ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

30,500 కోట్ల రూపాయల విలువగల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి.


దేశవ్యాప్తంగా విద్యారంగానికి మరింత ఊతం ఇస్తూ పలు కీలక విద్యా సంస్థలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఇందులో ఐఐటి జమ్ము, ఐఐఎం జమ్ము, ఐఐటి భిలాయ్, ఐఐటి తిరుపతి, ఐఐటిడిఎం కాంచీపురం, ఐఐఎం బోధ్ గయ, ఐఐఎం విశాఖపట్నం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆప్ స్కిల్స్ (ఐఐఎస్) కాన్పూర్లు ఉన్నాయి.

ఎఐఐఎంఎస్ జమ్మును ప్రారంభించనున్న ప్రధానమంత్రి,

2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి దీనికి శంకుస్థాపన చేశారు.

ప్రదానమంత్రి జమ్ము విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ బిల్డింగ్కు శంకుస్థాపన చేస్తారు. అలాగే జమ్ములో కామన్ యూజర్ ఫెసిలిటీ పెట్రోలియం డిపోకు శంకుస్థాపన చేయనున్నారు.

ప్రధానమంత్రి జమ్ము కాశ్మీర్లో పలు రోడ్డు రైలు అనుసంధానత ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారు.

జమ్ముకాశ్మీర్లో పౌర, నగర మౌలిక సదుపాయాలను పటిష్టంచేసేందుకు ఉద్దేశించిన పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

Posted On: 19 FEB 2024 8:55AM by PIB Hyderabad

ఆరోజు ఉదయం 11.30 గంటలకు ఆయన జమ్ము లోని మౌలానా ఆజాద్ స్టేడియంలో జిరిగే ఒక బహిరంగ సభలో ప్రధానమంత్రి పాల్గొంటారు.  ఈ సందర్బంగా ప్రధానమంత్రి సుమారు 30,500 కోట్ల రూపాలయ విలువ చేసే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టులలో ఆరోగ్యం ,విద్య రైలు, రోడ్డు, విమానయానం, పెట్రోలియం, పౌర మౌలికసదుపాయాలు వంటి రంగాలకు  సంబంధించినవి ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి జమ్ముకాశ్మీర్ నుంచి  కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన  1500 మందికి  నియమాక పత్రాలు అందజేస్తారు. ప్రధానమంత్రి, వికసిత్ భారత్ వికసిత్ జమ్ము కార్యక్రమంలో భాగంగా  వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధానమంత్రి ముచ్చటిస్తారు.

విద్యారంగానికి మరింత ఊతం:

విద్యారంగాన్ని అభివృద్ధి చేయడం, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి మౌలికసదుపాయాలను దేశవ్యాప్తంగా అభివృద్ధి చేసేదిశగా ప్రధానమంత్రి సుమారు 13,375 కోట్ల రూపాయల విలువగల పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం చేస్తారు. జాతికి అంకిత చేయనున్న ప్రాజెక్టులలో ఐఐటి భిలాయ్ శాశ్వత క్యాంపస్, ఐఐటి తిరుపతి, ఐఐటి జమ్ము, ఐఐటి డిఎం కాంచీపురం, కాన్పూర్లోని   కీలక శిక్షణ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్టూయట్ ఆఫ్ స్కిల్స్ (ఐఐఎస్) కాన్యూర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ , ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ్లో , త్రిపురలోని అగర్తలో కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం క్యాంపస్లు ఉన్నాయి. ప్రధానమంత్రి ఐఐఎం జమ్ము, ఐఐఎం బోథ్ గయ, ఐఐఎం విశాఖపట్నం లలో మూడు ఐఐఎంలను ప్రారంభించనున్నారు.  అలాగే ప్రధానమంత్రి  20 కొత్త కేంద్రీయ విద్యాలయాల నూతన భవనాలను ప్రారంబించనున్నారు. మరో 13 కొత్త నవోదయ విద్యాలయ (ఎన్వి) భవనాలను ప్రారంభించనున్నారు.  ప్రధానమంత్రి  ఐదు కేంద్రీయ విద్యాలయ క్యాంపస్లను , ఒక నవోదయ విద్యాలయ క్యాంపస్, ఐదు బహుళ ప్రయోజనకర హాళ్లు, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో నిర్మించేందుకు శంకుస్థాపన చేయనున్నారు. నూతనంగా నిర్మించిన కెవిలు, ఎన్వి భవనాలు దేశవ్యాప్తంగా విద్యార్థుల విద్యావసరాలను తీర్చడానికి ఉపకరిస్తాయి.

