ఆయుష్
రేపటి నుంచి ప్రారంభం కానున్న ఆయుర్వేద విధానాలతో 20,000 మంది గిరిజన విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సంరక్షణ అందించడానికి రూపొందించిన జాతీయ కార్యక్రమం
प्रविष्टि तिथि:
20 FEB 2024 5:04PM by PIB Hyderabad
ఆయుర్వేద విధానాలతో 20,000 మంది గిరిజన విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సంరక్షణ అందించడానికి రూపొందించిన జాతీయ కార్యక్రమాన్ని కేంద్ర ఆయుష్, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ రేపు ప్రారంభిస్తారు. ఢిల్లీలో జరిగే ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాలు, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముందా కూడా పాల్గొంటారు.గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం కార్యక్రమాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ , ఐసిఎంఆర్-ఎన్ఐఆర్టిహెచ్ జబల్పూర్ సహకారంతో ఆయుష్ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న సిసిఆర్ఏఎస్ అమలు చేస్తుంది.
ఆరు నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న గిరిజన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించడానికి ప్రాజెక్టు రూపొందింది. దేశంలో 14 రాష్ట్రాలలో ఎంపిక చేసిన 55 ఏకలవ్య ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరీక్షల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. రక్తహీనత, వారసత్వంగా సంక్రమించే వ్యాధులు, పౌష్టిక ఆహార లోపం, క్షయ వ్యాధి నిర్ధారణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు.విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ కోసం ఆయర్వేద విధానాల ద్వారా వారి జీవన శైలిలో మార్పు తీసుకు రావడానికి ప్రాజెక్టు ద్వారా కృషి జరుగుతుంది. వ్యాధి గుర్తింపు, నివారణ కోసం సమగ్ర విధానం అమలు జరుగుతుంది.
కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ స్టడీస్( సిసిఆర్ఏఎస్)కి చెందిన 16 ప్రాంతీయ కేంద్రాల్లో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ , ఐసిఎంఆర్-ఎన్ఐఆర్టిహెచ్ జబల్పూర్ ద్వారా ప్రాజెక్టు అమలు జరుగుతుంది.
గిరిజన అభివృద్ధి, సంక్షేమం కోసం కలిసి పని చేయడానికి ఉన్న అవకాశాలను గుర్తించడానికి 2022 అక్టోబర్ నెలలో గిరిజన మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఒప్పందంలో భాగంగా 20 రాష్ట్రాల్లో ఉన్న ఏకలవ్య ఆశ్రమ పాఠశాలలో 72 పోషణ వాటికలు నెలకొల్పినది. ఝార్ఖండ్ సరికేలా లో నిర్వహించిన భారీ ఆరోగ్య కేంద్రంలో సిసిఆర్ఏఎస్ పాల్గొంది.
దేశానికి స్వాతంత్ర్యం సాధించి ఏడు దశాబ్దాలు పూరి అయినప్పటికీ దేశంలో గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య రంగం ఆందోళన కలిగించే విధంగా ఉంది. ఆరోగ్య రంగం అభివృద్ధికి చర్యలు జరిగినప్పటికీ గిరిజనులకు పూర్తి స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులోకి రాలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో గిరిజనుల జనాభా 10.43 కోట్ల వరకు ఉంది. వీరిలో 89.97% మంది గ్రామీణ ప్రాంతాలు, 10.03% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దేశ జనాభాలో గిరిజన జనాభా 8.6% గా ఉంది.
మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజన విధార్యార్థులకు నాణ్యమైన, వృత్తి విద్య అందించి వారికి విఇవ్హడా రంగాల్లో ఉపాధి అవకాశాలు అందించడానికి ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలు పనిచేస్తున్నాయి. కేవలం విద్యకు మాత్రమే కాకుండా విద్యార్థుల ఆరోగ్యం ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ఏకలవ్య పాఠశాలలు విద్యా కార్యక్రమాలు అందిస్తున్నాయి. .దేశం వివిధ ప్రాంతాలలో ప్రస్తుతం 401 ఏకలవ్య పాఠశాలలు పనిచేస్తున్నాయి. నాణ్యమైన విద్య అందించడానికి ఆధునిక సౌకర్యాలు కలిగి ఉన్న పాఠశాలలు క్రీడలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
***
(रिलीज़ आईडी: 2007534)
आगंतुक पटल : 120