పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ముంబై విమానాశ్రయంలో ఎయిర్ స్పేస్ రద్దీని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు
విమానాల రాకపోకలు ఎక్కువగా ఉన్న సమయంలో గంటకు 46 నుంచి 44 వరకు,విమానాల రాకపోకలు తక్కువగా ఉన్న సమయంలో గంటకు 44 నుంచి 42 వరకు విమానాల కదలికలను నియంత్రించాలని విమానాశ్రయ ఆపరేటర్‌కు ఆదేశాలు జారీ చేసిన ఏఏఐ
రాకపోకలు ఎక్కువగా ఉన్న సమయంలో సాధారణ విమానయాన విమాన కార్యకలాపాలు కూడా పరిమిత అనుమతులు
Posted On:
14 FEB 2024 1:25PM by PIB Hyderabad
కోవిడ్ తర్వాత ప్రయాణాలపై విధించిన ఆంక్షలు ఎత్తివేయడంతో విమానాశ్రయాలకు వచ్చి పోతున్న విమానాల సంఖ్య గణనీయంగా పెరిగింది. విమానాల రాకపోకలు పెరగడంతో ఎయిర్ స్పేస్ రద్దీ కూడా అదే స్థాయిలో పెరిగింది. దేశంలోఅత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ముంబై విమానాశ్రయం ఒకటిగా ఉంది. విమానాల రాకపోకలు పెరగడంతో ముంబై విమానాశ్రయం రన్‌వేల సామర్ధ్యానికి మించి రద్దీ పెరిగింది.దీంతో ముంబై విమానాశ్రయంలో ఎయిర్ స్పేస్ రద్దీ ఏర్పడింది. దీని వలన దిగడానికి అనుమతి లభించకపోవడంతో విమానాలు దాదాపు 40-60 నిమిషాల పాటు నగరం మీదుగా చక్కర్లు కొట్టాల్సి వస్తోంది.
సాధారణంగా ఒక విమానం గంటకు సగటున 2000 కిలోల ఇంధనాన్ని వినియోగిస్తుంది. ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే ఎక్కువ సమయం ఆకాశంలో ఎక్కువ సమయం చక్కర్లు కొట్టడం వల్ల ఇంధనం అనవసరంగా ఖర్చు అవుతుంది. 40 నిమిషాల ప్రదక్షిణ సమయానికి 1.7 కిలోలీటర్ల జెట్ ఇంధనం (సుమారు రూ. 1.8 లక్షలు) వరకు ఇంధనం వృథా అవుతోంది. . వరకు గాలిలో 60 నిమిషాల ప్రదక్షిణ సమయం కోసం.దాదాపు 2.5 కిలోలీటర్ల జెట్ ఇంధనం (సుమారు రూ. 2.6 లక్షలు) అవసరం ఉంటుంది. ఇంధన ధరల పెరుగుదల అంతిమంగా వినియోగదారులపై పడుతుంది. ఇది విమానాశ్రయాల కార్యకలాపాల సామర్థ్యంపై కూడా ప్రభావం చూపుతుంది, విమానాలు ఎక్కువ సేపు వేచి ఉండాల్సి ఉంటుంది. వీటివల్ల చోటు చేసుకునే విపరీతమైన జాప్యాలు ప్రయాణికులు, విమానయాన సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
ఎయిర్ స్పేస్ రద్దీని పరిష్కరించడానికి అమలు చేయాల్సిన చర్యలపై ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక అధ్యయనం నిర్వహించింది. విమానాల రాకపోకలు ఎక్కువగా ఉండే 6 గంటల హై ఇంటెన్సిటీ రన్‌వే ఆపరేషన్స్ ( 0800 గంటల నుండి 1100 గంటల వరకు,1700 వరకు 2000 గంటలు) కాలంలో గంట కాలంలో రాకపోకలు సాగించే విమానాల సంఖ్య రోజులో మిగిలిన 18 గంటలలో గంటకు అనుమతించబడిన విమాన ట్రాఫిక్‌కు దాదాపు సమానంగా ఉందని అధ్యయనంలో గుర్తించారు. ఈ సమయంలో సాధారణ విమానాలు, మిలటరీ విమానాల కార్యకలాపాలు కూడా ఎలాంటి పరిమితులు లేకుండా సాగుతున్నాయి. . అంతేకాకుండా, విలోమ రన్‌వేలు ఉన్నందున, షెడ్యూల్ చేయని విమానాల నిర్వహణ రద్దీ సమయాల్లో విమాన ట్రాఫిక్ రద్దీ మరింత పెంచుతుంది.
ముంబై విమానాశ్రయం పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నప్పుడు రద్దీ ఏర్పడడానికి గల కారణాలను అధ్యయనంలో గుర్తించారు. (i) విమానాశ్రయ ఆపరేటర్ పరిమిత సమయ మార్జిన్‌లతో ఎక్కువ స్లాట్ లు జారీ చేయడం , (ii) విమాన సంస్థలు స్లాట్ల సమయాన్ని పాటించక పోవడం (iii) రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో షెడ్యూల్ చేయని కార్యకలాపాలను అనుమతించడం వల్ల రద్దీ ఏర్పడుతుందని గుర్తించారు. స్లాట్లను కేటాయించడానికి, స్లాట్లు సక్రమంగా అమలు జరిగేలా చూసే బాధ్యత సంబంధిత . ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్ పై ఉంటుంది.రద్దీ సమస్యను పరిష్కరించడానికి, ఎయిర్ ట్రాఫిక్ కదలికలను క్రమబద్ధీకరించడానికి, నియంత్రించడానికి ఆపరేటర్ ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే, ముంబై విమానాశ్రయంలో ముందస్తు చర్యలు అమలు కాకపోవడంతో రద్దీ ని నియంత్రించడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగవలసి వచ్చింది. ఎయిర్ నావిగేషన్ సర్వీస్ ప్రొవైడర్ హోదాలో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్‌కు నోటీసు రూపంలో ఎయిర్మెన్ (నోటామ్స్) రూపంలో ఆదేశాలు జారీ చేసింది. 2024 జనవరి 2,న నోటీసులు జారీ అయ్యాయి. దీని ప్రకారం విమానాల రాకపోకలు ఎక్కువగా ఉండే సమయంలో (అంటే 0800 గం- 1100 గం., 1700 - 2000 గం & 2115 గంటలు -2315 గం) ఎయిర్ ట్రాఫిక్ కదలికలను (ATM) గంటకు 46 నుండి 44 వరకు పరిమితం చేసింది. మిగిలిన సమయంలో గంటకు 46 నుంచి 44 వరకు రాకపోకలను అనుమతిస్తారు. సాధారణ విమానయాన విమాన కార్యకలాపాలు కూడా పరిమితంగా జరుగుతాయి. అన్ని విమానయాన సంస్థలు నిర్దేశించిన పరిమితులకు లోబడి కార్యకలాపాలు సాగించేలా ముంబై విమానాశ్రయ ఆపరేటర్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ చర్య వల్ల ముంబై విమానాశ్రయంలో ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యం కలగదు. గగనతల భద్రత, కార్యకలాపాల సామర్థ్యం , ప్రయాణీకుల సంతృప్తి పెరుగుతుంది.
విమానాశ్రయ ఆపరేటర్లు,ఎయిర్‌లైన్స్ రెండింటి అవసరాల మధ్య సమతుల్యతను సాధించడానికి జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది
***
(Release ID: 2006037)