సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వకు చెందిన సాంకేతికత కేంద్రాలు, విస్తరణ కేంద్రాలు, అభివృద్ధి కార్యాలయాలను రేపు ప్రారంభించనున్న శ్రీ నారాయణ్ రాణే

Posted On: 13 FEB 2024 4:19PM by PIB Hyderabad

కేంద్ర సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే, గ్రేటర్ నోయిడాలో ఎంఎస్‌ఎంఈ సాంకేతికత కేంద్రాన్ని రేపు ప్రారంభించనున్నారు. ఉత్తరప్రదేశ్ ఎంఎస్‌ఎంఈ మంత్రి శ్రీ రాకేష్ సచన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

కాన్పూర్ (ఉత్తర్‌ప్రదేశ్), బద్ది (హిమాచల్‌ప్రదేశ్), ఇంఫాల్‌లో (మణిపూర్) సాంకేతికత కేంద్రాలను కేంద్ర మంత్రి ప్రారంభిస్తారు. కరీంనగర్, భవానీపట్నంలో (ఒడిశా) విస్తరణ కేంద్రాలను కూడా వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభిస్తారు. డెహ్రాడూన్‌ (ఉత్తరాఖండ్), లద్దాఖ్‌లోనూ అభివృద్ధి & సౌకర్యాల కార్యాలయాలను వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభిస్తారు.

వివిధ విభాగాల్లోని ఎంఎస్‌ఎంఈలు, తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఒక ప్రదర్శనశాలను కూడా ఏర్పాటు చేశారు. కేవీఐసీ, కాయిర్‌ బోర్డ్ స్టాళ్లతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక ఓడీఓపీ ఉత్పత్తుల స్టాళ్లను కూడా నిర్వహిస్తున్నారు. ఇంక్యుబేటర్లు, మహిళా పారిశ్రామికవేత్తలు, ఎస్‌టీ/ఎస్‌సీ పారిశ్రామికవేత్తల కోసం స్టాళ్లు కేటాయించారు. ఈ సందర్భంగా, 100 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు ఓడీఓపీ పథకం కింద టూల్‌కిట్‌లను కూడా పంపిణీ చేస్తారు.

పీఎం విశ్వకర్మ పథకాన్ని 17.09.2023న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. 18 విభాగాలకు చెందిన కళాకారులకు మద్దతు అందించే సంపూర్ణ పథకం ఇది. 11.02.2024 నాటికి, ఈ పథకం కింద మొత్తం 4,10,464 దరఖాస్తులు నమోదయ్యాయి. పీఎం విశ్వకర్మ పథకంపై అవగాహన కల్పించేందుకు, ఈ పథకం పరిధిలోకి వచ్చే విభాగాలకు సంబంధించి, ఒక ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను కూడా ప్రదర్శనలో నిర్వహిస్తారు.

 

***



(Release ID: 2005745) Visitor Counter : 48