గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
యూనిక్ ల్యాండ్ పార్శిల్ ఐడెంటిఫికేషన్ నంబర్‌ను ప్రారంభించడంతో పాటు అస్సాం వ్యాప్తంగా నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌ను ప్రారంభించిన సెక్రటరీ శ్రీమతి. నిధి ఖరే
ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్‌మెంట్‌లో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు అస్సాంలోని దర్రాంగ్ జిల్లాలో బ్లాక్‌చెయిన్‌ను పైలట్ ప్రారంభం
ల్యాండ్ రికార్డ్స్ డేటాపై నమ్మకం, ఆడిటబిలిటీ, ట్రేస్‌బిలిటీ, ఇమ్యుటబిలిటీని నిర్ధారించడానికి బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ
Posted On:
13 FEB 2024 2:43PM by PIB Hyderabad
భూ వనరుల శాఖ సెక్రటరీ శ్రీమతి నిధి ఖరే అస్సాం వ్యాప్తంగా నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎన్‌జిజీఆర్‌ఎస్)ని ప్రారంభించారు. అలాగే జియో రిఫరెన్స్డ్ కాడాస్ట్రాల్ మ్యాప్‌ల యూనిక్ ల్యాండ్ పార్సెల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూఎల్‌పిఐఎన్) సీడింగ్‌ను కూడా ప్రారంభించారు. అస్సాం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ సైదైన్ అబ్బాసీ ఈరోజు పైలట్ ప్రాజెక్ట్‌గా దర్రాంగ్ జిల్లాలో ల్యాండ్ రికార్డ్స్‌లో బ్లాక్‌చెయిన్ రోల్‌అవుట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని అస్సాం ప్రభుత్వ రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ విభాగం నిర్వహించింది.
కార్యక్రమంలో ప్రసంగించిన శ్రీమతి.నిధి ఖరే..భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, భూ వనరుల శాఖ ప్రారంభించిన ప్రాజెక్ట్ ఎన్‌జిడిఆర్‌ఎస్, వన్ నేషన్ వన్ సాఫ్ట్‌వేర్ చొరవ కింద దేశవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ విభాగాల కోసం అభివృద్ధి చేయబడిన అప్లికేషన్ అని సూచించారు. ఎన్‌జిడిఆర్‌ఎస్ అప్లికేషన్‌ను ఎన్‌ఐసి పూణే అభివృద్ధి చేసిందని మరియు ఎన్‌జిడిఆర్‌ఎస్ అస్సాం ఇన్‌స్టాన్స్ స్టేట్ డేటా సెంటర్ (ఎస్‌డిసి)లో హోస్ట్ చేయబడిందని చెప్పారు. అస్సాంలో ఎన్‌డిజిఆర్‌ఎస్‌ను అస్సాం ముఖ్యమంత్రి నవంబర్ 14, 2022న ప్రారంభించారు. ప్రస్తుతం ఎన్‌జిడిఆర్‌ఎస్ రెండు జిల్లాల ఎస్‌ఆర్‌ఓలలో అంటే కామ్‌రూప్ మరియు దర్రాంగ్‌లలో విస్తరించబడింది మరియు ఇప్పుడు అస్సాంలోని మొత్తం 77 ఎస్‌ఆర్‌ఓలలో ఎన్‌జిడిఆర్ఎస్ అందుబాటులోకి వచ్చింది. ఎన్‌జిడిఆర్‌ఎస్ అస్సాం ఉదాహరణకు సంబంధించి క్రింది ముఖ్య లక్షణాలను ఆమె మరింత హైలైట్ చేశారు:
- అస్సాం ఎన్‌జిడిఆర్‌ఎస్ జోనల్ విలువ మరియు ప్లేస్ కోసం ధరిత్రితో అనుసంధానించబడింది. పార్టీ మరియు భూమి వివరాల కోసం ఎన్‌ఓసి, ఆన్‌లైన్ చెల్లింపు కోసం ఇగ్రాస్, సేవా సేతుకు ఇ-స్టాంప్ మరియు పౌర సేవలు (నాన్ ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్, సర్టిఫైడ్ కాపీ, వివాహ నమోదు, దస్తావేజు నమోదు )
