పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
మానవ -జంతు సంఘర్షనను నివారించేందుకు అప్రమత్తతతో సాంకేతిక వినియోగం, జంతువుల పట్ల సానుభూతితో కూడిన వైఖరి అవసరమని శ్రీ భూపేందర్ యాదవ్
Posted On:
21 FEB 2024 3:19PM by PIB Hyderabad
వన్యప్రాణుల పట్ల సానుభూతితో కూడిన విధానంతో పాటు అప్రమత్తంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా కొనసాగుతున్న మానవ- జంతు సంఘర్షణను పరిష్కరించవచ్చని కేంద్ర పర్యావరణం, అడవులు, పర్యావరణ మార్పు మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు.
బుధవారం ఉదయం బెంగళూరులు, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, జంతు- మానవ సంఘర్షణ కొనసాగుతోందని తమ దృష్టికి వచ్చిందని, ముఖ్యంగా వాయ్‌నాడు, బందీపూర్- వాయ్‌నాడు సరిహద్దు ప్రాంతాలలో ఇది ఎక్కువగా ఉన్నట్టు తెలిసిందని శ్రీ యాదవ్ అన్నారు.
కొనసాగుతున్న మానవ- జంతు సంఘర్షణను పరిష్కరించేందుకు, మనం ఎంతో అప్రమత్తంగా సాంకేతికతను ఉపయోగించడంతో పాటు జంతువుల పట్ల సానుభూతితో కూడిన విధానాన్ని అనుసరించాలని అన్నారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం సలహా సూచనలను జారీ చేస్తోందని కేంద్ర మంత్రి చెప్పారు.
పరిస్థితి అత్యంత గంభీరంగా ఉందని పేర్కొంటూ, ప్రస్తుత పరిస్థితి గురించి మంత్రిత్వశాఖ అధికారులు తనకు తెలియపరిచారని శ్రీ యాదవ్ అన్నారు. ఈ విషయంపై చర్చించేందుకు తాను డబ్ల్యుఐఐ నుంచి సీనియర్ శాస్త్రవేత్తలను, మంత్రిత్వ శాఖ అధికారులు, రాష్ట్ర అధికారులను సంప్రదించానని, తాము చూసుకుంటామని శ్రీ యాదవ్ తెలిపారు.
బాధితులను కలుసుకుని, కేంద్ర ప్రభుత్వం అందించే నష్టపరిహారం బాధితులకు సానుకూలంగా చేరేందుకు చర్యలు తీసుకుంటానని కేంద్ర మంత్రి అన్నారు.
***
(Release ID: 2007758)
Visitor Counter : 164