ఆర్థిక మంత్రిత్వ శాఖ

డీఎఫ్‌ఎస్‌ కార్యదర్శి అధ్యక్షత న్యూదిల్లీలో "డెట్ రికవరీ అప్పిలేట్ ట్రిబ్యునల్స్ (డ్రాట్స్‌) & ప్రిసైడింగ్ ఆఫీసర్స్‌ ఆఫ్‌ డెట్ రికవరీ ఆఫ్ ట్రిబ్యునల్స్ (డీఆర్‌టీఎస్‌)" అధిపతుల సదస్సు

Posted On: 17 FEB 2024 5:03PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్‌) ఆధ్వర్యంలో, "డెట్ రికవరీ అప్పిలేట్ ట్రిబ్యునల్స్ (డ్రాట్స్‌) & ప్రిసైడింగ్ ఆఫీసర్స్‌ ఆఫ్‌ డెట్ రికవరీ ఆఫ్ ట్రిబ్యునల్స్ (డీఆర్‌టీఎస్‌)" సదస్సు ఈ రోజు న్యూదిల్లీలో జరిగింది. కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి శ్రీ వివేక్ జోషి ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు.

ప్రభుత్వ & ప్రైవేట్ రంగ బ్యాంకుల సీనియర్ అధికార్లు, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికార్లు, ఇన్‌సాల్వెన్సీ & బ్యాంక్‌రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) సీనియర్‌ అధికార్లు ఈ సదస్సుకు హాజరయ్యారు.

రుణాల త్వరితగతి వసూళ్లలో డీఆర్‌టీల సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ సదస్సులో విస్తృతంగా చర్చలు జరిగాయి. సదస్సులో చర్చించిన ప్రధానాంశాలు:

  • వివిధ కేసుల్లో వివిధ దశల్లో జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి డీఆర్‌టీలు & డ్రాట్‌లు గట్టిగా పర్యవేక్షించడం, సాధ్యమైనన్ని చర్యలు తీసుకోవడం.
  • సమర్థవంతమైన వసూళ్ల కోసం 'డెట్ రికవరీ ట్రిబ్యునల్' నిబంధనలు, ఎస్‌ఏఆర్‌ఎఫ్‌ఏఈఎస్‌ఐ చట్టం, ఆర్‌డీబీ చట్టంలో మార్పులు & సవరణలకు సంబంధించిన సూచనలపై చర్చ.
  • నియమిత న్యాయవాదుల పనితీరుపై బ్యాంకులు కాలానుగుణ సమీక్షలను నిర్వహించడం & వారి పనితీరు ఆధారంగా కేసుల కేటాయింపును హేతుబద్ధం చేయడం.
  • ఎస్‌ఏఆర్‌ఎఫ్‌ఏఈఎస్‌ఐ చట్టం-2002, ఆర్‌డీబీ చట్టం-1993 & ఐబీసీ-2016 నిబంధనల ప్రకారం బ్యాంకులు & ఆర్థిక సంస్థల ఆస్తుల నమోదు & వేలం కోసం ఇ-వేలం వేదికను ప్రభావవంతంగా మార్చడం.
  • డీఆర్‌టీలు & డ్రాట్‌ల వద్ద ఇప్పటికే రాజీ కుదిరిన కేసులను పునఃసమీక్షించడానికి బ్యాంకులు & ఆర్థిక సంస్థలు ప్రయత్నించడం.
  • న్యాయ సంస్థల వద్ద సంబంధిత కేసుల విచారణలన్నింటికీ తమ అధికార్లు హాజరయ్యేలా బ్యాంకులు చూసుకోవడం.

***



(Release ID: 2007010) Visitor Counter : 79


Read this release in: English , Urdu , Hindi , Marathi