ఎఐఐఎంఎస్ జమ్ము: జమ్ముకాశ్మీర్  ప్రజలకు ,నాణ్యమైన సమగ్ర ఆరోగ్య సదుపాయాలు అందించేందుకు వీలుగా ,ప్రధానమంత్రి జమ్ములోని సాంబా (విజయపూర్) వద్ద ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్(ఎఐఐఎంఎస్)ను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ఈ సంస్థకు 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి స్వాస్త్య సురక్షా యోజన కింద దీనిని ఏర్పాటు చేస్తున్నారు.

1600 కోట్ల రూపాయలతో సుమారు 227 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు.  ఈ ఆస్పత్రిలో 720 బెడ్లు , 125 సీట్లతొఓ మెడికల్ కాలేజీ ఉన్నాయి.60 సీట్లతో నర్సింగ్ కాలేజీ ఉంది. 30 పడకలతో ఇందులో ఆయుష్ బ్లాక్ కూడా ఉంది.ఫాకల్టీకి , సిబ్బందికి రెసిడెన్షియల్ సదుపాయం కూడా ఉంది. పిజి, యుజి విద్యార్థులకు  హాస్టల్ సదుపాయం, నైట్షెల్టర్, గెస్ట్హౌస్, ఆడిటోరియం, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. 18 స్పెషాలిటీలు, 17 సూపర్ స్పెషాలిటీలలో  అత్యున్నత పేషెంట్ కేర్ సర్వీసులు అందిస్తారు. ఇందులో కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరి, మెడికల్ ఆంకాలజీ, సర్టికల్ ఆంకాలజీ, ఎండోక్రినాలజీ, గాయాలు, ప్లాస్టిక్ సర్జరీ వంటివి ఉన్నాయి. థియేటర్లు, డయాగ్నస్టిక్ లేబరెటరీలు , బ్లడ్బ్యాంకు, ఫార్మసి తదితరాల సదుపాయాలు ఉంటాయి. ఇన్స్టిట్యూట్కు ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఎమర్జెన్సీ, ట్రామా యూనిట్, 20 మాడ్యులార్ ఆపరేషన్ థియేటర్లు, డయాగ్నస్టిక్ లేబరెటరీలు, బ్లడ్ బ్యాంక్, ఫార్మసి తదితరాలు ఉన్నాయి. ఈ  హాస్పిటల్ లో డిజిటల్ ఆరోగ్య మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలోని సుదూర ప్రాంత ప్రజలకు సేవలు అందించడానికి ఇది ఉపకరిస్తుంది.

 

  జమ్ముఎయిర్ పోర్టులో కొత్త టెర్మినల్ భవనం:

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జమ్ముఎయిర్ పొర్టులో కొత్త టెర్మినల్ బిల్డింగ్ కు శంకుస్థాపన చేస్తారు. ఇది 40 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ నూతన టెర్మినల్ బిల్డింగ్ ను ఆధునిక సదుపాయాలతో అనుసంధానం చేస్తారు. కీలక సమయాంలో 2000 మంది ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు సదుపాయాలు ఉంటాయి.ఇది పర్యావరణ హితకరంగానూ ఉంటుంది. స్థానిక సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలాగున దీనిని నిర్మించనున్నారు. ఇది పర్యావరణ హితకరంగా కూడా ఉంటుంది. ఇది విమానయాన అనుసంధానతను బలోపేతం చేస్తుంది, పర్యాటకాన్ని విస్తృతం చేస్తుంది  వాణిజ్యాన్నిపెంపొందిస్తుంది, తద్వారా ఆర్ధికాభివృద్ధికి దోహదపడుతుంది. ఇది స్థానిక సంస్కృతులనున ప్రతిబింబిస్తుంది.  అలాగే ఈప్రాంత ఆర్ధిక ప్రగతిని వేగవంతం చేస్తుంది.

