నౌకారవాణా మంత్రిత్వ శాఖ
రేవుల పనితీరు మదింపు సూచిక 'సాగర్ ఆంకాలన్' మార్గదర్శకాలను విడుదల చేసిన శ్రీ సర్బానంద సోనోవాల్
జీఎంఐఎస్ లో కుదిరిన లక్ష కోట్ల విలువ చేసే అవగాహన ఒప్పందాల అమలుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించిన మంత్రిత్వ శాఖ
జీఎంఐఎస్ 2023 లో కుదిరిన ఒప్పందాలను కార్యరూపంలోకి తెచ్చేందుకు సంబంధిత వర్గాలతో సమావేశం నిర్వహించిన మంత్రిత్వ శాఖ
" సుస్థిర అభివృద్ధి సాధన కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించిన మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 లక్ష్య సాధన కోసం భారతీయ ఓడరేవుల పనితీరు మదింపు వేయడానికి 'సాగర్ ఆంకాలన్ మార్గదర్శకాలు : శ్రీ సోనోవాల్
ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా చూసేందుకు సంబంధిత వర్గాలు సంఘటిత కృషి చేసి భారత నౌక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి సహకారం అందించాలి.. శ్రీ సోనోవాల్
ఐఐటీ చెన్నై లో జీఎంఐఎస్ 2023 నివేదిక విడుదల, డ్రెడ్జింగ్ టెక్నాలజీ లో ఎం. టెక్ కోర్సు ప్రారంభం
Posted On:
16 FEB 2024 6:17PM by PIB Hyderabad
రేవుల పనితీరు మదింపు సూచిక 'సాగర్ ఆంకాలన్' మార్గదర్శకాలను కేంద్ర రేవులు, జల మార్గాలు, షిప్పింగ్, ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈరోజు విడుదల చేశారు. గ్లోబల్ మారిటైం ఇండియా సమ్మిట్ (జీఎంఐఎస్ 2023) లో సంతకాలు చేసిన వివిధ అవగాహన ఒప్పందాలను అమలు లోకి తీసుకు వచ్చేందుకు సంబంధిత వర్గాలతో ఏర్పాటు చేసిన సమావేశం 'సాగర్ ఆంకాలన్' మార్గదర్శకాలను శ్రీ సర్బానంద సోనోవాల్ విడుదల చేశారు.
'సాగర్ ఆంకాలన్' మార్గదర్శకాల ప్రకారం దేశంలో అన్ని ఓడ రేవుల పనితీరును మదింపు వేస్తారు. ఓడరేవుల రవాణా సామర్థ్యం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రమాణాల అమలు, పోటీతత్వం ఎక్కువ చేయడం, అభివృద్ధి, ఉత్పాదకత, సుస్థిరత, వినియోగదాలకు అందించిన సేవలు ఆధారంగా ఓడ రేవుల పనితీరును మదింపు వేస్తారు.
జీఎంఐఎస్ 2023 లో కుదిరిన అవగాహన ఒప్పందాలను సాధ్యమైనంత త్వరగా అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ సంబంధిత వర్గాలతో సమావేశం నిర్వహించింది. అవగాహన ఒప్పందాల అమలుకు ఒక కార్యాచరణ ప్రణాళిక సింహం చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
సమావేశంలో పాల్గొన్న వారు వివిధ అమలుపై సుదీర్ఘంగా చర్చించి ఒప్పందాల అమలులో ఎదురవుతున్న సవాళ్లు గుర్తించి పరిష్కార మార్గాలను సూచించారు. సమావేశంలో కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాలు, పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద వై. నాయక్, కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల సహాయ మంత్రి శ్రీ శాంతాను ఠాకూర్, కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఐఐటీ చెన్నై లో జీఎంఐఎస్ నివేదిక విడుదల తో పాటు డ్రెడ్జింగ్ టెక్నాలజీలో ఎం టెక్ కోర్సు ప్రారంభ కార్యక్రమం కూడా జరిగింది.
