రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

రక్షణ రంగంలో స్వయంసమృద్ధి: భారత నౌకాదళం & తీర రక్షణ దళానికి ఆధునిక ఆయుధాలు అందించేందుకు ఏడబ్ల్యూఈఐఎల్‌తో రూ.1,752 కోట్ల విలువైన ఒప్పందం చేసుకున్న రక్షణ మంత్రిత్వ శాఖ

Posted On: 14 FEB 2024 3:01PM by PIB Hyderabad

భారత నౌకాదళం & తీర రక్షణ దళానికి 12.7 ఎం.ఎం. 'స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్ గన్స్‌' (ఎస్‌ఆర్‌సీజీ) అందించేందుకు కాన్పూర్‌లోని 'అడ్వాన్స్‌డ్ వెపన్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్'తో (ఏడబ్ల్యూఈఐఎల్‌) రక్షణ మంత్రిత్వ శాఖ ఈ రోజు ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 463 'స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్ గన్స్‌'ను 85% పైగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసి, సరఫరా చేయాలి. ఈ ఒప్పందం విలువ రూ.1752.13 కోట్లు.

ఎస్‌ఆర్‌సీజీలు అందితే భారత నౌకాదళం & తీర రక్షణ దళం సామర్థ్యం పెరుగుతుంది. నౌకలకు ముప్పు కలిగించే చిన్నపాటి లక్ష్యాలను పగలైనా & రాత్రయినా, ఎలాంటి వాతావరణంలోనైనా ఖచ్చితంగా ఛేదించడానికి వీలవుతుంది.

ఈ ఒప్పందం రక్షణ రంగంలో స్వయంసమృద్ధికి ప్రోత్సాహకరంగా మారుతుంది. 125 మంది భారతీయ విక్రేతలు, డీపీఎస్‌యూలు 5 సంవత్సరాలకు పైగా ఈ పనిలో నిమగ్నమవుతాయి.

***


(Release ID: 2006176) Visitor Counter : 92