రెయిల్ ప్రాజెక్టులు: ప్రధానమంత్రి జమ్ము కాశ్మీర్లో వివిధ రైలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు.భనిహల్– ఖారి–సంబెర్–సంగల్దాన్(48కిమీ), కొత్తగా విద్యుదీకరించిన బారాముల్లా –శ్రింగార్–బనిహలన్(185.66 కిలోమీటర్లు) రైల్వేలైన్ ఇందులో ఉన్నాయి. ప్రధానమంత్రి జమ్ముకాశ్మీర్లో తొలి ఎలక్ట్రిక్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. అలాగే సంగల్దామ్ స్టేషన్, బారాముల్లా స్టేషన్ల మధ్య రైలు సేవలను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. బనిహల్– ఖారి–సుంబెర్–సుంగల్దాన్ సెక్షన్ కీలకమైనది. దీనికి బాలాస్ట్ లెస్ ట్రాక్  (బిఎల్టి) ఉంది. ఈ మార్గం పొడవునా ప్రయాణికులు మెరుగైన ప్రయాణ సదుపాయాన్ని పాందుతారు. భారతదేశపు రవాణా టన్నెల్ (టి–50) (12.77 కిమి) ఖారి – సుంబెర్ మధ్య ఉంది. ఈ రైలు ప్రాజెక్టులు అనుసంధానతను పెంచుతాయి. అలాగే పర్యావరణ  సుస్థిరతకు వీలు కల్పిస్తుంది, ఈ ప్రాంత మొత్తం  సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుంది.

రోడ్డు ప్రాజెక్టులు : ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి కీలక రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు . అవి రెండు ప్యాకేజ్లుగా ఉ న్నాయి. 44,22 కిలోమీటర్ల నిడివి గలవి. అవి ఢిల్లీ – అమృతర్– కర్తా ఎక్సప్రెస్ వే ఉన్నాయి. ఇది జమ్ము నుంచి కత్రాను అనుసంధానం చేస్తుంది. రెండో దశలో శ్రీనగర్ రింగ్ రోడ్ ను  నాలుగులేన్లుగా మార్చడం,  ఎన్హెచ్ 01 కు చెందిన 161 కిలోమీటర్ల పొడవుగల శ్రీంగార్ – బారాముల్లా –యురి స్ట్రెచ్, ఎన్.హెచ్  444లో కుల్గాం బైపాస్, పుల్వామా బైపాస్ రోడ్లైన్ ఇందులో ఉన్నాయి.

ఢిల్లీ –అమృత్సర్ –కత్రా ఎక్స్ప్రెస్వే  ఒకసారి పూర్తయితే,మాతా వైష్ణోదేవ్ ఆలయాన్ని దర్శించే యాత్రికులకు ఎంతో ఉపకరిస్తుంది. అలాగే ఇది ఈ ప్రాంత ఆర్ధికాభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. శ్రీనగర్ రింగ్రోడ్ నాలుగు లైన్ల రహదారిగా మార్చే  రెండో దశ కింద ప్రస్తుతం సుంబాల్ –వేయుల్ ఎన్.హెచ్ 1 అప్గ్రేడ్ ప్రాజెక్టు ఉంది. ఈ బ్రౌన్ఫీల్డ్ ప్రాజెక్టు పొడవు 24.7 కిలోమీటర్లు. ఇది శ్రీనగర్ నగరం చుట్టుపక్కల ప్రయాణికుల రద్దీని తగ్గిస్తుంది.  ఇది ప్రజాదరణ పొందిన మనస్బల్ సరస్సు, ఖీర్ భవాని ఆలయక్షేత్రాలకు అనుసంధానతను మరింత మెరుగుపరుస్తుంది.  ఇది  లెహ్, లద్దక్ ల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. ఎన్.హెఛ్ 01 స్ట్రెచ్లో శ్రీనగర్– బారాముల్లా–యురి స్ట్రెచ్లో 161 కిలోమీటర్ల రహదారిని అప్గ్రేడ్ చేస్తారు. ఇది వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనది. ఇది బారాముల్లా, యురి, కుల్గాం బైపాస్ , పుల్వామా బైపాస్ ఎన్హెచ్ 444 మార్గంలో ఆర్ధికాభివృద్ధికి వీలుకల్పిస్తుంది. ఇది క్వాజిగుండ్–కుల్గామ్–షోపియాన్–పుల్వామా–బడగామ్–శ్రీనగర్పప మార్గ అభివృద్ధికి ఉపకరిస్తుంది. ఇది రోడ్డు మౌలికసదుపాయం అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది.

