కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
డిసెంబర్ 2023 మాసంలో ఇఎస్ఐ పధకం కింద 18.86 నూతన ఉద్యోగుల నమోదు
నూతనంగా నమోదు చేసుకున్నయువ ఉద్యోగులలో 25 ఏళ్ళ వయోవర్గంలోనివారు 8.83 లక్షలమంది
ఇఎస్ఐ పథకం కింద 3.59 లక్షలమంది మహిళా ఉద్యోగుల నమోదు
డిసెంబర్ 2023 మాసంలో ఇఎస్ఐ పథకం కింద నమోదు చేసుకున్న దాదాపు 23,347 నూతన సంస్థలు
డిసెంబర్, 2023లో 47మంది ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులకు ఇస్ఐ పథకం ప్రయోజనాల విస్తరణ
Posted On:
15 FEB 2024 5:55PM by PIB Hyderabad
డిసెంబర్, 2023 మాసంలో 18.86 లక్షల మంది నూతన ఉద్యోగులను జోడించినట్టు ఇఎస్ఐసి తాత్కాలిక వేతన చిట్టా వెల్లడిస్తోంది.
దాదాపు 23,347 కొత్త సంస్థలను నమోదు చేసి డిసెంబర్ 2023 నెలలో రాష్ట్ర బీమా కార్పొరేషన్ సామాజిక భద్రతా గొడుకు కిందకు మరింతమంది ఉద్యోగులను తీసుకురావడం ద్వారా పరిధిని మరింత విస్త్రతం చేశారు.
దేశంలోని యువత కోసం మరిన్ని ఉద్యోగాలను సృష్టించారని డిసెంబర్ నెలలో జోడించిన మొత్తం 18.86 లక్షల మంది ఉద్యోగులలో 8.83 లక్షల మంది ఉద్యోగులు 25 ఏళ్ళ వయో వర్గంలో ఉన్నవారు ఉన్నారని డేటా స్పష్టం చేస్తోంది. మొత్తం నమోదైన ఉద్యోగులలో వీరి శాతం 47%గా ఉంది.
వేతన డాటా జెండర్ వారీ విశ్లేషణ ప్రకారం డిసెంబర్, 2023నెలలో నికరంగా 3. 59 లక్షల మంది మహిళలు ఉన్నారు. అలాగే, మొత్తం 47 మంది ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులను కూడా ఇఎస్ఐ పథకం కింద డిసెంబర్ 2023లో నమోదు చేశారు. ఇఎస్‌సిఐసి సమాజంలోని ప్రతివర్గానికి తన ప్రయోజనాలను అందించేందుకు కట్టుబడి ఉందని ఇది పట్టి చూపుతోంది.
ఈ డాటా ఉత్పాదన అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ కనుక వేతన పట్టిక డాటా తాత్కాలికం .
***
(Release ID: 2006449)
Visitor Counter : 87