నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

కాప్ వాతావరణ ప్రమాణాలు అందుకోవడానికి


2024-2030 ఆర్థిక సంవత్సరాల మధ్య భారతదేశానికి 30 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం .. ప్రపంచ బ్యాంకు వెబినార్ లో ఐఆర్ఈడిఏ సీఎండీ

"ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన అభివృద్ధిలో భారతదేశంమార్గదర్శిగా ఉంది ".. ఐఆర్ఈడిఏ సీఎండీ

Posted On: 15 FEB 2024 11:21AM by PIB Hyderabad

 "వేగవంతమైన, పరిశుభ్రమైన వృద్ధి వైపు" అనే అంశంపై ప్రపంచ బ్యాంకు నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్ లో  ' ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (ఐఆర్ఈడీఏ) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) శ్రీ ప్రదీప్ కుమార్ దాస్ ప్రసంగించారు. దక్షిణాసియా అభివృద్ధి నవీకరణ విడుదల సందర్భంగా 2024 ఫిబ్రవరి 14న ప్రపంచ బ్యాంకు ఈ వెబినార్ నిర్వహించింది. 

2030 నాటికి భారతదేశం నిర్ణయించుకున్న జాతీయంగా నిర్ణయించుకున్న వాతావరణ లక్ష్యాలు చేరుకోవడానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరం అవుతాయని ప్రదీప్ కుమార్ దాస్ తెలిపారు. లక్ష్యాల సాధనకు  2024-2030 ఆర్థిక సంవత్సరాల మధ్య భారతదేశానికి  30 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం ఉంటాయన్నారు. సౌరశక్తి, ఎలక్ట్రో లైజర్, పవన, బ్యాటరీ , వ్యర్ధాల నుంచి ఇంధనం ఉత్పత్తి, పంపిణీ, గ్రీన్ హైడ్రోజన్  రంగాలలో భారీ పెట్టుబడులు అవసరం ఉంటాయని ఆయన వివరించారు. 

2024 ఫిబ్రవరి 13న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ప్రారంభించిన రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్ "పీఎం  సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన"  ప్రాముఖ్యతను   శ్రీ ప్రదీప్ కుమార్ దాస్ వివరించారు.  “రూ. 75,000 కోట్ల పెట్టుబడితో  దూరదృష్టితో కూడిన ప్రాజెక్ట్ అమలు జరుగుతుంది. ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా 1 కోటి గృహాలకు సౌరశక్తిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంతో భారతదేశంలో ఇళ్ల పై కప్పులపై సౌర ఫలకలు అమర్చే రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుంది. ఈ పథకం గణనీయమైన ప్రయోజనాలను అందించడమే కాకుండా, పునరుత్పాదక ఇంధన పై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తుంది, 2070 నాటికి నికర-సున్నా ఉద్గారాలను సాధించడం , 2047 నాటికి ఇంధన స్వాతంత్ర్యం సాధించాలనే భారతదేశ ప్రతిష్టాత్మక లక్ష్యానికి దోహదం చేస్తుంది." అని  శ్రీ ప్రదీప్ కుమార్ దాస్ అన్నారు. 

 పునరుత్పాదక ఇంధన రంగంలోభారతదేశం సాధించిన అభివృద్ధి ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా ఉందని  శ్రీ ప్రదీప్ కుమార్ దాస్ పేర్కొన్నారు. పునరుత్పాదక కొనుగోలు బాధ్యతలు (RPO), పీఎం కుసుమ్ పథకం  పథకం, RE ఆస్తులకు 'తప్పక అమలు' స్థితి, సౌర పీవీ ఉత్పత్తికి పిఎల్ఐ  పథకం,  పునరుత్పాదక ఇంధన రంగంలో  ఆటోమేటిక్ మార్గంలో 100% వరకు ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం  వంటి అనేక ప్రభుత్వ కార్యక్రమాలు. అమలు జరుగుతున్నాయని ఆయన వివరించారు.  "భారతదేశం వచ్చే మూడేళ్లలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా,2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని  లక్ష్యంగా పెట్టుకుంది.  ఇంధన భద్రత, ఇంధన-స్వాతంత్ర్యం సాధించడానికి గణనీయమైన ఇంధన అవసరాలు ఉంటాయి. . ఈ డిమాండ్‌లో దాదాపు 90% అవసరాలు  పునరుత్పాదక వనరుల ద్వారా తీరుతాయని  భావిస్తున్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల లక్ష్యం చేరేవరకు  థర్మల్ విద్యుత్ రంగానికి కూడా ప్రాధాన్యత లభిస్తుంది. " అని ఆయన వివరించారు.  భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగం అభివృద్ధిలో  పెంపొందించడంలో ఐఆర్ఈడీఏ గత 37 సంవత్సరాలుగా కీలక పాత్ర పోషించిందని ఆయన వివరించారు.  

వెబ్‌నార్‌లో ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు ప్రతినిధి  మరియా డిమిట్రియాడౌ;  ప్రపంచ బ్యాంకు సౌత్ ఆసియా రీజియన్ చీఫ్ ఎకనామిస్ట్, శ్రీమతి ఫ్రాంజిస్కా ఓన్సోర్జ్, ప్రపంచ బ్యాంకు ప్రాస్పెక్ట్ గ్రూప్ ఆర్థికవేత్త  ఫిలిప్ కెన్వర్తీ; గ్రీన్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ మేనేజర్ . పీటర్ ఓక్సెన్  తదితరులు వెబినార్ లో ప్రసంగించారు. 

 

 

***



(Release ID: 2006336) Visitor Counter : 131