కార్యక్రమంలో మాట్లాడిన శ్రీ శ్రీ సర్బానంద సోనోవాల్ '' సుస్థిర అభివృద్ధి సాధన కోసం జరుగుతున్న కృషిలో భాగంగా గ్లోబల్ మారిటైం ఇండియా సమ్మిట్ 2023 లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమృత కాలంలో సముద్రయాన అభివృద్ధి ప్రణాళిక విడుదల చేశారు'' అని తెలిపారు.
'' సుస్థిర అభివృద్ధి, సాంకేతిక పురోగతి, సముద్ర మౌలిక సదుపాయాల పెంపుపై దృష్టి సారించి గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 జరిగింది. దీనిలో పరిశ్రమ నాయకులు, విధానకర్తలు, వాటాదారుల మధ్య వ్యూహాత్మక చర్చలు జరిగాయి.. భారతదేశ విస్తారమైన సముద్ర తీరం, సముద్ర వనరుల సామర్థ్యాన్ని అందరికీ ప్రయోజనం చేకూర్చడానికి ఉపయోగించడం లక్ష్యంగా సదస్సు జరిగింది. " అని శ్రీ సోనోవాల్ అన్నారు.
ఒప్పందాలను సాకారం చేయడానికి, భారత సముద్రయాన రంగం మరింత అభివృద్ధి సాధించడానికి భాగస్వాములు కలిసి పనిచేయాలని మంత్రి కోరారు. అమృత్ కాల సమయంలో భారతదేశాన్ని 'వికసిత భారత్ ' గా అభివృద్ధి చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో జీఎంఐఎస్ 2023లో కుదిరిన అవగాహన ఒప్పందాల పురోగతిని పోర్టు ప్రతినిధులు వివరించారు. సాధించిన ప్రగతి, అమలులో ఎదురవుతున్న సవాళ్లను వివరించారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో వాటాదారులు ఈ ఒప్పందాల అమలుపై తమ అభిప్రాయాలూ, సూచనలు తెలిపారు. చర్చల వల్ల అవగాహన ఒప్పందాలపై స్పష్టత వచ్చింది. సంతకం చేసిన ఒప్పందాల అమలులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటించాలని, పోర్టులు వాటి వాటాదారుల మధ్య సంబంధాలు బలోపేతం చేయడానికి చేయడానికి మరిన్ని చర్యలు అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
జిఎంఐఎస్ 2023 ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద సముద్ర శిఖరాగ్ర సమావేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. రికార్డు స్థాయిలో రూ .10 లక్షల కోట్ల పెట్టుబడులను జిఎంఐఎస్ 2023 ఆకర్షించింది. రూ.8.35 లక్షల కోట్ల విలువ చేసే 360 అవగాహన ఒప్పందాలపై సంతకాలుజరిగాయి. రూ.1.68 లక్షల కోట్ల విలువైన అదనపు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టులను గుర్తించారు. నౌకాశ్రయ అభివృద్ధి, ఆధునీకరణ, గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా, నౌకాశ్రయ ఆధారిత అభివృద్ధి, క్రూయిజ్ రంగం, వ్యాపార వాణిజ్యం, నౌకా నిర్మాణం, జ్ఞాన భాగస్వామ్యంతో సహా సముద్ర రంగానికి సంబంధించిన వివిధ రంగాలలో జిఎంఐఎస్ 2023 లో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. . ఈ కార్యక్రమాలు సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి, ప్రపంచ నౌకాయాన రంగంలో భారతదేశాన్ని అగ్ర స్థానంలో నిలబెట్టడానికి ఈ ఒప్పందాల వల్ల అవకాశం కలుగుతుంది.
జిఎంఐఎస్ 2023 లో సంతకం చేసిన అవగాహన ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా చూసేందుకు ఓడరేవులు, షిప్పింగ్ ,జలమార్గాల మంత్రిత్వ శాఖ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. సహకారాన్ని పెంపొందించడం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, సుస్థిర పద్ధతులు అవలంబించడం ద్వారా భారతదేశ సముద్ర రంగం పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉంది, సమ్మిళిత వృద్ధి, శ్రేయస్సు లక్ష్యంగా కార్యక్రమాలు అమలు చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
***
(Release ID: 2006718)
Visitor Counter : 164