- ఆర్టికల్స్ ఫీజులు స్వయంచాలకంగా గణింపబడతాయి
- మొత్తం 76 ఆర్టికల్స్ ఎన్‌జిడిఆర్‌ఎస్‌లో కాన్ఫిగర్ చేయబడ్డాయి
శ్రీమతి నిధి ఖరే రెవెన్యూ & డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌తో పాటు ప్రభుత్వం ప్రారంభించిన ఐటీ సంస్కరణల్లో ఒకటైన బ్లాక్‌చెయిన్ ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేశారు. అస్సాంలో ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్‌మెంట్‌లో సమూల పరివర్తనను తీసుకురావడానికి ల్యాండ్ రికార్డ్స్ డేటాపై నమ్మకం, ఆడిటబిలిటీ, ట్రేస్‌బిలిటీ, ఇమ్యుటబిలిటీని నిర్ధారించడానికి. బ్లాక్‌చెయిన్‌తో ల్యాండ్ రికార్డ్‌లను భద్రపరచడం యొక్క లక్ష్యం లావాదేవీలను రికార్డ్ చేయడానికి మరియు పంపిణీ చేయడానికి అనుమతించడమేనని ఆమె నొక్కిచెప్పారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ క్రిప్టోగ్రఫీ మరియు డిస్ట్రిబ్యూట్ నెట్‌వర్క్ నోడ్‌ల ప్రత్యేక కలయిక విశ్వసనీయ పర్యావరణ వ్యవస్థలో డేటాను నిర్వహించడానికి మరియు ధృవీకరించడానికి అనుమతిస్తుంది.యుఎల్‌పిఐఎన్ (యూనిక్ ల్యాండ్ పార్శిల్ ఐడెంటిఫికేషన్ నంబర్) అనేది ప్రత్యేకమైన బ్లాక్‌చెయిన్ ఐడీగా తీసుకోబడుతుంది మరియు భునాక్ష నుండి యుఎల్‌పిఐఎన్‌ని ఉపయోగించి ల్యాండ్ పార్శిల్ ప్రత్యేకంగా గుర్తించబడుతుందని కూడా సూచించబడింది. ప్రతి ల్యాండ్ పార్శిల్‌కు 14 అంకెల ఆల్ఫా న్యూమరిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ అయిన యుఎల్‌పిఐఎన్‌ని భూమికి ఆధార్ లేదా వేలిముద్రగా వర్ణించవచ్చని శ్రీమతి ఖరే వివరించారు. ల్యాండ్ పార్సెల్ రేఖాంశం మరియు అక్షాంశంపై గుర్తింపు ఆధారపడి ఉంటుంది మరియు భౌగోళిక-సూచించిన కాడాస్ట్రాల్ మ్యాప్‌లపై ఆధారపడి ఉంటుంది. యూఎల్‌పిఐఎన్ యొక్క ప్రయోజనాలు అన్ని లావాదేవీలలో ప్రత్యేకతను నిర్ధారించడం, ప్రాదేశిక రికార్డులను తాజాగా ఉంచడం, ఆస్తి లావాదేవీలను అనుసంధానించడం, శాఖలు, ఆర్థిక సంస్థలలో భూ రికార్డుల డేటాను పంచుకోవడం మరియు మోసపూరిత లావాదేవీలను తొలగించడం అని ఆమె హైలైట్ చేశారు. ఎన్‌జిడిఆర్‌ఎస్‌లో దస్తావేజు ఎస్‌ఆర్‌ఓ ద్వారా డిజిటల్‌గా సంతకం చేయబడుతుంది మరియు దస్తావేజు ఆమోదం పొందిన తర్వాత బ్లాక్‌చెయిన్‌లో నిల్వ చేయబడుతుంది. బ్లాక్‌చెయిన్ ప్రారంభం నుండి చివరి వరకు భద్రత, జవాబుదారీతనం మరియు రికార్డు పరిశీలనను అందిస్తుందని ఆమె పేర్కొన్నారు. జిల్లా స్థాయి బ్లాక్‌చెయిన్ ఆధారిత క్యాడాస్ట్రే మరియు ల్యాండ్ రికార్డ్స్ రిజిస్ట్రీ పైలట్ దర్రాంగ్ జిల్లాలో ప్రారంభించబడింది మరియు త్వరలో అస్సాం వ్యాప్తంగా ప్రారంభించబడుతుంది.
***
(Release ID: 2005948)
Visitor Counter : 99