ఆర్థిక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఇంటర్ రెగ్యులేటరీ సమన్వయాన్ని బలోపేతం చేయాలని ఎఫ్ ఎస్  డి సి సభ్యులు నిర్ణయించారు.

ఆర్ బి ఐ గవర్నర్ అధ్యక్షతన ఎఫ్ ఎస్ డి సి సబ్ కమిటీ చేపట్టిన కార్యక్రమాలు, ఎఫ్ ఎస్ డి సి  గత నిర్ణయాలపై సభ్యులు తీసుకున్న చర్యలను కూడా ఎఫ్ ఎస్ డి సి పరిగణనలోకి తీసుకుంది.

ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్ రావు కరాడ్; - రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) గవర్నర్ శక్తికాంతదాస్;    ఆర్థిక కార్యదర్శి,   ఆర్థిక కార్యదర్శి, ఆర్థిక మంత్రిత్వ శాఖ (ఎం ఒ ఎఫ్) వ్యయ విభాగం కార్యదర్శి డాక్టర్ టి.వి.   సోమనాథన్; ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి, ఎం ఒ ఎఫ్ , అజయ్ సేథ్, ఆర్థిక సేవల విభాగం ఎం ఒ ఎఫ్  కార్యదర్శి డాక్టర్ వివేక్ జోషి; రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎం ఒ ఎఫ్ శ్రీ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా; కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసిఎ) కార్యదర్శి డాక్టర్ మనోజ్ గోవిల్ ; ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ ; కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ వి.అనంత నాగేశ్వరన్;  సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఛైర్ పర్సన్ శ్రీమతి మాధాబి పూరి బుచ్; ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్ పర్సన్ శ్రీ దేబశిష్ పాండా; డాక్టర్ దీపక్ మొహంతి,పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ డాక్టర్ దీపక్ మొహంతి; ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ శ్రీ రవి మిట్టల్; ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ చైర్మన్, ఎఫ్ ఎస్ డి సి ఆర్థిక వ్యవహారాల విభాగం, ఎం ఒఎఫ్  కార్యదర్శి, కె. రాజారామన్  ఈ సమావేశానికి హాజరయ్యారు.

***



(Release ID: 2007864) Visitor Counter : 97