బొగ్గు మంత్రిత్వ శాఖ
జిఇఎం సేకరణలో అగ్ర స్థానాన్ని తిరిగిపొందిన బొగ్గు మంత్రిత్వ శాఖ
రూ. 63,890 కోట్ల విలువైన సేకరణ చేసిన బొగ్గు మంత్రిత్వ శాఖ, బొగ్గు పిఎస్‌యులు
సిపిఎస్ఇలలో అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్న కోల్ ఇండియా లిమిటెడ్
प्रविष्टि तिथि:
14 FEB 2024 5:05PM by PIB Hyderabad
ఆర్ధిక సంవత్సరం 2023-24 పెట్టుకున్న లక్ష్యాన్ని దాటుకుని గవర్నమెంట్ ఇ- మార్కెట్ ప్లేస్ (జిఇఎం- ప్రభుత్వ ఇ- మార్కెట్) సేకరణలో విశిష్టమైన మైలురాయిని బొగ్గు మంత్రిత్వ శాఖ సాధించింది. ఫిబ్రవరి 14, 2024 నాటికి జిఇఎం ద్వారా సేకరణ వార్షిక లక్ష్యం రూ. 21,325 కోట్లను 300% న్ని మించి, రూ. 63,890 కోట్లకు పెరిగింది.
ఈ అసాధారణ విజయంతో జిఇఎం సేకరణలకు సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖలన్నింటిలో బొగ్గు మంత్రిత్వ శాఖ అగ్రాన నిలిచింది. అదనంగా, అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలో (సిపిఎస్ ఇలు) కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) తన అగ్ర స్థానాన్ని నిలుపుకుంది.
జిఇఎం సేకరణలో ఈ విశేషమైన పెరుగుదల మంత్రిత్వ శాఖ అంకితభావాన్ని పట్టి చూపడమే కాక బొగ్గు ప్రభుత్వ రంగ సంస్థలతో ఆరోగ్యవంతమైన సహకారాన్ని తోడ్పాటును నొక్కి చెబుతుంది. వాటి సానుకూల భాగస్వామ్యమే జిఇఎం సేకరణ విజయగాథకు ప్రధానచోదక పరికరంగా నిలిచి, భారతదేశంలోని బొగ్గు రంగంలో కీలక భాగస్వాములుగా తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి.
సిఐఎల్/ ఎన్ఎల్‌సిఐఎల్ సహా భాగస్వాములందరికీ ఈ చారిత్రిక మైలురాయిని సాధించేందుకు చేసిన అవిశ్రాంత కృషి, అంకితభావానికి బొగ్గు మంత్రిత్వ శాఖ కృతజ్ఞతలు తెలిపింది. ఈ విజయం జిఇఎం సేకరణ దిశగా బొగ్గు మంత్రిత్వ శాఖ అంకితభావాన్ని ప్రదర్శించడమే కాక ప్రభుత్వ సేకరణ ప్రక్రియలను క్రమబద్ధీకరించడంలో భవిష్యత్తులో జరిగే కృషికి ప్రమాణాలను నిశ్చయిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2006179)
आगंतुक पटल : 133