సియుఎఫ్ పెట్రోలియం విభాగం: ప్రధానమంత్రి జమ్ములో కామన్ యూజర్ ఫెసిలిటి(సియుఎఫ్) పెట్రోలియం డిపో ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని నిర్మిస్తున్నారు. ఇది పూర్తి ఆటోమేటిక్ డిపో.దీనిని 677 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేస్తారు. దీనికి 10,0000 కె.ఎల్ మోటార్ స్పిరిట్ (ఎం.ఎస్),హైస్పీడ్డీజిల్ (హెచ్.ఎస్.డి)నాణ్యమైన కిరోసిన్ ఆయిల్ (ఎస్.కె.ఒ) ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్) ఇథనాల్, బయో డీజిల్, వింటర్ గ్రేడ్ హెచ్ ఎస్ డి లను నిల్వచేసే సామర్ధ్యం ఉంటుంది.

ఇతర ప్రాజెక్టులు: ప్రధానమంత్రి పలు అభివృద్ధి పథకాలను ప్రారంభిస్తారు, అలాగే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.  వీటి విలు వ  సుమారు రూ 3150 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.  ఇది పౌర సేవల మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి , జమ్ము కాశ్మీర్ అంతటా పబ్లిక్ ఫెసిలిటీస్ను అభివృద్ధి చేయడానికి వీలు క ల్పిస్తుంది. ప్రధానమంత్రి ప్రారంభించే ప్రాజెక్టులలో రోడ్డు, బ్రిడ్జి ప్రాజెకట్లు, గ్రిడ్ స్టేషన్లు, రిసీవింగ్ స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్  ప్రాజెక్టులు, కామన్ ఎఫ్లుయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, మురుగు శుద్ది ప్లాంట్లు , పలు డిగ్రీ కాలేజి భవనాలు, శ్రీనగర్ సిటీలో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థ, ఆధునిక నర్వాల్ పండ్ల మార్కెట్, కథువాలో డ్రగ్ టెస్టింగ్ లేబరెటరీ , గందేర్బల్, కుప్వారాలలో   ట్రాన్సిట్ వసతికి 224 ఫ్లాట్లు ఉన్నాయి. శంకుస్థాపన చేసే ప్రాజెక్టులలో జమ్ము కాశ్మీర్ లోని వివిధ ప్రాంతాలలో ఐదు కొత్త పారిశ్రామిక ఎస్టేట్లు, డాటాసెంటర్లు, విపత్తుల రికవరీ కేంద్రం, జమ్ముకాశ్మీర్కు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్త, శ్రీనగర్ లోని పరింపొరాలో ట్రాన్స్పోర్ట్ నగర్ను అప్ గ్రేడ్ చేయడం, 62 రోడ్ ప్రాజెక్టుల స్థాయి పెంపు, 42 బ్రిడ్జిలు ట్రాన్సిట్ అకామడేషన్కు సంబంధించి 2816 ప్లాట్లకు వసతి కల్పించడం చేస్తారు. అనంతనాగ్ కుల్గామ్, కుప్వారా, షోపియాన్, పుల్వామా ఇతర ప్రాంతాలలో వీటిని నిర్మిస్తారు



(Release ID: 2007450) Visitor Counter : 76