వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
చిరుధాన్యాల ఆధారిత విలువ జోడించిన ఉత్పత్తులను మార్కెటింగ్ & ఎగుమతి చేయడంలో దాదాపు 500 స్టార్టప్‌లకు సౌలభ్యతను, సౌకర్యాన్ని అందిస్తున్న ఎపిఇడిఎ
వండటానిక సిద్ధంగా ఉన్న 14 మెట్రిక్ టన్నుల చిరుధాన్యాలను ఆస్ట్రేలియాకు రవాణా చేస్తూ, ఎగుమతిదారుగా మారిన సంగ్రూర్ రైతు
Posted On:
13 FEB 2024 5:29PM by PIB Hyderabad
దాదాపు 500 స్టార్టప్‌లకు చిరుధాన్యాల ఆధారిత విలువ జోడించిన ఉత్పత్తులను మార్కెటింగ్& ఎగుమతి చేయడంలో అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎపిఇడిఎ- వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి ప్రాధికరణ సంస్థ) సౌకర్యాలు, సౌలభ్యాన్ని కల్పిస్తోంది. ఎగుమతిదారుగా రూపాంతరం చెందిన సంగ్రూర్‌కు చెందిన ఒక రైతు, శ్రీ దిల్ ప్రీత్ సింగ్ కు చెందిన సుమారు 45, 803 యుఎస్ డాలర్ల విలువైన మొదటి ఎగమతి సరుకు 14.3 మెట్రిక్ టన్నుల చిరుధాన్యాలు, దాని ఉత్పత్తులను పంపడానికి ఎపిఇడిఎ చైర్మన్ శ్రీ అభిషేక్ దేవ్ జెండా ఊపి తరలింపుకు అనుమతించారు.
ఈ ఎగుమతి సరుకులో కోడో చిరుధాన్యాల నుంచి ఉత్పన్నం చేసిన వండటానికి సిద్ధంగా ఉన్న (రెడీ టు కుక్) చిరుధాన్యాలు, ఫాక్స్‌టెయిల్ చిరుధాన్యాలు, చిన్న చిరుధాన్యాలు, బ్రౌన్‌టాప్ రకం చిరుధాన్యాలు, బార్న్‌యార్డ్ రకం చిరుధాన్యాలు ఉన్నాయి. అదనంగా, రాగి, జొవార్, బాజ్రా, ఫాక్స్‌టెయిల్ కోడో, బార్న్‌యార్డ్, బ్రౌన్ టాప్, చిన్న, ప్రోసో రకం చిరుధాన్యాల పిండివంటివన్నీ కూడా ఈ ప్రత్యేక ఎగుమతి కృషిలో భాగంగా ఉన్నాయి.
వీటిని సిడ్నీలో దిగుమతి చేసుకోనున్న దిగుమతిదారు శ్రీ జస్వీర్ సింగ్ కూడా దృశ్యమాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సహకారాన్ని సులభతరం చేయడంలో వారు అందించిన విస్త్రతమైన తోడ్పాటుకు ఎపిఇడిఎకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మరిన్ని వ్యాపార అవకాశాలను విస్తరించడం పట్ల సానుకూల భావంతో ఉండటమే కాక, భవిష్యత్తులో కూడా ఇటువంటి సరుకును మరింతగా దిగుమతి చేసుకుంటానని హామీ ఇచ్చారు. కొనుగోలుదారుకు అవసరమైన పూర్తి విలువ లంకె నియంత్రణను రైతు మొదటి నుంచి చివరి వరకు నియంత్రణను కలిగి ఉంటాడు. అతడు తన సొంత పొలాల్లో చిరుధాన్యాలను సాగు చేసి, ప్యాకేజింగ్‌తో సహా తన స్వంత యూనిట్‌లో ప్రాథమిక, ద్వితీయ స్థాయి శుద్ధి నిర్వహిస్తాడు.
ఈ విజయ గాథ, వ్యవసాయ ఎగుమతులలో శ్రీ దిల్‌ప్రీత్ వంటి రైతులు కీలక సహకారులుగా మారడం అన్నది వ్యవసాయ రంగాన్ని పరివర్తన చేయవచ్చో పట్టి చూపి, ఉదాహరణగా నిలుస్తుంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశించే స్థానిక రైతుల సాధికారతకు ప్రతీకగా నిలుస్తుంది.
చిరుధాన్యాల ఎగుమతులు 2021-22లో యుఎస్‌డి 62.95 మిలియన్ల నుంచి 2022-23లో యుఎస్‌డి 75.45 మిలియన్లకు, ఏప్రిల్- నవంబర్ 2023 నుంచి ప్రస్తుత ఎగుమతులు యుఎస్‌డి 45.46 మిలియన్ల పెరుగుదలను కలిగి ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చిరుధాన్యాలు ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. విలువ జోడించిన చిరుధాన్యాల ఉత్పత్తులతో సహా తృణధాన్యాల తయారీ ఎగుమతి లో గణనీయమైన పెరుగుదల ఉంది. గత ఏడాది ఇదే కాలంలో 12.4% వృద్ధి నమోదైంది.
***
(Release ID: 2005960)
Visitor Counter : 75