శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

శాస్త్రీయ అంశాలపై అవగాహన కల్పించేందుకు 150 మంది విద్యార్థులకు సైంటిఫిక్ విహారయాత్ర నిర్వహించిన సిఎస్ఐఆర్-ఐఐసీటీ, కేఏఎంపీ:

Posted On: 16 FEB 2024 10:58AM by PIB Hyderabad

నాలెడ్జ్ అండ్ అవేర్ నెస్ మ్యాపింగ్ ప్లాట్ ఫామ్  నిర్వహించిన సైంటిఫిక్ విహారయాత్రలో భాగంగా  తెలంగాణలో హైదరాబాద్ లో ఉన్న సీఎస్ ఐఆర్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీని హైదరాబాద్ రమాదేవి పబ్లిక్ స్కూల్,   హకీంపేట   పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం కు చెందిన 150 మంది విద్యార్థులు సందర్శించారు. 

 విద్యార్థులకు శాస్త్రీయ అన్వేషణ, ఆవిష్కరణల పట్ల అభిరుచి పెంపొందించడం లక్ష్యంగా  ఈ విహారయాత్రను నిర్వహించారు.  ఈ విహారయాత్రలో పాల్గొన్న  విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక, నూతన ఆవిష్కరణలకు సంబంధించిన అనేక అంశాలపై అవగాహన పొందారు. 

 

తన బృందం  సభ్యులతో కలిసి డాక్టర్ వత్సల రాణి (ప్రిన్సిపల్ సైంటిస్ట్ మరియు సిఎస్ఐఆర్-జిగ్యాస కోఆర్డినేటర్, సిఎస్ఐఆర్-ఐఐసిటి, హైదరాబాద్) విద్యార్థులకు శాస్త్రీయ అంశాలపై అవగాహన కల్పించారు.  చర్చలు,  ల్యాబ్ సందర్శనల ద్వారా విద్యార్థులకు  శాస్త్రీయ అంశాలపై స్ఫూర్తి కల్పించారు.   ప్రయోగశాలలో, విద్యార్థులు వాయురహిత గ్యాస్ లిఫ్ట్ రియాక్టర్ టెక్నాలజీ, వాటర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ , ఫెరోమోన్ టెక్నాలజీకి సంబంధించి అనేక కొత్త విషయాలను స్వయంగా పరిశీలించి అవగాహన పొందారు. 

విహారయాత్రకు సహకరించి, విద్యార్థులకు శాస్త్రీయ అంశాలు  వివరించిన  డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డి (డైరెక్టర్, సిఎస్ ఐఆర్-ఐఐసిటి), డాక్టర్ వత్సల రాణి (ప్రిన్సిపల్ సైంటిస్ట్ మరియు సిఎస్ ఐఆర్-జిగ్యాస కోఆర్డినేటర్, సిఎస్ ఐఆర్-ఐఐసిటి, హైదరాబాద్)లకు   శ్రీ అనికేత్ అరోరా (ఔట్ రీచ్ కోఆర్డినేటర్, కెఎమ్ పి) , , కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల  ప్రాముఖ్యతను కూడా ఆయన ప్రస్తావించారు.  భారతదేశంలో సైన్స్, ఇతర పరిణామాలపై విద్యార్థుల లోతైన ఆసక్తి, అవగాహన  పెంపొందించడానికి  కెఎఎంపి చేస్తున్న కృషిని   శ్రీ అనికేత్ అరోరా వివరించారు. విద్యార్థులకు      అనుభవపూర్వక అభ్యాసం కీలకమని ఆయన అన్నారు. భవిష్యత్తులో చేపట్టనున్న వివిధ కారయ్కర్మాలను ఆయన వివరించారు. భారతదేశంలోని వివిధ ప్రసిద్ధ సిఎస్ఐఆర్ ప్రయోగశాలలు / పరిశోధనా సంస్థలలో వివిధ శాస్త్రీయ విభాగాలను ఉపాధ్యాయులకు ఆన్లైన్ నాలెడ్జ్ షేరింగ్ సెషన్లు, విద్యార్థులకు శాస్త్రీయ విహార యాత్రలు, నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి వంటి  కార్యకలాపాలు చేపడతామని  ఆయన విద్యార్థులకు తెలియజేశారు.

 

సీఎస్ఐఆర్-ఐఐసీటీ గురించి

 కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) పరిధిలో పనిచేస్తున్న  జాతీయ ప్రయోగశాలల్లో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (సిఎస్ఐఆర్-ఐఐసిటి) ఒకటి. క్రియాశీలక సంస్థగా గుర్తింపు పొందిన ,సీఎస్ఐఆర్-ఐఐసీటీ తన డెబ్బై ఏళ్ల ప్రయాణంలో అనేక ఆవిష్కరణలు అభివృద్ధి చేసి ప్రముఖ పరిశోధన, అభివృద్ధి సంస్థగా గుర్తింపు పొందింది. ప్రపంచం వివిధ ప్రాంతాలకు చెందిన సంస్థలకు  సిఎస్ఐఆర్-ఐఐసిటి సేవలు అందిస్తోంది. భారతదేశంలో రసాయన, బయోటెక్ పరిశ్రమలకు సిఎస్ఐఆర్-ఐఐసిటి సేవలు అందిస్తోంది. 

కేఏఎంపీ గురించి
 కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (ఎన్ఐఎస్సిపిఆర్), పారిశ్రామిక భాగస్వామి మెసర్స్ నైసా కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్సిపిఎల్) కలిసి నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ మ్యాపింగ్ ప్లాట్ ఫామ్ ను నిర్వహిస్తున్నాయి.  విద్యార్థుల అంతర్లీన సామర్థ్యాలను వెలికితీసే సృజనాత్మకత, అర్థవంతమైన అభ్యాసం, విమర్శనాత్మక పఠనం, ఆలోచనా నైపుణ్యాలు అభివృద్ధి చేయడం లక్ష్యంగా నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ మ్యాపింగ్ ప్లాట్ ఫామ్ కార్యక్రమాలు అమలు చేస్తోంది. 

***



(Release ID: 2006519) Visitor Counter : 73


Read this release in: English , Urdu , Hindi , Tamil